News
News
X

Tamilisai: కేసీఆర్ సర్కార్‌కు గవర్నర్‌ షాక్! ఆ ఒక్క ట్వీట్‌తో ఇరుకున పెట్టేలా..

ఏటా సెప్టెంబర్ 17వ తేదీ వచ్చిందంటే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఈ అంశంపైనే చర్చ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అమిత్ షా నిర్మల్ పర్యటన సందర్భంగా విమోచన దినం గురించి గట్టిగా ప్రస్తావించారు.

FOLLOW US: 

తెలంగాణలో విమోచన దినం గురించి ఏటా వివాదం నడుస్తూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం సెప్టెంబరు వచ్చిందంటే చాలు ఆ నెల 17వ తేదీన విమోచన దినం అధికారికంగా జరపాలనే డిమాండ్లు రాజకీయ పార్టీల నుంచి ఊపందుకుంటాయి. అయితే, కేసీఆర్ ప్రభుత్వం మాత్రం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడానికి నిరాకరిస్తున్నారు. నిజానికి గతంలో ఆయనే అధికారికంగా విమోచన దినం జరుపుతామని ప్రకటించి.. ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు. 

దీంతో ఏటా సెప్టెంబర్ 17వ తేదీ వచ్చిందంటే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఈ అంశంపైనే చర్చ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అమిత్ షా నిర్మల్ పర్యటన సందర్భంగా విమోచన దినం గురించి గట్టిగా ప్రస్తావించారు. కేసీఆర్ ఎందుకు ఆ వేడుకను జరపడం లేదని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని, తప్పకుండా విమోచన దినాన్ని జరిపి తీరతామని ప్రకటించారు. దీన్ని టీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి ఇష్టం లేని ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలు ఈ నెల 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని, వీరోచిత పోరాటం చేసి అసువులు బాసిన వారికి నివాళులర్పించాలంటూ ట్వీట్ చేశారు. రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న రాష్ట్ర ప్రథమ పౌరురాలు విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలంటూ బహిరంగ ప్రకటన విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

‘‘సెప్టెంబర్ 17 న హైదరాబాద్ విమోచన దినం జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. స్వాతంత్య్ర పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అని తెలుగులో, ఇంగ్లీషులో కూడా తమిళిసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు.

సెప్టెంబర్ నెల 17వ తేదీని విమోచన దినోత్సవంగా అధికారికంగా జరపాలని బీజేపీ తీవ్ర స్థాయిలో డిమాండ్ చేస్తున్నా, మాటలతో రెచ్చగొడుతున్నా సరే టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించడం లేదు. పైగా సంయమనం పాటిస్తోంది. మైనార్టీలను సంతృప్తి పరచడానికి, మజ్లీస్ పార్టీ ఒత్తిడికి తల వంచి రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదన్న విమర్శలు విపరీతంగా చేస్తూ వస్తున్నారు. అయితే, బీజేపీ మతం పేరిట రెచ్చగొట్టే రాజకీయం చేస్తోందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీంతో ఈ ఏడాది ఒక అడుగు ముందుకేసిన బీజేపీ.. ఏకంగా తెలంగాణ విమోచన సభ పేరుతో పెద్ద సభ నిర్వహించి టీఆర్ఎస్‌ను మరింత ఇరుకున పెట్టింది. ఆ సభకు అమిత్ షాను ఆహ్వానించి, విమోచన దినం గురించి గట్టిగా నిలదీయించింది. ఇది టీఆర్ఎస్ నేతలకు మింగుడు పడని విషయమే. ఈ సభలో అమిత్ షా, బండి సంజయ్ చేసిన విమర్శలు, ఆరోపణలపై ఇప్పటిదాకా టీఆర్ఎస్ నేతలు స్పందించలేదు.

Published at : 17 Sep 2021 11:04 PM (IST) Tags: telangana governor Telangana Govt tamilisai soundararajan Telangana liberation day telangana vimochan day

సంబంధిత కథనాలు

Rains In AP Telangana: మరో ఐదు రోజులపాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, IMD ఎల్లో అలర్ట్ జారీ

Rains In AP Telangana: మరో ఐదు రోజులపాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, IMD ఎల్లో అలర్ట్ జారీ

TS New Mandals : తెలంగాణలో కొత్తగా 13 మండలాలు, తుది నోటిఫికేషన్ జారీ

TS New Mandals : తెలంగాణలో కొత్తగా 13 మండలాలు, తుది నోటిఫికేషన్ జారీ

Loan App Suicide : 'అమ్ము ఐ యామ్ సారీ, ఇంకా బతకాలని లేదు', లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి!

Loan App Suicide : 'అమ్ము ఐ యామ్ సారీ, ఇంకా బతకాలని లేదు', లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి!

Hyderabad Rains : హైదరాబాద్ లో కుండపోత వర్షం, ఈ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

Hyderabad Rains : హైదరాబాద్ లో కుండపోత వర్షం, ఈ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

Mla Jagga Reddy : సీఎం జగన్, షర్మిల బీజేపీ వదిలిన బాణాలే, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Mla Jagga Reddy : సీఎం జగన్, షర్మిల బీజేపీ వదిలిన బాణాలే, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Minister RK Roja : టీడీపీ జంబలకడిపంబ పార్టీ, ఆడవాళ్లు తొడలు కొడతారు మగవాళ్లు ఏడుస్తారు- మంత్రి రోజా

Minister RK Roja : టీడీపీ జంబలకడిపంబ పార్టీ, ఆడవాళ్లు తొడలు కొడతారు మగవాళ్లు ఏడుస్తారు- మంత్రి రోజా

Bigg Boss 6 Telugu Episde 23: హౌస్ టార్గెట్ ఇనయా, ఇలాగే అయితే ఇనయా ఆర్మీ రెడీ అవ్వడం ఖాయం, నామినేట్ అయింది వీళ్లే

Bigg Boss 6 Telugu Episde 23: హౌస్ టార్గెట్ ఇనయా, ఇలాగే అయితే ఇనయా ఆర్మీ రెడీ అవ్వడం ఖాయం, నామినేట్ అయింది వీళ్లే

Dimorphos Asteroid ను ఢీకొట్టిన డార్ట్ స్పేస్ క్రాఫ్ట్, NASA ప్రయోగం విజయవంతం

Dimorphos Asteroid ను ఢీకొట్టిన డార్ట్ స్పేస్ క్రాఫ్ట్, NASA ప్రయోగం విజయవంతం

Petrol-Diesel Price, 27 September: పెరుగుతున్న చమురు ధర, మీ సిటీ రేట్లు ఇవిగో!

Petrol-Diesel Price, 27 September: పెరుగుతున్న చమురు ధర, మీ సిటీ రేట్లు ఇవిగో!