అన్వేషించండి

ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి ఘటనలో గవర్నర్‌ ఎంట్రీ- ఏం జరిగిందో చెప్పాలని డీజీపీకి ఆదేశాలు

ఎంపీ అర్వింద్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు గవర్నర్‌ తమిళిసై. దీనిపై నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించాారు.

నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు దాడి చేసిన ఘటనను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలలో ఇలాంటి దాడులకు అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. అసలు ఏం జరిగిందో చెప్పాలంటూ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. ఓ ఎంపీ ఇంటిపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసిన సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని సూచించారు. ఎంపీ ఇంటిపై దాడి చేయడమే కాకుండా అక్కడ ఉండే వారిని బెదిరించడం భయపెట్టడాన్ని ఆమె ఖండించారు. 

ఎనిమిది మంది అరెస్టు 

బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి కేసులో ఇప్పటికే 8 మంది టిఆర్ఎస్ కార్యకర్తలని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఉన్న ఇంటిపై శుక్రవారం దాడి జరిగింది. ఆ సమయంలో ఎంపీ ఇంట్లో లేరు. ఈ దాడిలో ఇంట్లో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ కారణంగా అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. భారీగా అక్కడకు చేరుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలతో అదుపు చేయడం కష్టంగా మారింది. బీజేపీకి, ఎంపీ అరవింద్ కు వ్యతిరేక నినాదాలు నినాదు చేస్తూ ఇంటి అద్దాలు పగులగొట్టారు. దీనిపై ధర్మపురి అర్వింద్, ఆయన తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు పై టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 8 మంది అరెస్ట్ చేశారు. ఐపీసీ 452,148,427,323,354, r/w 149 సెక్షన్ల కింద దాడి చేసిన వారిపై కేసు నమోదైంది. అరెస్ట్ చేసిన వారిని రాత్రి మేజిస్ట్రేట్ ఎదుట హాజరిచారు. 

కాంగ్రెస్ లో చేరతారని ప్రచారంపై వివాదం.. 
కాంగ్రెస్‌లో చేరేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రయత్నిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ చేసిన కామెంట్స్‌తో ఈ చిచ్చు రేగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఫోన్ చేసిన కవిత... తాను పార్టీలో చేరుతానంటూ చెప్పారని అర్వింద్ నిన్న కామెంట్ చేశారని ప్రచారం జరిగింది. దీనిపై టీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. సీఎం కేసీఆర్ కుటుంబం కుల అహంకారంతో మిడిసిపడుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతతో టచ్ లో ఉన్నారని ఆ పార్టీ సీనియర్ ఆఫీస్ బేరర్ చెప్పారని ఆ మాటకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.  కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే తన ఇంటిపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లోని అర్వింద్ ఇంటిపై దాడి చేయడం..తర్వాత కవిత చెప్పుతో కొడతానని హెచ్చరించిన తర్వాత ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కవితపై తానేం అసభ్యకరంగా మాట్లాడలేదన్నారు. అసత్య ప్రచారం చేయలేదన్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఖర్గేను, కవిత కలిసిందని తాను చెప్పలేదని స్పష్టం చేశారు. 

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్సీ కవితపై ఫిర్యాదు చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. ఎమ్మెల్సీ కవిత తన మీడియా సమావేశంలో వెంటపడి తంతం కొట్టి కొట్టి చంపుతామంటూ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో తెలిపారు. ఆ వెంటనే 50 మంది టీఆర్ఎస్ గూండాలు తన ఇంటిపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఆ 50 మంది టీఆర్ఎస్ నాయకులను ఉసిగొల్పి కవిత తన ఇంటిపై దాడికి పంపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంటిపై దాడి ఘటనలో కల్వకుంట్ల కవిత హస్తం ఉందంటూ ఎంపీ అర్వింద్ ఫిర్యాదు చేశారు. 

తనపై చీటింగ్ కేసు వేస్తానని కవిత ప్రకటించడంపై అర్వింద్ మండిపడ్డారు. తనపై ఏమని కేసు వేస్తారని..  టీఆర్ఎస్ మేనిఫెస్టో మొత్తం చీటింగేనని..  కవిత తన తండ్రిపైనే కేసు పెట్టాలన్నారు. పసుపు రైతులను తాను మోసం చేయలేదన్నారు. నిజామాబాద్ ఎన్నికల్లో 178 మంది నామినేషన్లు వేస్తే అందులో 78 మంది బీజేపీ కండువా కప్పుకున్నారని తెలిపారు. కవితకు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. అన్ని పార్టీలలోనూ తనకు మిత్రులు ఉంటారన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
Manchu Manoj Mother Wrote A Letter: మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
Russia Moscow Blast: రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
Samyuktha Menon :  సమంత అనుకునేరు సంయుక్త.. పింక్ కలర్ పట్టుచీరలో అదిరిపోయింది కదా!
సమంత అనుకునేరు సంయుక్త.. పింక్ కలర్ పట్టుచీరలో అదిరిపోయింది కదా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్ ఘటనలో మరో ట్విస్ట్!Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
Manchu Manoj Mother Wrote A Letter: మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
Russia Moscow Blast: రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
Samyuktha Menon :  సమంత అనుకునేరు సంయుక్త.. పింక్ కలర్ పట్టుచీరలో అదిరిపోయింది కదా!
సమంత అనుకునేరు సంయుక్త.. పింక్ కలర్ పట్టుచీరలో అదిరిపోయింది కదా!
Rohit Sharma Retirement: టెస్టుల నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్‌? డగౌట్ ముందు గ్లౌస్‌లతో సంకేతాలు!
టెస్టుల నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్‌? డగౌట్ ముందు గ్లౌస్‌లతో సంకేతాలు!
Actor Darshan: ఆపరేషన్ అని బెయిల్‌పై బయటకు వచ్చాడు... బాబోయ్ దర్శన్ కేసులో ఈ ట్విస్టేంటి?
ఆపరేషన్ అని బెయిల్‌పై బయటకు వచ్చాడు... బాబోయ్ దర్శన్ కేసులో ఈ ట్విస్టేంటి?
Gautam Bigg Boss Telugu: మెగా ఫ్యామిలీ మనసులు గెలిచాడు... స్టేజిపై గౌతమ్ కృష్ణకు చరణ్ ఏం చెప్పాడంటే?
మెగా ఫ్యామిలీ మనసులు గెలిచాడు... స్టేజిపై గౌతమ్ కృష్ణకు చరణ్ ఏం చెప్పాడంటే?
House Construction Tips: ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ విషయాలను విస్మరిస్తున్నారా?, లక్షలాది రూపాయలు నష్టం!
ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ విషయాలను విస్మరిస్తున్నారా?, లక్షలాది రూపాయలు నష్టం!
Embed widget