Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో గవర్నర్ జోక్యం - CS, DGP కి తమిళిసై కీలక ఆదేశాలు
Jubilee Hills Girl Rape కేసులో నివేదిక అంచాలని సీఎస్, డీజీపీని గవర్నర్ తమిళిసై ఆదేశించారు. 2 రోజుల్లో నివేదిక అందాలని నిర్దేశించారు.
Jubilee Hills Girl Gang Rape Case: జూబ్లీహిల్స్ లో బాలిక సామూహిక అత్యాచార ఘటనలో గవర్నర్ తమిళిసై జోక్యం చేసుకున్నారు. ఆ ఘటనపై సత్వరం నివేదిక అంచాలని సీఎస్, డీజీపీని తమిళిసై ఆదేశించారు. ఆ ఘటనకు సంబంధించి తనకు పూర్తి నివేదికను 2 రోజుల్లో సమర్పించాలని నిర్దేశించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె చెప్పారు.
‘‘బాలికపై అత్యాచార ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనపై వివరమైన నివేదిక 2 రోజుల్లో ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశిస్తున్నాను’’ అని రాజ్ భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
‘‘బాలికపై అత్యాచార ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనపై వివరమైన నివేదిక 2 రోజుల్లో ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశిస్తున్నాను’’ అని రాజ్ భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది మే 4వ తేదీన హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో జరిగిన నాగరాజు హత్య ఘటనలో కూడా, ఈ కేసుకు సంబంధించి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నివేదిక కోరిన సంగతి తెలిసిందే.
పబ్ లో పార్టీ, అనుమతి కోరిన స్కూల్ యాజమాన్యం!
గత మే నెల 28వ తేదీన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. స్థానిక అమ్నేషియా పబ్ లో 28న మధ్యాహ్నం విద్యార్థులు గెట్ టూ గెదర్ పార్టీ చేసుకున్నారు. విద్యార్ధులు సాయంత్రం 5 గంటలకు పబ్ నుండి బయటకు వెళ్లిపోయారు. అయితే పబ్ లోనే 17 ఏళ్ల మైనర్ బాలికను ఆరుగురు యువకులు ఎరుపు రంగు బెర్సిడిస్ బెంజ్ కారులో తీసుకెళ్లారు. ఆ తర్వాత మరో కారు అయిన ఇన్నోవాలోకి వెళ్లి అందులో సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టుగా బాలిక తన వాంగ్మూలంలో పేర్కొంది. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఆలస్యంగా పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
150 మంది విద్యార్థులు పార్టీ చేసుకొనేందుకు వారు చదువుకునే ప్రముఖ స్కూలు యాజమాన్యం పబ్ ను బుక్ చేసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. సదరు కార్పొరేట్ స్కూల్ లెటర్ హెడ్ తో లేఖను పబ్ యాజమాన్యానికి రాశారని పోలీసులు గుర్తించారు.
నిందితులు వీరే!
ఈ కేసులో నిందితులు అంతా రాజకీయ నాయకుల కొడుకులే ఉన్నారు. మొత్తం ఐదుగురు నిందితులు అని తేల్చారు. వీరిలో ఏ - 1 సాదుద్దీన్ మలిక్, ఏ - 2 గా ఓ ఎమ్మె్ల్యే సోదరుడి కొడుకు ఉమేర్ ఖాన్ పేర్లను చేర్చారు. ఇంకా ఎంఐఎం కార్పొరేటర్ కొడుకు (మైనర్), సంగారెడ్డి మున్సిపల్ నేత కొడుకు (మైనర్), ఎమ్మెల్యే కొడుకు (మైనర్) నిందితులుగా ఉన్నారు. అరెస్టయిన ఏ - 1 సాదుద్దీన్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. మరో ఇద్దరు మైనర్లను కూడా అదుపులోకి తీసుకొని జువైనల్ హోంకు తరలించారు. పరారీలో ఉన్న ఇంకో ఇద్దరు మైనర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.