(Source: ECI/ABP News/ABP Majha)
Gold-Silver Price: స్థిరంగా పసిడి ధర.. స్వల్పంగా పెరిగిన వెండి, నేటి ధరలు ఇలా..
విజయవాడలోనూ పసిడి ధర స్థిరంగా కొనసాగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,700 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,760గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు స్థిరంగా ఉంది. వరుసగా రెండు రోజుల పాటు భారీగా తగ్గుతూ వచ్చిన ధరలు తాజాగా నిలకడగా ఉన్నాయి. వెండి ధర కిలోకు రూ.200 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో రూ.44,700 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,760 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో కిలో రూ.67,800గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విజయవాడలోనూ పసిడి ధర స్థిరంగా కొనసాగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,700 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,760గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,800గా ఉంది. ఇక విశాఖపట్నం మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,700 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,760గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.67,800 గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
అయితే, ఇతర నగరాల్లో మాత్రం బంగారం ధరలు నేడు ఇలా ఉన్నాయి. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.44,960గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,050గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,630 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,630గా ఉంది.
ప్లాటినం ధరలో పెరుగుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు గ్రాముకు రూ.47 పెరిగింది. హైదరాబాద్లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,760 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల .ప్లాటినం ధర అంతే ఉంది.
అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.