News
News
X

Hyderabad: హైదరాబాద్‌లో కాలినడకదారులకు గుడ్‌న్యూస్, మరిన్ని అధునాత ఫుట్ బ్రిడ్జిలు

పాదచారులకు ప్రమాదాలు సంభవించకుండా ఫుట్ పాత్ లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టి వారి భద్రతకు జీహెచ్ఎంసీ ప్రాధాన్యం ఇస్తోంది.

FOLLOW US: 
Share:

హైదరాబాద్‌లో వాహన రద్దీ ఎక్కువగా పెరిగింది. దీంతో పాదచారులు ఇరువైపులా సురక్షితంగా రోడ్డు దాటడం ఇబ్బంది అవుతోంది. అందుకోసం పాదచారుల  రక్షణ, భద్రతకు జీహెచ్ఎంసీ విస్తృతమైన చర్యలు చేపట్టింది. పాదచారులకు ప్రమాదాలు సంభవించకుండా ఫుట్ పాత్ లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టి వారి భద్రతకు ప్రాధాన్యం ఇస్తోంది.  ముందుగా ప్రమాదాలు సంభవించే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చొరవ తీసుకుంటోంది.

ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో పాదచారుల ప్రయోజనం కోసం ఫుట్ పాత్ నిర్మాణం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా రోడ్డు సురక్షితంగా దాటేందుకు పాదచారుల కోసం సిగ్నల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తోడు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించి పెడెస్ట్రిరియన్  ఫ్రెండ్లీ నగరంగా తీర్చిదిద్దుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో నగర నలువైపులా అవసరమైన ట్రాఫిక్ రద్దీ అంచనా వేసి  పాదచారులకు ప్రమాదాల నివారణకు ముమ్మర చర్యలు తీసుకున్నారు.

అందులో భాగంగా సురక్షితంగా రోడ్డు దాటేందుకు పాదచారుల కోసం 94 పెడెస్ట్రియన్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తెలంగాణ రాక ముందు 415 కిలోమీటర్లు ఉన్న ఫుట్ పాత్ తెలంగాణ తర్వాత ఇప్పటి వరకు 817 కిలో మీటర్లను రూ.32.75 కోట్ల వ్యయంతో నిర్మాణం చేశారు.

దానికి తోడు ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైన ప్రదేశాలలో పాదచారుల ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టడం జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో గతంలో 20 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను  నిర్మించి అందుబాటులోకి తెచ్చారు. తర్వాత పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరో 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జి లను రూ.75.65 కోట్లతో చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు 8 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులోకి రాగా మిగతావి త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

సిగ్నల్స్, ఫుట్ పాత్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలే కాకుండా నగరంలో ఇటీవల జోన్ కు ఒకటి లేదా 2 చొప్పున ప్రయోగాత్మకంగా చేపట్టిన 12 జంక్షన్లను విస్తరణ, అభివృద్ధి,  సుందరీకరణ పనుల చేపట్టడం జరుగుతుంది. అందులో కూడా పాదచారులకు ప్రయోజనం కల్పించారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో పాదాచారులు హడావుడి లేకుండా ప్రశాంతంగా వెళ్లేందుకు సిట్టింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నారు. 

ఇప్పటి వరకు పూర్తి అయిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు (పాతవి)
1. కాప్రా సర్కిల్ లోని రాధిక సైనిక్ పురి మెయిన్ రోడ్డు ఏ.ఎస్.రావు నగర్, 2. నేషనల్ పోలీస్ అకాడమీ రాజేంద్రనగర్, 3. నియర్ మహవీర్ హాస్పిటల్, 4. నియర్ ఎం.డి.సి మాసబ్ ట్యాంక్, 5. ఎన్టీఆర్ మార్గ్, 6. సీఎం క్యాంప్ ఆఫీస్ గ్రీన్ ల్యాండ్ గెస్ట్ హౌస్, 7. ఎల్.వి.ప్రసాద్ ఐ హాస్పిటల్, రోడ్ నెం.2 బంజారాహిల్స్, 8. ముఫఖం జా కాలేజ్ రోడ్ నెం.3 బంజారాహిల్స్, 9. భారతీయ విద్యా భవన్ స్కూల్, రోడ్ నెం.82, జూబ్లీహిల్స్, 10. నియర్  ఎన్.ఎస్.ఎల్ దివ్య శ్రీ, రాయదుర్గం (వెల్స్ ఫోర్గో ఖాజాగూడ), 11. ఏ.టి ఐ.ఎస్.బి విప్రో, 12. ఐటీసీ కోహినూర్, 13. నియర్ ఓల్డ్ పోలీస్ స్టేషన్ మియాపూర్, 14. నియర్ లక్ష్మి విలాస్ రెస్టారెంట్ మదీనగూడ, 15. నియర్ మలేసియా టౌన్ షిప్ కూకట్ పల్లి, 16. నియర్ 4వ ఫేజ్, కే.పి.హెచ్.పి కాలనీ, 17. కళామందిర్ ఎదురుగా నేషనల్ హైవే 65, 18. గుడ్డెన్మెంట్, 19. రైల్వే నిలయం ఎదురుగా, 20. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉన్నాయి.

కొత్తగా రూ.75.65 కోట్ల వ్యయంతో చేపట్టిన 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలలో రూ.28.10 కోట్ల విలువ గల 8  అందుబాటులోకి వచ్చాయి.

  • కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు
  • చెన్నయ్ షాపింగ్ మాల్ మదీనా గూడ
  • యశోద పియరల్ కాంప్లెక్స్ మియాపూర్
  • హైదరాబాద్ సెంట్రల్ మాల్, పంజాగుట్ట
  • NSKK స్కూల్ దగ్గర బాలానగర్
  • నేరెడ్మెట్ బస్ స్టాప్
  • సెయింట్ ఆన్స్ స్కూల్, సికింద్రాబాద్
  • స్వప్న థియేటర్, రాజేంద్ర నగర్
  • ఈఎస్ఐ హాస్పిటల్, ఎర్రగడ్డ

చేపట్టిన 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలలో బంజారా హిల్స్ లో 3డీ ఎఫెక్ట్ తో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు.

పాదచారుల భద్రత కు కృషి - మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
‘‘పాదచారుల భద్రత కోసం రూ.100 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 38 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నం. అయితే స్థల సమస్య  వలన అనుకున్న లక్ష్యం మేరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను చేపట్ట లేకపోవడం జరిగింది. 76.65 కోట్ల రూపాయల వ్యయంతో 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు  చేపట్టాం. అందులో 8 అందుబాటులోకి వచ్చాయి’’ అని మేయర్ విజయలక్ష్మి అన్నారు.

Published at : 14 Dec 2022 03:07 PM (IST) Tags: GHMC Hyderabad mayor pedestrian bridges foot over bridges Hyderabad Foot bridges

సంబంధిత కథనాలు

TSLPRB:  ఆ పోలీసు అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్‌, హైకోర్టు ఆదేశాల మేరకు బోర్డు కీల‌క నిర్ణ‌యం! ఏంటంటే?

TSLPRB: ఆ పోలీసు అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్‌, హైకోర్టు ఆదేశాల మేరకు బోర్డు కీల‌క నిర్ణ‌యం! ఏంటంటే?

Global EduFest 2023: ఫిబ్రవరి 10న 'గ్లోబల్ ఎడ్యుఫెస్ట్ 2023' నిర్వహిస్తున్న ఐఎంఎఫ్ఎస్

Global EduFest 2023: ఫిబ్రవరి 10న 'గ్లోబల్ ఎడ్యుఫెస్ట్ 2023' నిర్వహిస్తున్న ఐఎంఎఫ్ఎస్

Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

Harish Rao: బీజేపీ ఆ విషయాల్లో డబుల్ సక్సెస్ - అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు సెటైర్లు

Harish Rao: బీజేపీ ఆ విషయాల్లో డబుల్ సక్సెస్ - అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు సెటైర్లు

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం

Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్

Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్

పెళ్లి తర్వాత జంటగా కనిపించిన కియారా-సిద్దార్థ్, ఫోటోలు వైరల్

పెళ్లి తర్వాత జంటగా కనిపించిన కియారా-సిద్దార్థ్, ఫోటోలు వైరల్