By: ABP Desam | Updated at : 19 Dec 2021 03:13 PM (IST)
వివాహం చేసుకున్న సుప్రియో, అభయ్ (ఫైల్ ఫోటో)
తెలంగాణలో రికార్డు క్రియేట్ చేసే వివాహం ఒకటి జరిగింది. ఈ తరహా పెళ్లి తెలంగాణలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిది. ఎందుకంటే అది స్వలింగ సంపర్కుల పెళ్లి. ఇద్దరు మగవారు వివాహం చేసుకున్నారు. రెండు కుటుంబాలకు చెందిన బంధువుల సమక్షంలో ఓ రిసార్టులో అంగరంగ వైభవంగా ఈ ఇరువురు ఒకటయ్యారు. ఇప్పటిదాకా విదేశాల్లో ఈ తరహా పెళ్లిళ్లు చూశాం. కానీ, తాజాగా మన దేశంలో అందులోనూ తెలంగాణలో ఇలాంటి స్వలింగ సంపర్కుల పెళ్లి తొలిసారిగా జరిగింది. హైదరాబాద్ శివారులోని ఓ రిసార్టులో వీరి వివాహం వేడుకగా జరిగింది.
ఇద్దరు పురుషులు ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. తెలంగాణలో పెళ్లి చేసుకున్న మొదటి గే జంటగా వీరు రికార్డు సృష్టించారు. ఇద్దరు మగవాళ్లు లేదా ఇద్దరు ఆడవాళ్లు పెళ్లి చేసుకోవడం భారత్‌లో బాగా అరుదు. మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు అలాంటి పెళ్లిళ్లు జరగలేదు. మొదటిసారిగా తెలంగాణలో ఇద్దరు పురుషులు ఇలా పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. 8 ఏళ్ల క్రితం డేటింగ్ యాప్ ద్వారా వీరు పరిచయం అయ్యారు. ఇలా సుప్రియో, అభయ్ అనే వ్యక్తుల స్నేహం ప్రేమగా మారి.. తాజాగా పెళ్లికి దారి తీసింది.
Also Read: Warangal: వరంగల్ బాలుడికి గ్రేట్ ఛాన్స్.. ఏకంగా ఎలన్ మస్క్‌నే మెప్పించి.. అదేం అంత సులువు కాదు!
సుప్రియో హైదరాబాద్‌లో హోటల్ మెనేజ్‌మెంట్ స్కూల్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అభయ్ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. వీరి వివాహ వేడుక సంప్రదాయబద్ధంగా మంగళస్నానాలు, సంగీత్ వంటి కార్యక్రమాలతో సాగింది. హైదరాబాద్ శివారు వికారాబాద్ హైవేలోని ట్రాన్స్ గ్రీన్‌ఫీల్డ్ రిసార్ట్‌లో శనివారం జరిగిన తెలంగాణ తొలి స్వలింగ సంపర్కుల వివాహ వేడుక కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభంగా జరిగింది. అందరి సమక్షంలో సుప్రియో, అభయ్ లు ఒక్కటయ్యారు.
వీరి ప్రేమకు పెద్దలు కూడా అంగీకారం తెలిపారు. దీంతో వీరు.. డిసెంబరులో వివాహం చేసుకుంటామని గత అక్టోబరులోనే ఒక్కటి కానున్నట్లు సుప్రియో జంట ఓ ప్రకటనలో తెలిపారు. తమ వివాహనికి కుటుంబ సభ్యులను ఒప్పించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టిందని సుప్రియో తెలిపాడు.
Also Read: ఫైజర్ ఒమిక్రాన్ పిల్ అత్యవసర వినియోగానికి ఈయూ అనుమతి... 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోన్న టాబ్లెట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
APPSC Group 2 Exam: ఏపీపీఎస్సీ 'గ్రూప్-2' సిలబస్‌లో కీలక మార్పులు, అవేంటంటే?
Barrelakka News: కొల్లాపూర్‌లో బర్రెలక్క స్థానం ఏంటీ? ప్రచారం ఎక్కువ ప్రభావం తక్కువైందా?
Kamareddy News: కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌కు షాక్ ఇచ్చిన ఎవరీ వెంకటరమణారెడ్డి?
Rangareddy Assembly Election Results 2023: రంగారెడ్డి జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!
Telangana CM KCR resigns: సీఎం కేసీఆర్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్ తమిళిసై, అప్పటివరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా!
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
/body>