AP Road Projects: పీపీపీ విధానంలో ఏపీలో 11 రోడ్ల విస్తరణకు ఛాన్స్ - సాంకేతిక అధ్యయనంలో వెల్లడి
PPP in Andhra Pradesh | ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏపీలోని రోడ్ల అభివృద్ధికి నిర్ణయం తీసుకుంది. అయితే సాంకేతిక ఆర్థిక అధ్యయనం నిర్వహించగా 11 రోడ్ల విస్తరణకు ఛాన్స్ ఉందని తేలింది.

అమరావతి: రాష్ట్రంలోని కొన్ని ప్రధాన రహదారులను ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్య (PPP) విధానంలో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. పీపీపీ విధానంలో రహదారుల విస్తరణతో పాటు పలు అభివృద్ధి, మౌలిక సౌకర్యాల ప్రాజెక్టుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో టెక్నో-ఎకనామిక్ స్టడీ చేయించగా, తొలుత 11 రహదారుల్లో ఈ విధానాన్ని అమలు చేయవచ్చని స్పష్టం చేసింది. వారు ఈ అధ్యయనంలో వివిధ అంశాలను పరిశీలించారు. వాటిలోని అంశాలు ఏంటంటే.. రహదారి విస్తరణకు అవసరమైన వరుసల సంఖ్య, ఖర్చు ఎంత అవుతుంది?. కేంద్ర, రాష్ట్రాల వంతు వ్యయభారం ఎంత. గుత్తేదారులకు ఎంతకాలం టోల్ వసూలు హక్కులు ఇవ్వాలి అనే అంశాలు పరిశీలించారు.
ఈ 11 రహదారులను 15 నుంచి 30 సంవత్సరాల వరకు నిర్వహణ, టోల్ వసూలు హక్కులతో గుత్తేదారులకు అప్పగించేందుకు ప్రతిపాదన చేశారు. అయితే, మరో 6 రహదారుల కోసం పీపీపీ మోడల్ ఆదాయపరంగా చెల్లుబాటు కావడం లేదని అధ్యయనంలో తేలింది.
ప్రత్యేక రహదారి ప్రాజెక్టుల వివరాలు:
మంగళగిరి - తెనాలి - నారకోడూరు (39 కిలో మీటర్లు).. గుంటూరు - బాపట్ల (50 కిలో మీటర్లు)
ఈ రెండు రహదారులను ఒక్కొక్కటిగా కాకుండా, ఒకే ప్రాజెక్టుగా కలిపి నాలుగు వరుసలుగా విస్తరించాలని ప్రతిపాదన.
మొత్తం ఖర్చు: రూ. 1,529.21 కోట్లు.
నరసాపురం - తాడేపల్లిగూడెం - అశ్వరావుపేట (92.4 కిలో మీటర్లు):
ఇందులో నరసాపురం నుంచి తాడేపల్లిగూడెం వరకు 51 కిలో మీటర్లు మాత్రమే పీపీపీ ద్వారా అభివృద్ధి చేయడం సాధ్యమని తేలింది.
అంచనా ఖర్చు: రూ. 419 కోట్లు.
బైపాస్‌లు: మార్టేరు వద్ద 2.3 కిలో మీటర్లు, అత్తిలి వద్ద 3.47 కిలో మీటర్లు, పిప్పర వద్ద 3 కిలో మీటర్లు, పెంటపాడు వద్ద 4.3 కిలో మీటర్లు.
ఒంగోలు - పొదిలి (50 కిలో మీటర్లు).. పొదిలి - బెస్తవారిపేట (59 కిలో మీటర్లు):
పొదిలి - బెస్తవారిపేట విస్తరణ పీపీపీ ద్వారా సాధ్యంకాదని తేలినా, మొత్తం 109 కిలో మీటర్లు ప్రాజెక్టుగా కలిపి విస్తరిస్తే సాధ్యమేనని సూచించారు.
అంచనా వ్యయం: రూ. 611 కోట్లు.
బైపాస్‌లు: సంతనూతలపాడు వద్ద 2 కిలో మీటర్లు, చీమకుర్తి వద్ద 5.4 కిలో మీటర్లు.
పీపీపీ విధానంలో విస్తరణకు అనుకూలమైన రహదారులు
మార్గం, కి.మీ, లేన్లు, అంచనా వ్యయం వివరాలిలా..
- ఒంగోలు-పొదిలి- బెస్తవారిపేట - 109 కి.మీ, లేన్లు 4/2, అంచనా వ్యయం రూ.611 కోట్లు
- మంగళగిరి- తెనాలి- నారాకోడూరు, గుంటూరు-బాపట్ల, 89 కి.మీ, లేన్లు 4, అంచనా వ్యయం రూ. 1,529.21 కోట్లు
- చిలకపాలెం-రామభద్రపురం- రాయగడ రోడ్ 131 కి.మీ, లేన్లు 2/4, అంచనా వ్యయంరూ.1,172 కోట్లు
- దామాజీపల్లి-నాయనపల్లి 60 కి.మీ, లేన్లు 2, అంచనా వ్యయం రూ.338 కోట్లు
- కాకినాడ- రాజమహేంద్రవరం కెనాల్ రోడ్ 60 కి.మీ, లేన్లు 4, అంచనా వ్యయం రూ.680 కోట్లు
- ప్యాపిలి- బనగానపల్లి 54 కి.మీ, లేన్లు 2, అంచనా వ్యయం రూ.171 కోట్లు
- నరసాపురం- తాడేపల్లిగూడెం- 51 కి.మీ, లేన్లు 4, అంచనా వ్యయం రూ.419 కోట్లు
- నర్సీపట్నం- తాళ్లపాలెం 31 కి.మీ, 2, అంచనా వ్యయం రూ.101 కోట్లు
- జమ్మలమడుగు-కొలిమిగుండ్ల 42 కి.మీ, లేన్లు 2, అంచనా వ్యయం రూ.181 కోట్లు
- సోమందేపల్లి-హిందూపురం- తూముకుంట 39 కి.మీ, లేన్లు 2/4, అంచనా వ్యయం రూ.270 కోట్లు
- కాకినాడ- జొన్నాడ రోడ్ 4 కి.మీ, లేన్లు 2, అంచనా వ్యయం రూ.425 కోట్లు
పీపీపీ కింద రోడ్ల విస్తరణ సాధ్యం కాని ప్రాజెక్టులు
- కళింగపట్నం- శ్రీకాకుళం పార్వతీపురం రోడ్డు 108 కి.మీ, లేన్లు 2/4, అంచనా వ్యయం రూ.587 కోట్లు
- ఏలూరు- జంగారెడ్డిగూడెం 51 కి.మీ, 2 లేన్లు, అంచనా వ్యయం రూ.250 కోట్లు
- రాజంపేట- గూడూరు 94 కి.మీ, లేన్లు 2, అంచనా వ్యయం రూ.230 కోట్లు
- ఏలూరు- మేడిశెట్టివారిపాలెం రోడ్డు 70 కి.మీ, లేన్లు 2, అంచనా వ్యయం రూ.403 కోట్లు
- విజయనగరం- పాలకొండ రోడ్డు 70 కి.మీ, లేన్లు 4/2, రూ. 642 కోట్లు
- గుంటూరు- పర్చూరు 41 కి.మీ, లేన్లు 2, అంచనా వ్యయం రూ.147 కోట్లు






















