అన్వేషించండి

Ganesh Nimajjanam 2022 Live Updates: కొనసాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర, కాసేపట్లో నిమజ్జనం

Ganesh Nimajjanam 2022 Live Updates: గణేష్‌ నిమజ్జనానికి సంబంధించిన అన్ని అప్‌డేట్స్‌ కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేయండి.

LIVE

Key Events
Ganesh Nimajjanam 2022 Live Updates: కొనసాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర, కాసేపట్లో నిమజ్జనం

Background

Ganesh Nimajjanam 2022: ఒక్కో తత్వానికి ఒక్కొక్కరు ప్రతీకలు... జల తత్వానికి ప్రతీక వినాయకుడు. అందుకే ‘గంగాసుతాయ నమః’ అని వినాయకుణ్ని పూజిస్తాం.

ఆకాశస్యధిపో విష్ణుః అగ్నిశ్చైవ మహేశ్వరః
వాయో సూర్యః క్షితిరీశః జలరూపో వినాయకః

మహాగణపతి ఆరాధనతో పకృతి పులకిస్తుంది. ప్రకృతి ధర్మాన్ని మానవాళి మరచిపోకుండా ఉండేందుకే ఏడాదికొకసారి మహాగణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు.  గణపతి పండుగలోని అంతరార్థం...ఆయనకు ఉండ్రాళ్లు పెట్టడం, భారీ విగ్రహాలను ప్రతిష్టించడం, పూనకం వచ్చినట్టు ఊగిపోవడం కాదు..ఏ మట్టిని సస్యశ్యామలం చేయడంలో ప్రేరణశక్తిగా ఉన్నాడో ఆ గణపయ్యని శ్రద్ధతో పూజించడమే ముఖ్య ఉద్దేశం. మహాగణపతి అంటే పెద్ద పెద్ద రంగు రంగుల విగ్రహాలు కాదు.. మట్టితో తయారు చేసిన స్వచ్ఛమైన రూపం. 

Also Read: అక్టోబరు, నవంబరులో ఈ రోజుల్లో తిరుమల శ్రీవారి దర్శనం రద్దు

మట్టి అంటే భూమాతకు చిహ్నం. ఏ పదార్థమైనా ఆమె స్వరూపమే. భూదేవికి మనసారా నమస్కరించి, ప్రేమపూర్వకంగా కాస్తంత మట్టిని తీసుకుని గణపతి ప్రతిమచేయాలి. వానాకాలం మొదలవడానికి ముందే చెరువులు, కుంటల్లో క్రమపద్దతిలో మట్టి తీయడంతో కాలవలు, కుంటలు, చెరువుల్లో నీటినిలువ సామర్థ్యం పెరిగేది. అంటే వినాయకుని ప్రతిమల తయారీ వెనుకున్న ఓ అంతరార్థం చెరువులు, కాల్వల పూడికతీయడం. అంటే వినాయకుడు ఇంట్లో అడుగుపెట్టక ముందే జలసిరులతో చెరువులు,కుంటలు కళకళలాడాలి. మరోవైపు మట్టి పూడికతీత పనుల వల్ల భూగర్భజల మట్టం పెరిగేది.  

మొక్కలకు ఎరువుగా…
ఇంట్లో మట్టి ప్రతిమలు పూజాదికాలు పూర్తయ్యాక...పత్రి, నవధాన్యాలతో కలిపి ఇంటి పెరట్లో చెట్టుకింద ఉంచేవారు. తద్వారా ఎంత బలహీనంగా ఉండే చెట్టు అయినా ఏపుగా పెరిగేది. ఎందుకంటే పూజాద్రవ్యాల్లోని పోషకవిలవలు, పత్రిలోని విశిష్టగుణాలు ఉండటమే ఇందుకు కారణం. 

నిమజ్జనం వెనుక
నవరాత్రుల తర్వాత వినాయక ప్రతిమను సమీపంలో చెరువులోనో,  కుంటలోనూ నిమజ్జనం చేస్తారు. కుంటలు లేని చోట బావిలోనే నిమజ్జనం చేయవచ్చు. 21 రకాల పత్రి, ప్రతిమలోని మట్టి నీటిలో కలిశాక...  ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్ ను జలంలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బాక్టీరియా నశిస్తుంది. అంతేకాదు, ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇదే వినాయక నిమజ్జనం వెనుక దాగున్న పర్యావరణ పరమ రహస్యం.

Also Read: మంగళసూత్రానికి పిన్నీసులు తగిలిస్తున్నారా!

గచ్ఛ గచ్ఛ సురశ్రేష్ఠ! స్వస్థాన పరమేశ్వర
యత్ర బ్రహ్మాదయో దేవ! తత్ర గచ్ఛ గణాధిపా॥

‘పరమేశ్వర స్వరూపుడవైన ఓ గణనాయకా ! మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి, మా పూజలు అందుకొని మమ్మల్ని అనుగ్రహించిన ఓ దైవమా! ఏ దేవలోకం నుంచి అయితే వచ్చావో, బ్రహ్మాది దేవతలు ఉండే నీ స్వస్థలమైన ఆ దేవలోకానికి వెళ్లిరమ్మ’ని ప్రార్థిస్తూ గణేశుడిని నిమజ్జనం చేస్తారు. 

మట్టిలో కలవాల్సిందే
భగవంతుడు తయారుచేసిన ఈ శరీరం ఉన్నన్ని రోజులు ఎంత వైభోగం అనుభవించినా చివరకు పంచభూతాల్లో కలిసిపోవాల్సిందే తప్ప శాశ్వతం కాదన్న సత్యాన్ని తెలియజేస్తాడు గణనాథుడు. గణపతి జలరూపానికి ప్రతినిధి కనుక నీళ్లలో లయం చేయడం ద్వారా వచ్చిన చోటుకే చేరుకుంటాడన్నది తాత్వికార్థం. 

17:46 PM (IST)  •  09 Sep 2022

గణపతి భక్తులకు మంచినీరు, ప్రసాదం అందిస్తున్న ముస్లిం సోదరులు 

హైదరాబాద్ గణేశ్ నిమజ్జనంలో మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో గణపతి  భక్తులకు ప్రసాద పంపిణీతో పాటు మంచినీటి ని అందిస్తున్నారు. ఎస్ఆర్ నగర్ పోలిస్ స్టేషన్  పరిధిలోని మైత్రీవనం వద్ద గణపతి భక్తులకు మంచినీరు, ప్రసాదం అందిస్తున్నారు. ఇన్స్పెక్టర్ సైదులు ఆధ్వర్యంలో స్థానిక ముస్లిం సోదరులతో సమావేశం నిర్వహించి నిమజ్జనానికి సహకారం అందిచాలని కోరగా వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. హిందూ, ముస్లిం మతాల మధ్య సోదరభావం పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ప్రారంభించినట్లు సైదులు పేర్కొన్నారు.

15:32 PM (IST)  •  09 Sep 2022

టెలిఫోన్ భవన్ వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ గణపయ్య 

తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనోత్సవం వైభవంగా జరుగుతోంది. భక్తుల కోలాహలం మధ్య గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర ఘనంగా సాగుతోంది. బడా గణేశ్ టెలిఫోన్ భవన్ వద్దకు చేరుకున్నాడు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో సందడి నెలకొంది. 

14:28 PM (IST)  •  09 Sep 2022

Hussain Sagar: బోట్ లో పర్యటించి నిమజ్జనం పరిశీలన

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం అవుతున్న తీరును మంత్రి తలసాని శ్రీనివాస్, మేయర్ గద్వాల విజయలక్ష్మి బోట్ ద్వారా పరిశీలించారు.

14:23 PM (IST)  •  09 Sep 2022

Khairatabad Ganesh: కొనసాగుతున్న ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర

ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. 9 రోజుల పాటు పూజలు అందుకున్న మహా గణపతి గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. వెల్డింగ్ పనులు పూర్తి కాగానే గణపతికి ఉత్సవ సమితి నిర్వహకులు హారతి ఇచ్చి శోభాయాత్రను మొదలుపెట్టారు.

12:54 PM (IST)  •  09 Sep 2022

Talasani Srinivas: ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకున్న మంత్రి తలసాని

ఖైరతాబాద్ గణేష్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. తర్వాత ఆయన మాట్లాడుతూ.. నగరంలో వైభవంగా నిమజ్జనం జరుగుతుందని అన్నారు. అసౌకర్యాలు జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోకుండా చూస్తున్నారని అన్నారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Turmeric Board: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh 2025 | 144ఏళ్లకు ఓసారి వచ్చే ముహూర్తంలో మహాకుంభమేళా | ABP DesamDanthapuri Fort | బుద్ధుడి దంతం దొరికిన ప్రాంతం..అశోకుడు నడయాడిన ప్రదేశం | ABP DesamNara Devansh Sack Run | నారావారిపల్లెలో గోనెసంచి పరుగుపందెంలో దేవాన్ష్ | ABP DesamNara Devansh Lost Lokesh No Cheating | మ్యూజికల్ ఛైర్ లో ఓడిన దేవాన్ష్, ఆర్యవీర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Turmeric Board: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ - హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలింపు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ - హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలింపు
Sankranti Celebrations: మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
MP Brahmin Board : బ్రాహ్మణ జంటలకు బంపరాఫర్ - నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష, మధ్యప్రదేశ్ బోర్డు సంచలన ప్రకటన
బ్రాహ్మణ జంటలకు బంపరాఫర్ - నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష, మధ్యప్రదేశ్ బోర్డు సంచలన ప్రకటన
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
Embed widget