News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Flexes War: తెలంగాణలో రాజుకున్న ఫ్లెక్సీ వార్‌- కాంగ్రెస్‌, బీజేపీ, కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు

తెలంగాణలో మళ్లీ ఫ్లెక్సీల రాజకీయం రాజుకుంది.కాంగ్రెస్‌, బీజేపీ, కేసీఆర్‌ను ప్రశ్నిస్తూ హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు వెలిశాయి.రాష్ట్రానికి ఏం చేశారంటూ రెండు పార్టీలను నిలదీస్తూ ఫ్లెక్సీలు కట్టారు.

FOLLOW US: 
Share:

తెలంగాణలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ఎన్నికల వార్‌ నడుస్తోంది. హైదరాబాద్‌లో ఇవాళ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం ఉంది. అలాగే రేపు తుక్కుగూడలో భారీ  బహిరంగసభ నిర్వహించబోతోంది కాంగ్రెస్‌ పార్టీ. ఆ సభకు హాజరవుతున్న కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ... ఆరు గ్యారంటీల పేరుతో ఎన్నికల హామీలు కూడా ప్రకటిస్తారని  చెప్పారు. మరోవైపు సెప్టెంబర్‌ 17ను పురస్కరించుకుని.. రేపు పెరేడ్‌గ్రౌండ్‌లో బీజేపీ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వస్తున్నారు.ఈక్రమంలో  కాంగ్రెస్‌, బీజేపీలను ప్రశ్నిస్తూ నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ప్రత్యర్థులు. కాంగ్రెస్‌,బీజేపీలు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశాయని ప్రశ్నిస్తూ.. కేసీఆర్‌ అమలు చేస్తున్న  పథకాలను ఫ్లెక్సీల్లో పెట్టారు. 

సీడబ్ల్యూసీ సమావేశాలకు వంద మంది వరకు కాంగ్రెస్ సీనియర్ నేతలు.. కాంగ్రెస్ పాలిత రాష్ట్ర సీఎంలు హాజరవుతున్న వేళ... వారిని ఆహ్వానిస్తూ బేనర్లు కనిపిస్తున్నాయి.  మరోవైపు వారికి వ్యతిరేకంగా కొన్ని ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. అది కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ కాదు.. కరప్ట్ వర్కింగ్ కమిటీ అంటూ ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేస్తున్నారు.  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఫొటోలు, వారు చేసిన స్కాముల వివరాలతో పోస్టర్లు వేశారు. హోర్డింగ్స్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని  మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా మొత్తం 24 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఫొటోలు, వారి స్కాముల వివరాలు అందులో  ఉంచారు. బివేర్ ఆఫ్ స్కామర్స్ అంటూ టాగ్ లైన్‌ కూడా పెట్టారు. 

సీఎం కేసీఆర్‌ తెలంగాణలో వృద్ధాప్య పింఛన్ 2వేల 16 రూపాయలు ఇస్తుంటే... కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఇస్తున్న పింఛన్లు ఎంత? అంటూ క్వశ్చన్‌ చేశారు. పాలమూరు  రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామన్న రాహుల్, సోనియా గాంధీ ఎందుకు మాట నిలబెట్టుకోలేదో చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ హయాంలో వరంగల్ నుండి  ఐటీ మంత్రిగా ఉండి కూడా వరంగల్‌కు ఒక్క ఐటీ కంపెనీ కూడా ఎందుకు తీసుకురాలేదు అంటూ  ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు  రేవంత్‌రెడ్డి... వ్యవసాయానికి మూడు గంటల ఉచిత విద్యుత్ చాలు అని మాట్లాడారని... దానికి సోనియా, రాహుల్‌ ఒప్పుకుంటున్నారా అని క్వశ్చన్‌ చేశారు. 2004 నుండి  2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయలేదన్నారు. ఇప్పుడు కూడా ఎస్సీ డిక్లరేషన్ పేరుతో అలానే చేస్తారా అంటూ ఎద్దేవా చేశారు.

బీజేపీపై కూడా పోస్టర్లు వెలిశాయి. గోవా లిబరేషన్‌ డేకు 300 కోట్ల రూపాయలు ఇచ్చిన కేంద్రంలోని మోడీ సర్కార్‌.. తెలంగాణ ఇంటిగ్రేషన్‌ డేకు ఒక్క రూపాయి కూడా ఎందుకు  ఇవ్వలేదని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణకు వస్తున్న అమిత్‌షా ఏమైనా ప్రకటిస్తా అంటూ నిలదీశారు. 

ఫోస్టర్లలో కాంగ్రెస్‌ నేతల స్కాముల వివరాలు
మల్లికార్జున ఖర్గే-నేషనల్ హెరాల్డ్ స్కాం
సోనియా గాంధీ- నేషనల్ హెరాల్డ్ స్కాం, ఛాపర్ స్కాం
మన్మోహన్ సింగ్-కోల్ అలోకేషన్ స్కాం
రాహుల్ గాంధీ-నేషనల్ హెరాల్డ్  స్కాం
ఏకే ఆంటోనీ- నేషనల్ హెరాల్డ్ స్కాం
మీరా కుమార్-నేషనల్ హైవేస్ అథారిటీ స్కాం
దిగ్విజయ్ సింగ్-రిక్రూట్ మెంట్ స్కాం
చిదంబరం- ఫోర్జరీ, స్టాక్ మార్కెట్ , శారదా  చిట్ ఫండ్, వీసా స్కాం
లాల్ థన్ వాలా-మధ్యాహ్న భోజన స్కాం, లాటరీ స్కాం
ముఖుల్ వాస్నిక్- ఎలక్షన్ టికెట్ స్కాం, ప్రాపర్టీ టాక్స్ స్కాం
ఆనంద్ శర్మ- వాల్ మార్ట్ స్కాం
అశోక్ రావ్ చవాన్- ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కాం
చరంజిత్ సింగ్ చన్నీ- స్పోర్ట్స్ కిట్, ప్రభుత్వ ఉద్యోగాలు, థీమ్ పార్క్ స్కాం
ప్రియాంక గాంధీ వాద్రా- నేషనల్ హెరాల్గ్  స్కాం,డీఎల్ఎఫ్ లాండ్ స్కాం, 
అభిషేక్ మనుసింఘ్వీ- సీడీ రికార్డింగ్ స్కాం
జైరాం రమేష్- కోల్ స్కాం
మహేంద్రజీత్ సింగ్ మాల్వియా-అసిస్టెంట్ ఇంజినీర్స్ ట్రాన్స్ ఫర్ స్కాం
కేసీ  వేణుగోపాల్- సోలార్ స్కాం
అధిర్ రంజన్ చౌదరి- శారదా స్కాం
అంబికా సోని- రైల్వే వాటర్ బాటిల్స్ స్కాం
అజయ్ మాకెన్- రియల్ ఎస్టేట్ స్కాం
తామ్రద్వజ్ సాహు- ఆవు పేడ  స్కాం
సల్మాన్ ఖుర్షీద్- వీల్ చెయిర్ స్కాం
శశిథరూర్- స్పాట్ ఫిక్సింగ్ స్కాం

వీటికి కౌంటర్‌గా కేసీఆర్‌కు వ్యతిరేకంగా కూడా ఫ్లెక్సీలు వెలిశాయి. 30 శాతం కమిషన్ సర్కారు అంటూ కేసీఆర్‌ను నిందిస్తూ కాంగ్రెస్ పోస్టర్లు వేసింది. 

Published at : 16 Sep 2023 11:01 AM (IST) Tags: BJP CONGRESS Hyderabad Amit Shah Rahul BRS Telangana Flexi Politics SONIA

ఇవి కూడా చూడండి

NITW: వరంగల్ నిట్‌లో గ్రూప్‌-డి పోస్టుల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

NITW: వరంగల్ నిట్‌లో గ్రూప్‌-డి పోస్టుల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Tollywood Drugs Case: సినీ భాషలో డ్రగ్స్ దందా, పెడ్లర్ ను రైటర్ అని, డ్రగ్స్ కావాలంటే ‘షల్ వీ మీట్’ అంటూ కోడ్స్

Tollywood Drugs Case: సినీ భాషలో డ్రగ్స్ దందా, పెడ్లర్ ను రైటర్ అని, డ్రగ్స్ కావాలంటే ‘షల్ వీ మీట్’ అంటూ కోడ్స్

Teachers Transfer: సెప్టెంబరు 28 నుంచి స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీలకు వెబ్‌ ఆప్షన్లు, జోన్లవారీగా బదిలీలు ఇలా

Teachers Transfer: సెప్టెంబరు 28 నుంచి స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీలకు వెబ్‌ ఆప్షన్లు, జోన్లవారీగా బదిలీలు ఇలా

Hyderabad Metro: భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్, అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు

Hyderabad Metro: భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్, అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో

టాప్ స్టోరీస్

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

Ram Skanda Movie : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?

Ram Skanda Movie : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు

Tiger 3 Teaser : 'టైగర్ 3'లో సల్మాన్ ఖాన్ దేశభక్తుడా? దేశ ద్రోహిగా మారాడా?

Tiger 3 Teaser : 'టైగర్ 3'లో సల్మాన్ ఖాన్ దేశభక్తుడా? దేశ ద్రోహిగా మారాడా?