Apply For Voter ID: ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోలేదా, అయితే ఇలా చేయండి
Enroll For Voter ID: 18 సంవత్సరాల వయస్సు నిండిన, ఆ పై వయస్సు గల వారు ఓటరు జాబితాలో పేరు లేని పక్షంలో ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించింది ఎన్నికల కమిషన్.
Apply for voter id card telangana:
- ఓటరు జాబితాలో పేరు లేని వారు ఓటరుగా నమోదు చేసుకోండి
- హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్
తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఓ వైపు ఎన్నికల సంఘం ఈ దిశగా కసరత్తు చేపట్టింది. మరోవైపు అధికారులు యువతకు ఓటు నమోదు గురించి అవగాహనా కల్పిస్తున్నారు. 18 సంవత్సరాల వయస్సు నిండిన, ఆ పై వయస్సు గల వారు ఓటరు జాబితాలో పేరు లేని పక్షంలో ఓటరుగా నమోదు చేసుకోవచ్చని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమీషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. 18 సంవత్సరాల వయస్సు దాటిన వారికి ఓటరుగా నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందన్నారు. కనుక 18 ఏళ్లు ఉన్న వారు ఓటరుగా నమోదు చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఓటరు నమోదుకు www.voters.eci.gov.in ఆన్ లైన్ ద్వారా గాని ఓటర్ హెల్ప్ లైన్ (Voter Helpline App) యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆపై ఫారం-6 లో పూర్తి వివరాలతో సంబంధిత వెరిఫికేషన్ కోసం ధ్రువీకరణ పత్రాలను సమర్పించవలెనని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
అక్టోబర్ 1, 2023 అర్హత తేదీ నాటికి 18 సంవత్సరాలు వయస్సు పూర్తయ్యే వారు ముందస్తు గా ఓటరుగా నమోదు చేసుకోవాలని రోనాల్డ్ రోస్ సూచించారు. పూర్తి వివరాలకు ఓటర్ హెల్ప్ లైన్ నెంబర్ 1950 కు సంప్రదించవచ్చుననీ జి హెచ్ ఎం సి కమిషనర్ తెలిపారు.