మెడికల్ కాలేజీలను టార్గెట్ చేసిన ఈడీ- తెలంగాణ వ్యాప్తంగా 10 కళాశాలల్లో రైడ్స్ !
కామినేని ఆస్పత్రి ఛైర్మన్ సూర్యనారాయణ, ఎండీ శ‌్రీధర్ నివాసాలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కేవలం ఇళ్లలోనే కాకుండా కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పది మెడికల్ కాలేజీలపై ఈడీ ఫోకస్ పెట్టింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న కాలేజీల్లో తనిఖీలు చేస్తోంది. కాలేజీలతోపాటు ఆ యజమాన్యాల నివాసలు ఆఫీస్‌లలో సోదాలు చేస్తోంది.
ప్రస్తుతం తనిఖీ జరుగుతున్న కాలేజీలు
ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ,
కామినేని మెడికల్ కాలేజీ
మల్లారెడ్డి మెడికల్ కాలేజీ
బీసీఏ మెడికల్ కాలేజీ
మెడిసిటీ మెడికల్ కాలేజీ
ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ
కామినేని ఆస్పత్రి ఛైర్మన్ సూర్యనారాయణ, ఎండీ శ‌్రీధర్ నివాసాలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కేవలం ఇళ్లలోనే కాకుండా కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో కూడా ఈడి అధికారుల సోదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి ఈ తనిఖీలు సాగుతున్నాయి. ప్రతి ఫైలును క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. మెడికల్ కళాశాలతోపాటు యాజమాన్యం ఆస్తులపై ఆరా తీస్తున్నారు. షామీర్ పేటలోని మెడిసిటీ కళాశాల ఏరియాలో అధికారులు దాడులు చేస్తున్నారు. ఫిల్మ్ నగర్ లోని ప్రతిమా కార్పొరేట్ కార్యాలయంపై ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం రెండు టీంలుగా విడిపోయి మరీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. బషీర్ బాగ్ లోని ఈడీ ఆఫీసు నుంచి 11 బృందాలుగా ఈడీ అధికారులు బుధవారం ఉదయం బయలుదేరారు. ఈడీ బృందాలతోపాటు సీఆర్పీఎఫ్ బలగాలు కూడా వారి వెంట ఉన్నాయి. భాగ్యనగరంతో పాటు నల్లొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మేడ్చల్ జిల్లాల్లో ఈడీ రైడ్స్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Enforcement Directorate conducting searches at six places in #Telangana. Searched on prominent groups running Medical Colleges and Hospitals. Investigation after cases booked under PMLA. #Hyderabad pic.twitter.com/ZxVYST8OYZ
— Ashish (@KP_Aashish) June 21, 2023