News
News
X

దుర్గం చెరువులో దూకిన యువతి, 24 గంటల తర్వాత మృతదేహం లభ్యం!

హైదరాబాద్ లోని దుర్గం చెరువులో పడి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. విషయం గుర్తించిన పోలీసులు 24 గంటలపాటు శ్రమించి మృతదేహాన్ని వెలికి తీశారు.

FOLLOW US: 

హైదరాబాద్‌లోని మాదాపూర్ దూర్గం చెరువు కేబుల్ వంతెన పైనుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 24 గంటలపాటు శ్రమించి మృతదేహాన్ని వెలికి తీశారు. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్ నగర్ అబ్ధుల్లాపూర్‌మెట్‌కు చెందిన స్వప్న(23)కు సంవత్సరం క్రితం పెళ్లి జరిగింది. అయితే కొన్నాళ్లపాటు హాయిగా సాగిన వీరి కాపురంలో గొడవలు మొదలు అయ్యాయి. దీంతో 8 నెలల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకుంది. ప్రస్తుతం పుట్టింటికి వెళ్లిపోయి తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. 

భర్త నుంచి విడాకులు తీసుకున్నప్పటి నుంచి స్వప్న తీవ్ర మనోవేదనకు గురవుతోంది. ఒత్తిడిని తట్టుకోలేక చాలా ఆస్పత్రుల్లో చికిత్స కూడా తీసుకుంది. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం దుర్గంచెరువు వద్దకు వెళ్లి కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు, ఎన్టీఆర్ఎఫ్ బృందం 24 గంటలపాటు గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపారు. 

మొన్నటికి మొన్న పిల్లాడితో కలిసి చెరువులో దూకిన మహిళ

కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వివాహిత కుమారుడితో సహా చెరువులోకి దూకింది. కుమారుడు మృతి చెందగా... తల్లి ప్రాణాలతో బయట పడింది. ఈ విషాధ ఘటన సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాలలో జరిగింది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామానికి చెందిన చింతల స్వాతికి ముస్తాబాద్ మడలం బదనకల్‌కు చెందిన శరత్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి ఓ బాబు కూడా పుట్టాడు. అతడే మూడేళ్ల శివతేజ. అయితే బాబు పుట్టిన రెండేళ్ల నుంచి వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. 

News Reels

తాను లేకపోతే తన పిల్లాడేమైపోతాడోనని..

అత్తగారింట్లో జరిగే గొడవలు భరించలేక ఆమె బాబును తీసుకొని పుట్టింటికి వచ్చేసింది. మల్యాల గ్రామంలో తల్లిదండ్రులతోనే కలిసి ఉంటుంది. అయితే కుటుంబ పోషణ కోసం సిద్దిపేటలోని ఓ షోరూంలో పని చేస్తోంది. అప్పుడప్పుడు భర్త శరత్ ఫోన్ చేస్తూ.. గొడవ పడుతుండేవాడు. గత కొంత కాలంగా నేరుగా వచ్చి తరచూ వేధింపులకు పాల్పడుతుండటంతో స్వాతి తీవ్రంగా మనస్తాపం చెందింది. ఎక్కడ ఉన్నా తనకు ఈ వేధింపులు తప్పేలా లేవని భావించింది. ఇలా గొడవలతో బతకడం కంటే చనిపోవడమే నయం అనుకుంది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కానీ తను చనిపోతే.. తన ఏమైపోతాడోనన్న భయం పట్టుకుంది. తల్లిలేని లోటును ఎవరూ తీర్చలేరని... తనతోపాటే బాబుని కూడా తిరిగిరాని లోకాలకు తీసుకువెళ్లాలనుకుంది. 

తల్లీకుమారులను ఒడ్డుకు చేర్చిన పశువుల కాపర్లు..

శివతేజను తీసుకుని గ్రామంలోని చెరువు వద్దకు వచ్చింది. బాబుని గట్టిగా తన నడుముకు కట్టుకొని గ్రామంలోని చెరువులో దూకేసింది. అయితే విషయం గమనించిన పుశువుల కాపర్లు వెంటనే చెరువులోకి దూకారు. తల్లీకొడుకులిద్దరినీ ఒడ్డుకు చేర్చారు. అప్పటికే కుమారుడు శివతేజ మృతి చెందాడు. స్వాతి మాత్రం ప్రాణాలతో బయటపడింది. తాను ప్రాణం తీసుకోవాలనుకుంటే తన కొడుకు చనిపోయాడని కన్నీరుమున్నీరవుతోంది. తనను ఎందుకు బతికించారని పశువుల కాపర్లపై కోప్పడింది. కాపాడిన మీరే చంపేయండంటూ విలపించింది. అయితే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మనవడి మృతదేహాన్ని చూసి బావురుమన్నారు. ఎందుకింత పని చేశావంటూ కూతరు స్వాతి పట్టుకొని ఏడ్చారు. అయితే తాను ఇలా చేయడానికి తన భర్తే కారణం అని అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.  

Published at : 30 Sep 2022 11:16 AM (IST) Tags: Hyderabad crime news Hyderabad News Woman Committed Suicide Telangana Latest Suicide Durgam Cheruvu Suicide

సంబంధిత కథనాలు

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Jeevitha Rajashekar : జీవితా రాజశేఖర్ ను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాడు, ఆఫర్ల పేరుతో టోకరా!

Jeevitha Rajashekar : జీవితా రాజశేఖర్ ను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాడు, ఆఫర్ల పేరుతో టోకరా!

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

Minsiter Harish Rao : సర్కార్ దవాఖానల్లో 56 టిఫా స్కానింగ్ మిషన్లు, ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

Minsiter Harish Rao : సర్కార్ దవాఖానల్లో  56 టిఫా స్కానింగ్ మిషన్లు, ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

టాప్ స్టోరీస్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!

Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!

Poland Vs Saudi Arabia: ప్రపంచకప్‌లో సౌదీకి తొలి ఓటమి - రౌండ్ ఆఫ్ 16 రేసులో పోలండ్!

Poland Vs Saudi Arabia: ప్రపంచకప్‌లో సౌదీకి తొలి ఓటమి - రౌండ్ ఆఫ్ 16 రేసులో పోలండ్!