భారీ వర్షాలు: రైలు ప్రయాణికులకు అలర్ట్! 5 రైళ్లు రద్దు, దారి మళ్లింపు.. మీ ప్రయాణంపై ప్రభావం!
జోరుగా కురుస్తున్న వర్షాల వల్ల కొన్ని చోట్ల రైల్వే లైన్లు దెబ్బతిన్నాయి. కొన్ని రైళ్లను దారి మళ్లించనున్నట్లు, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే డివిజన్ ప్రకటించింది.

తెలంగాణ వ్యాప్తంగా జోరుగా కురుస్తున్న వర్షాల వల్ల కొన్ని చోట్ల రైల్వే లైన్లు దెబ్బతిన్నాయి. ఈ కారణంగా కొన్ని రైళ్లను దారి మళ్లించనున్నట్లు, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే డివిజన్ ప్రకటించింది. భిక్నూర్ – తాళ్మడ్లా సెక్షన్, ఆక్కన్నపేట్ – మెదక్ సెక్షన్‌లలో రైలు పట్టాలపై నీరు చేరడంతో దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను దారి మళ్లించింది (Diversion), కొన్నింటిని పాక్షికంగా రద్దు (Partial Cancellation) చేసింది.
దారి మళ్లించిన రైళ్ల వివరాలు:
- 17642 నార్కేడ్ – కాచిగూడ రైలు: ఈ రైలు పూర్ణ, పార్లీ వైజ్‌నాథ్, వికారాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ మీదుగా గమ్యస్థానానికి చేరుకుంటుంది.
- 17662 నాగర్సోలు – కాచిగూడ రైలు: ఈ రైలు పూర్ణ, పార్లీ వైజ్‌నాథ్, వికారాబాద్, సికింద్రాబాద్ మీదుగా కాచిగూడ చేరుకుంటుంది.
- 12787 నరసాపురం – నాగర్సోలు రైలు: ఈ రైలు వరంగల్, కాజీపేట ఎఫ్.కేబిన్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ మార్గం గుండా ప్రయాణిస్తుంది.
- 12788 నాగర్సోలు – నరసాపురం రైలు: ఈ రైలు నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, కాజీపేట ఎఫ్.కేబిన్, వరంగల్ మార్గం గుండా ప్రయాణిస్తుంది.
- 17064 కాచిగూడ – మన్మడ్ రైలు: ఈ రైలు సికింద్రాబాద్, వికారాబాద్, పార్లీ వైజ్‌నాథ్, పర్భాణీ మార్గం గుండా ప్రయాణిస్తుంది.
పాక్షికంగా రద్దు చేసిన రైళ్లు:
- 77649 కాచిగూడ – కరీంనగర్ రైలు: ఈ రైలును భిక్నూర్ – కరీంనగర్ మధ్య రద్దు చేయడం జరిగింది.
- 77605 కాచిగూడ – పూర్ణ రైలు: ఈ రైలును కవల్లీ బారక్స్ – పూర్ణ మధ్య రద్దు చేయడం జరిగింది.
- 57411 గుంతకల్ – బోధన్ రైలు: ఈ రైలును కాచిగూడ – బోధన్ మధ్య రద్దు చేయడం జరిగింది.
- 20811 విశాఖపట్నం – హజూర్ సాహెబ్ నాందేడ్ రైలు: ఈ రైలును ఆకన్‌పేట – నాందేడ్ మధ్య రద్దు చేయడం జరిగింది.
- 77606 హజూర్ సాహెబ్ నాందేడ్ – మెడ్చల్ రైలు: ఈ రైలును కామారెడ్డి – మెడ్చల్ మధ్య రద్దు చేయడం జరిగింది.
రైలు ప్రయాణికులు ఈ మార్పులను, రైలు పట్టికలను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే శాఖ ఓ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేసింది.





















