అన్వేషించండి

Drunk and Driving Rules Penalties: డ్రంక్ డ్రైవింగ్‌కు లీగల్ ఆల్కహాల్ లిమిట్ ఎంత? డ్రంక్ అండ్ డ్రైవ్ రూల్స్ తెలుసా

Telangana Drunk Driving Penalties | మద్యం తాగి వాహనం నడపకూడదని తెలంగాణ పోలీసులు సూచించారు. మద్యం ఎంత తాగి నడిపితే ఇబ్బంది ఉండదు, లేకపోతే జరిమానా లాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ రూల్స్ తెలుసుకోండి.

Drunk and Driving Rules in Telangana | నూతన సంవత్సర వేడుకలు మరికొన్ని గంటల్లో మొదలుకాబోతున్నాయి. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా మద్యం విక్రయాలు అధికంగా జరుగుతాయి. కొందరు మద్యం సేవించి, తాగిన మత్తులోనే వాహనాలు నడుపుతూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. అలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ రూల్స్ తెలుసుకోవాలని తెలంగాణ పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.

మద్యం సేవించి వాహనం నడపడం అనేది తెలంగాణలో అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మోటార్ వెహికల్స్ యాక్ట్ సెక్షన్ 185 ప్రకారం, ఎవరైనా మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే వారికి ₹10,000 జరిమానా లేదా 6 నెలల వరకు జైలు శిక్ష, లేదా కొన్ని సందర్భాల్లో ఈ రెండూ విధించవచ్చు. అంతేకాకుండా, నిబంధనలను బట్టి డ్రైవింగ్ లైసెన్స్‌ను 3 నెలల వరకు సస్పెండ్ చేసే అధికారం అధికారులకు ఉంటుంది. రహదారి భద్రతను మెరుగుపరచడానికి 2019 సవరణల ప్రకారం ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు.

రిపీట్ చేసిన వారిపై కఠిన చర్యలు
మొదటిసారి నేరం చేసిన మూడు సంవత్సరాల లోపు గనుక ఎవరైనా రెండోసారి మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే, శిక్షలు మరింత తీవ్రంగా ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో జరిమానాను ₹15,000 కు పెంచడంతో పాటు, జైలు శిక్షను 2 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నాన్-బెయిలబుల్ (Non-bailable) కేస్‌లుగా పరిగణించనున్నారు. వాహనాలు నడిపే వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ సమయంలో ఎవరైనా పట్టుబడితే ా వాహనాలను తక్షణమే సీజ్ చేయనున్నారు. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు నగరవ్యాప్తంగా స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తారు.

చట్టపరమైన ఆల్కహాల్ పరిమితి
చట్టం ప్రకారం, ఒక వ్యక్తి రక్తంలో ఆల్కహాల్ స్థాయి 100 ml రక్తానికి 30 mg (0.03%) కంటే ఎక్కువగా ఉంటే దానిని నేరంగా పరిగణిస్తారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో ఈ పరిమితి దాటినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవు. కాబట్టి వాహనదారులు తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, మద్యం సేవించినప్పుడు వాహనం నడపకుండా ఉండటం ఉత్తమమని హైదరాబాద్ పోలీసులు సూచించారు.

Disclaimer: ఈ వీడియో కేవలం సాధారణ సమాచారం & అవగాహన కోసం మాత్రమే రూపొందించారు. ఇది లీగల్ అడ్వైస్ (Legal Advice) మాత్రం కాదు. చట్టాలు రాష్ట్రాల వారీగా లేదా కాలానుగుణంగా మారే అవకాశం ఉంది. కచ్చితమైన సమాచారం కోసం ట్రాఫిక్ పోలీస్ / లీగల్ అడ్వైజర్‌ను సంప్రదించడం మంచిదని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పై వీడియోను తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ED Raids at IPAC Office: IPAC కార్యాలయంలో ED సోదాలు! ఫైల్స్‌తో రైడ్ జరిగే ప్రాంతానికి మమతా బెనర్జీ!
IPAC కార్యాలయంలో ED సోదాలు! ఫైల్స్‌తో రైడ్ జరిగే ప్రాంతానికి మమతా బెనర్జీ!
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
Telangana News: హిస్టరీ క్రియేట్ చేసిన తెలంగాణ లేడీ కానిస్టేబుల్! తొలిసారి తెలుగు భాషలో ఛార్జిషీట్‌
హిస్టరీ క్రియేట్ చేసిన తెలంగాణ లేడీ కానిస్టేబుల్! తొలిసారి తెలుగు భాషలో ఛార్జిషీట్‌
Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Advertisement

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Raids at IPAC Office: IPAC కార్యాలయంలో ED సోదాలు! ఫైల్స్‌తో రైడ్ జరిగే ప్రాంతానికి మమతా బెనర్జీ!
IPAC కార్యాలయంలో ED సోదాలు! ఫైల్స్‌తో రైడ్ జరిగే ప్రాంతానికి మమతా బెనర్జీ!
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
Telangana News: హిస్టరీ క్రియేట్ చేసిన తెలంగాణ లేడీ కానిస్టేబుల్! తొలిసారి తెలుగు భాషలో ఛార్జిషీట్‌
హిస్టరీ క్రియేట్ చేసిన తెలంగాణ లేడీ కానిస్టేబుల్! తొలిసారి తెలుగు భాషలో ఛార్జిషీట్‌
Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Hyderabad Road Accident: హైదరాబాద్‌ శివారులో రోడ్డు ప్రమాదం! పుట్టినరోజు సంతోషం క్షణాల్లో మాయం! ICFAIకి చెందిన నలుగురు విద్యార్థుల దుర్మరణం
హైదరాబాద్‌ శివారులో రోడ్డు ప్రమాదం! పుట్టినరోజు సంతోషం క్షణాల్లో మాయం! ICFAIకి చెందిన నలుగురు విద్యార్థుల దుర్మరణం
Ayalaan OTT : భూమిపై ఏలియన్‌... ఓటీటీలోకి అయలాన్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
భూమిపై ఏలియన్‌... ఓటీటీలోకి అయలాన్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
UPSC Interview Tips : యూపీఎస్సీ ఇంటర్వ్యూలో బోర్డు ఏమి అడుగుతుంది? ఎన్ని ప్రశ్నలు ఉంటాయి? ప్రిపరేషన్ టిప్స్
యూపీఎస్సీ ఇంటర్వ్యూలో బోర్డు ఏమి అడుగుతుంది? ఎన్ని ప్రశ్నలు ఉంటాయి? ప్రిపరేషన్ టిప్స్
Chiranjeevi: చిరంజీవి వాచ్ ఖరీదు తెలిస్తే గుండె గుభేల్ గ్యారెంటీ - ఆ బ్లేజర్ రేటు కూడా తక్కువేం కాదు
చిరంజీవి వాచ్ ఖరీదు తెలిస్తే గుండె గుభేల్ గ్యారెంటీ - ఆ బ్లేజర్ రేటు కూడా తక్కువేం కాదు
Embed widget