తెలంగాణ కాంగ్రెస్‌కు కోవర్ట్ రోగం- ప్రభుత్వానికి మద్దతు- దామోదర్ రాజనరసింహ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్‌లో కమిటీల రగడ ఇంకా చల్లారలేదు. రోజుకో నేతల వచ్చి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా దామోదర్ రాజనరసింహ చేసిన ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి.
తెలంగాణలో కమిటీల ఏర్పాటుతో రోజురోజుకు అసంతృప్తుల ఎక్కువైపోతున్నారు. కొండా సురేఖతో మొదలైన ఈ వివాదం మరింత ముదురుతోంది. ఇప్పుడు మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ కూడా కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ గత ఎనిమిదేళ్లుగా కొత్త రోగంతో బాధపడుతుందన్నారు దామోదర్ రాజనరసింహా. కోవర్టిజం పేరుతో కొత్త రోగం అంటుకుందన్నారు. ఇక్కడ కష్టపడేవారి కంటే కోవర్టులకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుందని ఆరోపించారు. చాలా మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని సంచలన కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ పాట పాడుతూ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు. సిద్దిపేటలో కూడా కోవర్టిజం నడుస్తోందన్నారు. నాలుగేళ్లుగా దీనిపై అధిష్ఠానానికి చెబుతున్నా పట్టించుకున్న వారెవరూ లేరన్నారు. ఎవరి డైరెక్షన్‌లో ఇందతా జరుగుతోందని ప్రశ్నించారు.
ఇప్పుడున్న కాంగ్రెస్‌కు అజెండా ఉందా లేదా అని ప్రశ్నించారు దామోదర్ రాజనరసింహా. ఇక్కడ ఎవరి అజెండా వాళ్లకు ఇందా అని నిలదీశారుచ. పదే పదే పార్టీ మారినోళ్లు కాంగ్రెస్‌ను నడిపిస్తున్నారని... ఉమ్మడి ఏపీలో కూడా ఇంతమందితో కమిటీలు వేయలేదన్నారు.