By: ABP Desam | Updated at : 22 Feb 2023 03:30 PM (IST)
Edited By: jyothi
కుటుంబంలో శత్రుశేషం ఉండకూడదని భావించే జగన్, రాజకీయాల్లో అదే చేస్తున్నారు: నారాయణ
CPI Narayana: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సీపీఐ నేత నారాయణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. పది కాలాల పాటు అధికారంలో ఉండాల్సిన సీఎం, తన రాజకీయానికి తానే ముగింపు పలుకుతున్నట్లు అర్థం అవుతుందన్నారు. వైసీపీ వాళ్లే కొట్టి, వైసీపీ వాళ్లే పట్టాభిపై కేసులు పెట్టడం దారుణం అన్నారు. కుటుంబంలో కూడా శత్రుశేషం ఉండకూడదని భావించే ఆయన.. ప్రతిపక్షాలను ఇలాగే ఇబ్బంది పెడతారని వివరించారు. పులివెందులతో వైఎస్ వివేకానంద రెడ్డిని బయట వారు హత్య చేయలేదని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన చేస్తుంటే.. వైసీపీ ఎందుకు అడ్డుకోవాలని చూస్తోందని ప్రశ్నించారు. చంద్రబాబు పర్యటనలో కరెంట్ కట్ చేయడం అవసరమా అంటూ ఫైర్ అయ్యారు. లోకేష్ పాదయాత్ర చేస్తుంటే జగన్ ఎందుకు భయపడుతున్నారని అడిగారు.
పట్టాభి ఆరోగ్య విషయంలో డాక్టర్లు తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చారని సీపీఐ నారాయణ తెలిపారు. ఏపీలో వైద్యుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులకు శత్రుత్వం లేదని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు సీపీఐ నేతలు మద్దుతు ఇవ్వడంతో తప్పేముందని నారాయణ ప్రశ్నించారు.
మరోవైపు పట్టాభి విషయంలో పోలీసుల తీరుపై టీడీపీ ఫైర్
గన్నవరం కేంద్రంగా జరిగిన ఉద్రిక్తతలకు తెలుగు దేశం పార్టికి చెందిన నేత పట్టాభి బాధ్యుడిని చేశారు పోలీసులు. ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన్ని తీవ్రంగా హింసించారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో పోలీసులు తీరు పై తెలుగు దేశం పార్టికి చెందిన నేతలు ఆందోళనలు చేశారు. పట్టాభి భార్య సైతం తన భర్త అచూకి చెప్పాలంటూ ,తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె డీజీపీని కలిసేందుకు ప్రయత్నించటంతో ఆమెను హౌస్ అరెస్టు చేశారు. ఇదంతా గన్నవరం సీటు కోసమే పట్టాభి తెలుగుదేశం తరపున రేస్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఢీ కొట్టేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన నేతను నిలబెట్టాలని, తెలుగు దేశం నేతలు భావిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో ఉండగానే, వల్లభనేని వంశీ గన్నవరంలో శాసన సభ్యుడిగా పాతుకుపోయారు. ఆయన్ను ఢీ కొట్టటం అంటే ఆషా మాషీ వ్యవహరం కాదు.
ప్రస్తుతం వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్‌గా ఉంటున్నారు. దీంతో అధికార పక్షం నుంచి అన్ని విధాలుగా వంశీకి సహకారం ఉంది. గన్నవరంలో వంశీకి దీటుగా ఉండే అభ్యర్థి కోసం తెలుగు దేశం అన్వేషిస్తుందన్న విషయం బహిరంగ రహస్యమే. దీంతో ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు పట్టాభి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. తెలుగు దేశం పార్టీలో పట్టాభి ఇటీవల క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అధికార పక్ష నేతలపై హాట్ కామెంట్స్ చేయటం ద్వారా, రాజకీయాల్లో పట్టాభి పేరు తెచ్చుకున్నారు. తెలుగు దేశం పార్టీ నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న పట్టాభి, అధికార పక్షంపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారటంతో ఆయన ఇంటిపై కూడా దాడి జరిగింది. అదే రోజు తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై కూడా అల్లరి మూకలు దాడులకు తెగబడ్డాయి.
Bhatti Vikramarka Padayatra : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి - భట్టి విక్రమార్క
TS TOSS Exam Schedule: తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్షల తేదీలివే!
Minister Errabelli : పేపర్ లీక్ పై పిచ్చి పిచ్చి ఆరోపణలు, దమ్ముంటే నిరూపించండి - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి సవాల్
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల
Minister Vemula Prashanth Reddy : కేసీఆర్ ను కట్టడి చేయాలని కవితపై కేసుల వేధింపులు- మంత్రి వేముల
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!