By: ABP Desam | Updated at : 07 Apr 2022 12:08 PM (IST)
కాంగ్రెస్ నిరసనలు
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్లే అన్ని దారులను బారీకేడ్లు పెట్టి దిగ్బంధం చేశారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా నేడు తెలంగాణ కాంగ్రెస్ విద్యుత్ సౌధ ముట్టడికి పిలుపునిచ్చింది. ఇందులో రేవంత్ రెడ్డి పాల్గొనాల్సి ఉండగా, ఆయన్ను ముందస్తుగా గృహ నిర్భందం చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ నాయకులు బూటకంగా నిరసనలు చేస్తుంటే వారికి అనుమతి ఇచ్చిన పోలీసులు తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జాతీయ రహదారులన్నీ దిగ్భందం చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని నిలదీశారు.
Fear of @TelanganaCMO is such police force deployed at my home more than his camp office. #FuelPriceHike#PaddyProcurement pic.twitter.com/OxkdN5P245
— Revanth Reddy (@revanth_anumula) April 7, 2022
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ వరుస ఉద్యమాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈ రోజు విద్యుత్ సౌధ, పౌర సరఫరాల కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే, రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, మల్లు రవి, దాసోజు శ్రవణ్, హర్కర వేణుగోపాల్, బక్క జడ్సన్, నగేశ్ ముదిరాజ్ తదితరులను హౌస్ అరెస్ట్ చేశారు.
గురువారం కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కి గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించకుండా పన్నునొప్పి పేరుతో తన అక్రమాల, అవినీతి సొమ్ములకు వచ్చే పన్నుల నొప్పి నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీలో ఉన్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి మాత్రం ఢిల్లీలో పడుకుంటారు కానీ.. ప్రధానిని మాత్రం కలవడని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు సిగ్గులేకుండా ధరల పెరుగుదలకు నిరసనగా జాతీయ రహదారులను దిగ్బంధిస్తూ ప్రజలను, ప్రయాణీకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.
"పన్ను నొప్పా.. పన్నుల నొప్పా..*
— Telangana Congress (@INCTelangana) April 7, 2022
ప్రభుత్వంలో ఉన్నవాళ్లు పరిష్కరించాలి కానీ.. ప్రశ్నించడమేంటి?
ముఖ్యమంత్రి ఢిల్లీలో పండుకుంటాడు.. ప్రధాని కలవడు??
ప్రజాసమస్యలపై పోరాటం చేసే కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ లను ఖండిస్తున్నా"
ప్రచార కమిటీ చైర్మన్ శ్రీ @MYaskhi pic.twitter.com/pruB31kDo8
రైతుల సమస్యలు పరిష్కరించాల్సిన వాళ్లే ధర్నాల పేరుతో రోడ్ల మీద డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రజల పక్షాన పోరాటం చేస్తే అరెస్టులు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చిన ఇన్నేళ్లలో ఏనాడైనా ఇంధన ధరలపై రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ ను తగ్గించాడా?, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాయని గుర్తు చేశారు.
ప్రజలే నా ధైర్యం - పోరాటమే నా ఊపిరి.
— Telangana Congress (@INCTelangana) April 7, 2022
ఎన్ని నిర్భందాలు విధించినా, ఎంతగా అణచివేసినా ప్రజల కోసం, పేదల కోసం, మధ్య తరగతి జీవుల కోసం… వాళ్ల సమస్యల పరిష్కారం కోసం పదునెక్కిన పోరాటాలు నిర్మించడం నా నైజం... pic.twitter.com/vwPD2EQRn0
KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా
Fish Prasadam: ఆస్తమా పేషెంట్లకు చేదువార్త, ఈ ఏడాది సైతం చేప ప్రసాదం పంపిణీ లేదు - హైదరాబాద్‌కు రావొద్దని సూచన
Narayana On Amalapuram: అమలాపురం విధ్వంసం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం
KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా
Hyderabad: రేపు Hydకి ప్రధాని మోదీ, ఈ రూట్లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ
LSG vs RCB, Eliminator: లక్నోదే లక్కు! టాస్ గెలిచిన రాహుల్ - ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల