![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Telangana News: చొప్పదండి ఎమ్మెల్యే సత్యం భార్య ఆత్మహత్య- ముందే వీడియో కాల్ చేసిన చెప్పిన రూపాదేవి
Hyderabad: News భర్తకు వీడియో కాల్ చేసి మరీ సూసైడ్ చేసుకుంటున్నట్టు చొప్పదండి ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై విచారణ జరుగుతోంది కారణాలు తెలియాల్సి ఉంది.
![Telangana News: చొప్పదండి ఎమ్మెల్యే సత్యం భార్య ఆత్మహత్య- ముందే వీడియో కాల్ చేసిన చెప్పిన రూపాదేవి Congress Choppadandi MLA Satyam Wife rupadevi Dies by Suicide in hyderabad Telangana News: చొప్పదండి ఎమ్మెల్యే సత్యం భార్య ఆత్మహత్య- ముందే వీడియో కాల్ చేసిన చెప్పిన రూపాదేవి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/5647b0c1da3e0de23b0f42ec0291d02b1718938325380215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Choppadandi MLA Satyam: తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆల్వాల్‌లోని పంచశీల కాలనీలో నివాసం ఉంటున్న ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయారు.
రాత్రి సమయంలో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. రూపాదేవి ఓ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్నారు. రెండు నెలల క్రితమే రూపా, సత్యం, ఇద్దరూ ఆల్వాల్‌లోని శ్రీ చక్ర అపార్ట్మెంట్లోకి మారారు వీళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఆత్మహత్య చేసుకునే ముందు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫోన్‌కు భార్య వీడియో కాల్ చేసిందని చెబుతున్నారు. అల్వాల్‌లో ఉంటున్న సత్యం గురువారం చొప్పదండి వెళ్లగా సాయంత్రం భార్య ఫోన్ చేసిందని అంటున్నారు. అప్పుడే తాను సూసైడ్ చేసుకొని చనిపోతున్నానని అన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఆయన వచ్చేలోపు భార్య ఇలా చేసుకుందని ఆ విషయం తెలుసుకున్న సత్యం స్పృహతప్పి పడిపోయారు. ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)