అన్వేషించండి

బిహార్‌ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్‌ 2025

(Source:  Poll of Polls)

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో రేవంత్, కేసీఆర్ పాల్గొంటారా ?

Jubilee Hills By Poll: కాంగ్రెస్ నుండి రేవంత్, బీఆర్ఎస్ నుండి కేసీఆర్, బీజేపీ నుండి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారంలోకి దిగితే మాత్రం ఈ పోటీ రసవత్తరంగా మారే అవకాశాలున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Jubilee Hills By Election: జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక ప్రచారం ఊపందుకుంది. మరో 20 రోజుల పాటు ఎన్నికల ప్రచారం జరగనుంది. నవంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఉపఎన్నిక ప్రచార ఘట్టం ముగియనుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు ఈ ఉపఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పార్టీ కార్యకర్తలు, నేతలు తమ పార్టీ గెలుపుకు శక్తివంచన లేకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కృషి చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు అధికార కాంగ్రెస్ గెలుపుకు సీఎం రేవంత్ రెడ్డి, సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. వీరిద్దరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా, లేదా అన్న చర్చ సాగుతోంది.

తాజా, మాజీ ముఖ్యమంత్రులు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొంటారా?

జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక ప్రచార పర్వం వేడెక్కింది. ప్రస్తుతం ఈ ఉపఎన్నిక అటు అధికార కాంగ్రెస్‌కు, ఇటు సిట్టింగ్ స్థానం కాపాడుకొని తన బలాన్ని రుజువు చేసుకునేందుకు బీఆర్ఎస్‌కు కీలకం. అయితే, ఇప్పటి వరకు అటు సీఎం రేవంత్ రెడ్డి కానీ, ఇటు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కానీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. అయితే, మరో 20 రోజుల పాటు ఈ ఎన్నికల ప్రచారం సాగనుంది. ఇప్పటికే సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల గెలుపు వ్యూహాలపై పలు దఫాలుగా పార్టీ ముఖ్యులతో సమీక్షలు నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. అటు కాంగ్రెస్ నుండి మంత్రులు రంగంలోకి దిగి ప్రచారంలో తమదైన శైలిలో ముందుకు సాగుతుంటే, ఇటు బీఆర్ఎస్ నుండి మాజీ మంత్రులు ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే, ఇప్పటి దాకా తాజా, మాజీ సీఎంల ప్రచార షెడ్యూల్‌పై మాత్రం అటు గాంధీ భవన్ వర్గాలు, ఇటు తెలంగాణ భవన్ వర్గాలు నోరు విప్పడం లేదు.

సీఎం రేవంత్ వ్యూహం ఇదేనా....

ఇప్పటి దాకా అన్ని పార్టీలు తమ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. బీఆర్ఎస్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత అభ్యర్థిగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్, బీజేపీ నుండి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. శాసన సభ షెడ్యూల్ విడుదల నుండి నేటి వరకు అభ్యర్థి ఎంపిక, ప్రచార వ్యూహాలపై మూడు పార్టీలు దృష్టి పెట్టాయి. అభ్యర్థులు ఖరారు కావడంతో పార్టీ నేతలంతా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ బాట పట్టారు.

కాంగ్రెస్ నుండి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు ప్రచారంలో పాల్గొన్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లు ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. అయితే, ఇప్పటి దాకా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార షెడ్యూల్ మాత్రం ఖరారు కాలేదు. ఎన్నికల ప్రచారం మరో మూడు వారాలు సాగనుండడంతో, చివరి వారం రోడ్ షోలు నిర్వహించే అవకాశం ఉందని హస్తం ముఖ్య నేతలు చెబుతున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్‌కు కఠిన పరిస్థితులు

మరోవైపు, గత శాసన సభ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్‌కు అనుకున్న ఫలితాలు రాని పరిస్థితి ఉంది. అయినా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ ఉపఎన్నికలోనూ అదే ఫలితం రావచ్చని కొందరు నేతలు చెపుతుంటే, హైడ్రామా కారణంగా నగర ఓటర్లలో కాంగ్రెస్ పట్ల కొంత విముఖత ఉందని, ఇది ప్రభావం ఈ ఉపఎన్నిక ఫలితంపై చూపవచ్చని మరి కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఒకటి రెండు ప్రచార సభల్లో పాల్గొనవచ్చు లేదా పాల్గొనకపోవచ్చని చెబుతున్నారు. సీఎం ప్రచారం చేసినా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీ గెలవకపోతే అది రాజకీయంగా ఓ మచ్చగా మిగలవచ్చని, అందుకే ఈ ఉపఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు. అయితే, ఇప్పటి వరకు అలాంటి సంకేతాలు ఏవీ సీఎం నుండి రాలేదన్నది ఆయన సన్నిహితుల మాట.

అర్థం కాని కేసీఆర్ వ్యూహం

ఇప్పటి దాకా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో అటు కేటీఆర్, ఇటు హరీశ్ రావులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారే మాజీ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ప్రచారం సాగిస్తున్నారు. అయితే, ఈ ఉపఎన్నికల ప్రచారంలో కేసీఆర్ అసలు పాల్గొంటారా, లేదా అన్న చర్చ సాగుతోంది. సాధారణ ఎన్నికల్లో సైతం కేసీఆర్ చివరి నిమిషంలోనే ప్రచారంలో పాల్గొనడం జరుగుతూ ఉండేది. అయితే, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికలో సైతం కేసీఆర్ ప్రచారంలో పాల్గొనలేదు. ఆ ఎన్నికల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేత పద్మారావ్ గౌడ్‌లే ప్రచారం నిర్వహించారు. ఆ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేశ్ విజయం సాధించారు. అయితే, ఇటీవలి పార్టీలో జరిగిన పరిణామాలు, అటు ప్రభుత్వ విచారణలు, ఆరోపణల నేపథ్యంలో కేసీఆర్ ఉపఎన్నిక ప్రచార బరిలో దిగుతారా, లేదా అన్న చర్చ సాగుతోంది. అయితే, పార్టీ ముఖ్యనేతలు మాత్రం ఒకటి రెండు ప్రచార సభలు లేదా రోడ్ షోలు నిర్వహించాలని పార్టీ అధినేతను కోరినట్లు సమాచారం. ఇప్పటి దాకా ఈ విషయంలో కేసీఆర్ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి.

ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ బలంగా తయారవడానికి బీజేపీ ఎన్నో ఏళ్ల నుండి కృషి చేస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో తన బలాన్ని పెంచుకోవాలన్నది ఆ పార్టీ వ్యూహం. అందుకు వేదికగా జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో తన సత్తా చాటేందుకు కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఆ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రాంచందర్ రావుకు ఇది తొలి పరీక్ష. ఈ ఉపఎన్నికలో సత్తా చాటాలని ఆయన భావిస్తున్నారు. అంతే కాకుండా, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జూబ్లీ హిల్స్ ఉండడంతో అక్కడి నుండి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి సైతం ఈ స్థానంలో కమలం పార్టీ వికసించాలని కోరుకుంటున్నారు. గతంలో ఇక్కడి నుండే పోటీ చేసి ఓడిపోయిన దీపక్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలుపు బాట పట్టాలని, తద్వారా రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయం అని చాటేందుకు కమలం నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే కిషన్ రెడ్డి, రాంచందర్ రావులు ప్రచార బాట పట్టారు. మరి కొద్ది రోజుల్లో మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే, బీజేపీ నుండి ముఖ్యనేతలు ఇప్పటికే ప్రచార బరిలో దిగగా, అధికార కాంగ్రెస్ పార్టీ నుండి సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రచార తీరుతెన్నులపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. అటు కాంగ్రెస్ నుండి సీఎం రేవంత్, ఇటు బీఆర్ఎస్ నుండి కేసీఆర్, బీజేపీ నుండి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండిసంజయ్ వంటి వారు ప్రచారంలోకి దిగితే మాత్రం ఈ పోటీ రసవత్తరంగా మారే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag IT Campus: విశాఖ కాపులుప్పాడలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు, 2 వేల మందికి ఉపాధి
విశాఖ కాపులుప్పాడలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు, 2 వేల మందికి ఉపాధి
Konda Surekha: నాగార్జున ఫ్యామిలీపై వ్యాఖ్యలకు చింతిస్తున్నాను.. అర్ధరాత్రి కొండా సురేఖ సంచలన పోస్ట్
నాగార్జున ఫ్యామిలీపై వ్యాఖ్యలకు చింతిస్తున్నాను.. కొండా సురేఖ సంచలన పోస్ట్
Shiva Re Release: 'శివ'లో చైల్డ్ ఆర్టిస్ట్... సైకిల్ టు అమెరికా... ఇప్పుడెలా ఉందో చూశారా?
'శివ'లో చైల్డ్ ఆర్టిస్ట్... సైకిల్ టు అమెరికా... ఇప్పుడెలా ఉందో చూశారా?
Jubilee Hills By-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
Advertisement

వీడియోలు

Bihar Election 2025 Exit Poll Results | బీహార్‌లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆశ్చర్యకర ఫలితాలు | ABP Desam
PM Modi First Reaction on Delhi Blast | ఢిల్లీ బ్లాస్ట్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్
Drone in Jubilee Hills Bypoll | ఎన్నికల్లో ఇదే మొదటిసారి డ్రోన్ ప్రయోగం
White Collar Terror Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
White Collar Terror Attack Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag IT Campus: విశాఖ కాపులుప్పాడలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు, 2 వేల మందికి ఉపాధి
విశాఖ కాపులుప్పాడలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు, 2 వేల మందికి ఉపాధి
Konda Surekha: నాగార్జున ఫ్యామిలీపై వ్యాఖ్యలకు చింతిస్తున్నాను.. అర్ధరాత్రి కొండా సురేఖ సంచలన పోస్ట్
నాగార్జున ఫ్యామిలీపై వ్యాఖ్యలకు చింతిస్తున్నాను.. కొండా సురేఖ సంచలన పోస్ట్
Shiva Re Release: 'శివ'లో చైల్డ్ ఆర్టిస్ట్... సైకిల్ టు అమెరికా... ఇప్పుడెలా ఉందో చూశారా?
'శివ'లో చైల్డ్ ఆర్టిస్ట్... సైకిల్ టు అమెరికా... ఇప్పుడెలా ఉందో చూశారా?
Jubilee Hills By-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
Hyundai Tucson ఛాప్టర్‌ క్లోజ్‌ - మూడు సంవత్సరాలకే ముగిసిన స్టోరీ, కారణం ఇదే
Hyundai Tucson మూడేళ్ల ముచ్చటే - ఇండియన్స్‌కు గుడ్‌బై
YS Jagan:  వ్యక్తిగతంగా హాజరవుతా - వారం గడువు ఇవ్వండి - సీబీఐ కోర్టును కోరిన జగన్
వ్యక్తిగతంగా హాజరవుతా - వారం గడువు ఇవ్వండి - సీబీఐ కోర్టును కోరిన జగన్
Death Hoax: ఎవరి మరణం గురించి అయినా పుకారు వచ్చినప్పుడు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అది ఏ విషయాన్ని సూచిస్తుంది?
ఎవరి మరణం గురించి అయినా పుకారు వచ్చినప్పుడు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అది ఏ విషయాన్ని సూచిస్తుంది?
Nasa Voyager 1: నవంబర్ 13న భూమి నుంచి ఒక కాంతి దినం దూరంలో  వాయేజర్ 1 ,  దీనికి జ్యోతిష్య శాస్త్రానికి లింకేంటి?
నవంబర్ 13న భూమి నుంచి ఒక కాంతి దినం దూరంలో వాయేజర్ 1 , దీనికి జ్యోతిష్య శాస్త్రానికి లింకేంటి?
Embed widget