Chandrababu : ఐఐఐటీ హెచ్ సిల్వర్ జూబ్లి ఉత్సవాలకు చంద్రబాబు - గురువారం విద్యార్థులతో ముఖాముఖి !
ఐఐఐటీ హెచ్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు.
Chandrababu : హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటోంది. ఈ ఉత్సవాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కూడా పాల్గొంటున్నారు. ఆయన ఆగస్టు 23 ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో విద్యార్థులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. ట్రిపుల్ ఐటీ ఆవిర్భావం, ఐటీ రంగ అభివృద్ధి వంటి అంశాలపై విద్యార్థులతో చర్చించనున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా యాజమాన్యం కొన్ని రోజులుగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలోనే, 1998లో హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఏర్పాటైంది.
గత జనవరి నుంచి ట్రిబుల్ ఐటీ హైదరాబాద్ సిల్వర్ జూబ్లీ టాక్ సిరీస్ నిర్వహిస్తోంది. మొదటగా జనవరిలో తెలంగాణ మంత్రి మంత్రి కేటీఆర్ టెక్నాలజీ అభివృద్ధి, ఆర్థిక ప్రగతి, హైదరాబాద్ వంటి అనేక అంశాలపైన ప్రసంగించారు. అనంతరం విద్యార్థులు, ఆధ్యాపకులతో మాట్లాడారు. ఈ క్రమంలోనే పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దేశంలోని ఐఐఐటిలలో తొలిగా ప్రారంభించిన జాతీయ గుర్తింపు పొందిన పరిశోధనా విశ్వవిద్యాలయం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , కంప్యూటర్ సైన్స్ , ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ విభాగాలలో పరిశోధన చేస్తుంది. ఇది లాభాపేక్షరహిత ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం కింద స్థాపించారు. గత రెండు దశాబ్దాలుగా, ఈ సంస్థ వివిధ రంగాలలో పరిశోధనా కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఇది పరిశ్రమకు, సమాజానికి ఉపయోగపడే పరిశోధనలకు పెద్ద పీట వేస్తుంది.
గత డిసెంబర్ లో గచ్చిబౌలిలోని ఇండియన్ బిజినెస్ స్కూల్ ద్విదశాబ్ది ముగింపు ఉత్సవాల్లో నూ చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సంస్థ ఏర్పాటులో చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగిన సమయంలో 1999లో ఐఎ్‌సబీకి శంకుస్ఠాపన జరగ్గా, 2001లో ప్రారంభమైంది. హైదరాబాద్‌లో 2001 డిసెంబరు 2న నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, చంద్రబాబులు ఐఎ్‌సబీని ఆరంభించారు. అంతకు ముందే... హైదరాబాద్ లో ఐటీ రంగాన్ని ప్రోత్సహించిన చంద్రబాబు.. పరిశోధనల కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసేలా కృషి చేశారు.