By: ABP Desam | Updated at : 18 Apr 2023 02:36 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ నుంచి విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని సీబీఐ కోరింది. ఆయన్ను ఇంకా ప్రశ్నించాలని వాదించింది. గతంలో అవినాష్ రెడ్డి నాలుగు సార్లు ప్రశ్నించగా, అందుకు ఆయన సహకరించలేదని సీబీఐ తరపు న్యాయవాదులు తెలిపారు. కాబట్టి, అవినాష్ రెడ్డి నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని కోర్టును కోరారు.
వివేకా హత్య జరిగిన రోజు ఉదయం అవినాష్ రెడ్డి జమ్మలమడుగుకు దగ్గర్లో తాను ఉన్నట్లు చెప్పారు. కానీ, మొబైల్ సిగ్నల్స్ చూస్తే ఆయన తన ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రాత్రంతా తన ఫోన్‌ను ఎక్కువగా వినియోగించినట్లు సాంకేతికంగా గుర్తించామని కోర్టుకు చెప్పారు. వివేకా హత్య కుట్ర అవినాష్ రెడ్డికి ముందే తెలుసని చెప్పారు. విచారణలో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను తాము సేకరించామని, అసలు వివేకా హత్యను గుండెపోటుగా ఎందుకు చెప్పాలనుకున్నారో తెలియాలని కోర్టులో వాదనలు వినిపించారు. అనంతరం కోర్టు విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.
TS ICET: జూన్ 4న తెలంగాణ ఐసెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?
Hyderabad Stray Dogs: హైదరాబాద్ లో మరో విషాదం, వీధి కుక్కల భయంతో బాలుడు మృతి!
TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!
పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, స్టైపెండ్ పెంచిన సర్కార్ - ఎంత శాతమంటే?
Weather Latest Update: సండే మండే, రెండు రోజులు అసలు బయటకు వెళ్లొద్దు- సూరన్నతో కాస్త జాగ్రత్త
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!