News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

GHMC Cantonment: జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనంపై ముందడుగు - అధ్యయన కమిటీ ఏర్పాటు

Cantonment GHMC Merger: జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనంపై కేంద్ర ప్రభుత్వం ఓ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. 9 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ రిపోర్టు తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. 

FOLLOW US: 
Share:

Cantonment GHMC Merger: జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనంపై కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ప్రత్యేకంగా ఓ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. రక్షణ శాఖ, రాష్ట్ర మున్సిపల్ సెక్రటరీతో సహా 8 మంది సభ్యులతో కమిటీని నియమించింది. ఈ కమిటీ రిపోర్టు తర్వాతే కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ విలీనంపై నిర్ణయం తీసుకోనుంది. విలీనానికి మద్దతు తెలుపుతూ గతంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపిన విషయం తెలిసిందే. అయితే నెల రోజుల్లో పూర్తి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఈ కమిటీ సమర్పించనుంది. కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ పలుమార్లు కేంద్రాన్ని కోరారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లోనూ ఫైర్ అయ్యారు. కంటోన్మెంట్ తో నగర అభివృద్ధిపై ప్రభావం పడుతుందని కేంద్రానికి వివరించారు. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయడంపై కసరత్తు మొదలు పెట్టింది. కేంద్రం నిర్ణయంతో కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు సంబురాలు చేసుకున్నారు. 

హైదరాబాద్ అభివృద్ధికి కంటోన్మెంట్ అధికారులు అడ్డుపడుతున్నారు..!

హైద‌రాబాద్ అభివృద్ధికి కంటోన్మెంట్ అధికారులు అడ్డు పడుతున్నారని గతంలోనే మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి కేటీఆర్... కంటోన్మెంట్ అధికారులు ఇష్టం వచ్చిన‌ట్లు వ్యవ‌హ‌రిస్తే సహించేది లేదన్నారు. కంటోన్మెంట్ అధికారులు రోడ్లు బంద్ చేస్తే, తాము క‌రెంట్, నీళ్లు బంద్ చేస్తామ‌ని కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కార్వాన్ నియోజ‌క‌ వ‌ర్గంలో  నాలాల స‌మ‌స్యల‌పై స్థానిక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు. కంటోన్మెంట్‌లో అధికారులు చెక్ డ్యాం నిర్మించి నీళ్లు ఆప‌డంతో న‌దీం కాల‌నీ మునిగిపోతుందని అన్నారు. శాతం చెరువు నుంచి గోల్కొండ కింద‌కు ఏఎస్ఐ అనుమ‌తి తీసుకొని నీళ్లు వ‌దులుదామంటే అక్కడ ఏఎస్ఐ అనుమ‌తి ఇవ్వడం లేదని మంత్రి అన్నారు. కంటోన్మెంట్, ఏఎస్ఐ రెండూ అడ్డు పడుతున్నాయని మంత్రి అన్నారు. ఇది మంచి ప‌ద్ధతి కాదని మంత్రి హితవు పలికారు. 

వినకపోతే కఠిన చర్యలు 

తెలంగాణ వేరే దేశం అన్నట్టు కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరికాదని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో ఉన్నప్పుడు కలిసి మెలిసి ఉండాలి కానీ ఇష్టమొచ్చిన‌ట్లు రోడ్లు బంద్, నాలాల మీద చెక్ డ్యాంలు క‌డుతామంటే చూస్తూ ఊరుకోమని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ప్రజ‌ల కోసం ఎంత‌కైనా తెగిస్తామన్నారు. అవ‌స‌ర‌ం అయితే కంటోన్మెంట్ అధికారులకు మంచినీళ్లు, క‌రెంట్ బంద్ చేస్తామని తేల్చి చెప్పారు. అప్పుడైనా దిగివస్తారని అని కేటీఆర్ అన్నారు. కంటోన్మెంట్ అధికారుల‌ను త‌క్షణ‌మే పిలిచి మాట్లాడాల‌ని స్పెష‌ల్ చీఫ్ సెక్రట‌రీని ఆదేశిస్తామ‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. కంటోన్మెంట్ అధికారులు వినకపోతే తీవ్రమైన చ‌ర్యల‌కు వెనుకాడమని అన్నారు. కేంద్రం పైసా సాయం చేయ‌దు కానీ పని చేస్తున్న ప్రభుత్వానికి అవ‌రోధాలు కలిగిస్తుందని కేటీఆర్ ఆరోపించారు. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్టుతో విలీనం విషయం తేలిపోనుంది. మరి ఏం జరగనుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే. 

Published at : 05 Jan 2023 04:01 PM (IST) Tags: Hyderabad News secunderabad cantonment Telangana News Cantonment GHMC Merger Secunderabad Cantonment with GHMC

ఇవి కూడా చూడండి

TS GENCO: జెన్‌కో ఉద్యోగాల రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TS GENCO: జెన్‌కో ఉద్యోగాల రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Revanth Reddy open letter: చివరిశ్వాస వరకు అటు కొడంగల్, ఇటు మల్కాజ్ గిరి నా ఊపిరి - రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Revanth Reddy open letter: చివరిశ్వాస వరకు అటు కొడంగల్, ఇటు మల్కాజ్ గిరి నా ఊపిరి - రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

BRS MLA Marri Rajashekar Reddy: బీఆర్ఎస్ నేతలకు బెదిరింపు ఫోన్ కాల్స్, సీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

BRS MLA Marri Rajashekar Reddy: బీఆర్ఎస్ నేతలకు బెదిరింపు ఫోన్ కాల్స్, సీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

Revanth Reddy Tweet: 'అంతకు మించిన తృప్తి ఏముంటుంది.?' - ప్రజాదర్బార్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

Revanth Reddy Tweet: 'అంతకు మించిన తృప్తి ఏముంటుంది.?' - ప్రజాదర్బార్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

టాప్ స్టోరీస్

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

CM Jagan Vs TDP : టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం - అంతా జగనే చేశారా ?

CM Jagan Vs TDP :   టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం -  అంతా జగనే చేశారా ?