అన్వేషించండి

Telangana Politics: స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు వెళ్లే యోచనలో బీఆర్ఎస్.. రాజ్యాంగ హత్యగా అభివర్ణించిన బీజేపీ చీఫ్

BRS Politics | రాజ్యాంగాన్ని కాపాడటం అంటే ఇదేనా?, పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు వేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమని స్పీకర్ తీర్పుపై హరీశ్ రావు మండిపడ్డారు.

Telangana Assembly Speaker | హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత టి. హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా వినిపిస్తున్న “సేవ్ ది కానిస్టిట్యూషన్” నినాదం, ఈ రోజు స్పీకర్ ఇచ్చిన తీర్పుతో పూర్తిగా బహిర్గతమైందని ఎద్దేవా చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ సంస్థలను కూడా దిగజార్చడం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని, ఈరోజు స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్య సూత్రాలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. 

తీర్పు కాపీని చెక్ చేసిన తరువాత హైకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కె.సంజయ్‌ తెలిపారు. స్పీకర్ సమగ్ర విచారణ చేసి నిర్ణయం తీసుకోవాలి, కానీ తమ వాదన పట్టించుకోకుండా ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వారు ప్రచారం చేశారంటే పార్టీ మారినట్లే కదా. కానీ రాజ్యాంగవిరుద్ధంగా స్పీకర్ వ్యవహరించారని పేర్కొన్నారు. తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి. ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం కొట్టివేశారు.

రాజ్యాంగ ఉల్లంఘనపై ఘాటు విమర్శలు
పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో భారత రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిన యాంటీ-డిఫెక్షన్ (ఫిరాయింపుల నిరోధక చట్టం) నియమాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని హరీశ్ రావు ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకోవాల్సిన స్పీకర్ ప్రసాద్ కుమార్ వ్యవస్థను అధికార పార్టీకి అనుకూలంగా వాడుకోవడం రాజ్యాంగాన్ని కాలరాయడమేనని పేర్కొన్నారు. ఢిల్లీలో రాజ్యాంగ నైతికతపై గొప్ప ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు, తెలంగాణలో మాత్రం అదే రాజ్యాంగాన్ని సిగ్గు లేకుండా ధిక్కరిస్తున్నారని, ఇదే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీల నిజస్వరూపమని హరీష్ రావు విమర్శించారు.

ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ
రాజ్యాంగాన్ని రక్షించడం అంటూ కాంగ్రెస్ పార్టీకి కేవలం మాటలకే పరిమితమైందని, ఆచరణలో మాత్రం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తెలంగాణ ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి చెరగని మచ్చ, ఎంతో సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు స్వతంత్రంగా వ్యవహరించాల్సింది పోయి, రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్ నిర్ణయం: బీజేపీ ఘాటు విమర్శలు
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారంపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రంగా స్పందించారు. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, ఇది ముమ్మాటికీ "రాజ్యాంగ హత్య, ప్రజాస్వామ్య హత్య" అని ఆయన అభివర్ణించారు. రాజ్యాంగాన్ని కాపాడుతామని నిరంతరం ప్రగల్భాలు పలికే కాంగ్రెస్ పార్టీ, చివరకు రాజ్యాంగబద్ధమైన స్పీకర్ వ్యవస్థను కూడా ప్రభావితం చేసి తప్పుడు నిర్ణయం వచ్చేలా చేసిందని ఆరోపించారు.

కాంగ్రెస్ నైతికతపై ప్రశ్నలు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని (Anti-Defection Law) తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అయినప్పటికీ, ఈరోజు అదే పార్టీ ఆ చట్టానికి కనీస గౌరవం ఇవ్వకుండా వ్యవహరిస్తోందని రాంచందర్ రావు మండిపడ్డారు. చేతుల్లో రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని దేశమంతా పర్యటిస్తున్న రాహుల్ గాంధీ లాంటి నాయకులే, రాజ్యాంగ విలువలపై దాడి చేస్తున్నారని విమర్శించారు. స్పీకర్ పదవి అనేది స్వతంత్రంగా,  పక్షపాతం లేకుండా పనిచేయాల్సిన అత్యున్నత పదవి అని, కానీ ప్రస్తుత నిర్ణయం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగిలిపోతుందని పేర్కొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget