అన్వేషించండి

Kavita Latest News: "బీసీ రిజర్వేషన్లకు బీఆర్‌ఎస్ వ్యతిరేకం" కవిత సంచలన వ్యాఖ్యలు

Kavita Latest News: బీసీ రిజర్వేషన్‌కు బీఆర్‌ఎస్ వ్యతిరేకమని ఆ విషయంలో మున్సిపల్ ఎన్నికల్లో ఓ వ్యక్తికి టికెట్ ఇవ్వడంతోనే తేలిపోయందన్నారు కవిత. దీనిపై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Kavita Latest News: బీఆర్‌ఎస్‌పై కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని అధికారికంగా ప్రకటించారని అభిప్రాయపడ్డారు. బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్న వారి నోటి కాడ ముద్ద లాక్కున్న బుట్టంగారి మాధవ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో స్పష్టమైందన్నారు. ఆయనకు మున్సిపల్ ఎన్నికల బరిలో నిలబెట్టి తాము బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీఆర్‌ఎస్ రాజముద్ర వేసి చెప్పిందన్నారు. అలా కాదనుకుంటే ఆ పార్టీ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. 

బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం జాగృతి సహా బీసీ సంఘాలన్నీ పోరాటం చేస్తున్నాయని గుర్తు చేశారు. ఎన్నో రోజులు పోరాటం చేసి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 42 శాతం రిజర్వేషన్ల బిల్లు వచ్చేలా చేశామని వివరించారు. కానీ బుట్టంగారి మాధవ్ రెడ్డి సహా మరొక వ్యక్తి దీనిపై పిటిషన్ వేశారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందని మండిపడ్డారు. అంటే ఈ కేసును బీఆర్ఎస్ వేయించిందా? బీసీల రిజర్వేషన్లకు బీఆర్ఎస్ వ్యతిరేకమా? అని ప్రశ్నించారు. ఈ మాధవ్ రెడ్డి అనే వ్యక్తి హరీష్ రావుకి చాలా దగ్గర వ్యక్తి అని తెలిపారు. హరీష్ రావు పర్సనల్ లాయర్ ఈ కేసు వేయించారని ఆరోపించారు. అప్పుడు దీని వెనుక ఉన్నది హరీష్ మాత్రమే అని విమర్శించారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఆయనకు టికెట్ ఇవ్వటం కారణంగా దీని వెనుక బీఆర్ఎస్ మొత్తం ఉన్నట్లు అర్థమవుతోందన్నారు. తెలంగాణలో 56 శాతం ఉన్న బీసీల నోటికాడి బుక్క గుంజుకునే ప్రయత్నం చేసిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని నిలదీశారు. 

బీఆర్ఎస్ అసలు బీసీల విషయంలో చిత్తశుద్దితో లేదని ధ్వజమెత్తారు కవిత. పార్టీ పరంగా కూడా వాళ్లు మీటింగ్‌  పెట్టలేదన్నారు. బీసీ ప్రజాప్రతినిధుల ఫోరమ్ పేరుతో మాత్రమే మీటింగ్‌లు పెట్టారని తెలిపారు. జనగణనన విషయంలో కూడా ముందు కన్‌ఫ్యూజ్ చేశారని, తర్వాత మళ్లీ జనగణన చేయాలంటూ డిమాండ్ చేశారన్నారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో అంతా రోడ్లపైకి వస్తే కానీ వాళ్ల మీటింగ్ లు కార్యరూపం దాల్చలేదిని వివరించారు. అందుకే బీసీలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైఖరిని గమనించాలని కవిత విజ్ఞప్తి చేశారు. బుట్టంగారి మాధవ్ రెడ్డిని నాయకుడిని చేసింది జాగృతియేనని తెలిపారు. హరీష్ రావు ఆయనను తప్పుదోవ పట్టించి కేసు వేయించారని ఆరోపించారు. 

బీఆర్‌ఎస్ పరిస్థితి ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా తక్కువ తినలేదని చెప్పుకొచ్చారు కవిత. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన వారికి మునిసిపల్ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌లు నియమించారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీని నిజామాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జ్ గా చేస్తే, ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్ రావును కూడా తమ పార్టీ ఇన్‌ఛార్జ్‌ల జాబితాలో చోటు కల్పించారని అన్నారు. వీళ్లంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని స్పీకర్ ప్రకటిస్తే ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం అందుకు భిన్నంగా నవ్విపోదురుగాక నాకేటీ సిగ్గు అన్నట్లుగా ఎన్నికల బాధ్యతలు అప్పగించిందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాలు పట్టుకొని తిరగడం కాదని, కాంగ్రెస్‌లో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని సూచించారు.

ఇప్పటి వరకు పాలన చూసిన ప్రజలంతా తమతో కలిసి వస్తున్నారని కవిత అన్నారు. కొన్ని పార్టీలు కలిసి వచ్చాయని తెలిపారు. అందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి తరపున సింహం గుర్తుపై కొందరు పోటీ చేస్తున్నారని వెల్లడించారు. ప్రశ్నించే తమలాంటి వాళ్లతోపాటు సీపీఎం, న్యూ డెమాక్రసీ, స్వతంత్ర అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారని వివరించారు. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభను ఈ నెల 12 న నిర్వహిస్తున్నామని, ఈ సభకు ఉద్యమకారులు, అమరుల కుటుంబ సభ్యులు, తెలంగాణ వాదులు హాజరుకావాలని ఆహ్వానించారు. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: సొంత మనుషులపై మరిగే నీళ్లు! నమ్మినోళ్లను నట్టేట ముంచడం కేటీఆర్‌ నైజం: కవిత
సొంత మనుషులపై మరిగే నీళ్లు! నమ్మినోళ్లను నట్టేట ముంచడం కేటీఆర్‌ నైజం: కవిత

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Tirupati Municipal Elections: తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Rayachoti Murder Plot: రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Maha Navami 2026: దసరా మహానవమి!మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
దసరా మహానవమి 2026: మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
Embed widget