Brahmanandam Meets KCR: ఫ్యామిలీతో వెళ్లి సీఎం కేసీఆర్ను కలిసిన బ్రహ్మానందం, ఎందుకంటే!
Brahmanandam Meets CM KCR: ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ప్రగతి భవన్ కు వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు.
![Brahmanandam Meets KCR: ఫ్యామిలీతో వెళ్లి సీఎం కేసీఆర్ను కలిసిన బ్రహ్మానందం, ఎందుకంటే! Brahmanandam Meets CM KCR: Brahmanandam Invited CM KCR to his Son siddharth Wedding Brahmanandam Meets KCR: ఫ్యామిలీతో వెళ్లి సీఎం కేసీఆర్ను కలిసిన బ్రహ్మానందం, ఎందుకంటే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/29/647e4b819e67c0f7442116c4e5af3ec51690644555601233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Brahmanandam Meets Telangana CM KCR: ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. కుటుంబ సమేతంగా ప్రగతి భవన్కు వెళ్లిన ఆయన తన రెండో కుమారుడు సిద్ధార్థ్ వివాహానికి రావాలని సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. భార్య, పెద్ద కుమారుడు గౌతమ్ తో కలిసి ప్రగతి భవన్ కు వెళ్లిన బ్రహ్మానందం తన కుమారుడు సిద్ధార్థ్ మ్యారేజ్ వెడ్డింగ్ కార్డును అందజేసి పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కేసీఆర్కు అందజేశారు. ఈ చిత్రపటాన్ని బ్రహ్మానందం స్వయంగా గీయడం విశేషం.
హైదరాబాద్ లో జరుగనున్న తన కుమారుని వివాహానికి ఆహ్వానిస్తూ ఈరోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును కుటుంబ సమేతంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన ప్రముఖ సినీ నటుడు శ్రీ బ్రహ్మానందం.
— Telangana CMO (@TelanganaCMO) July 29, 2023
ఈ సందర్భంగా శ్రీ బ్రహ్మానందం దంపతులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. pic.twitter.com/6tk7STEbYL
బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ్ వివాహం ఐశ్వర్యతో త్వరలో హైదరాబాద్‌లో జరగనుంది. ఈ క్రమంలో కుటుంబ సమేతంగా ప్రగతి భవన్కు వెళ్లిన బ్రహ్మానందం, రెండో కుమారుడి వివాహానికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాసేపు బ్రహ్మానందం ఫ్యామిలీతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. వధూవరుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్రహ్మానందం చేస్తున్న లేటెస్ట్ సినిమాల వివరాలతో పాటు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
బ్రహ్మానందం వ్యక్తిగత విషయానికి వస్తే.. ఈ ప్రముఖ హాస్యనటుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు గౌతమ్సినిమాల్లో నటించాడు. హీరోగా అందరికీ తెలిసిన వ్యక్తే. రెండో కుమారుడు సిద్ధార్థ్ గురించి ఎవరికీ అంతగా తెలియదు. అయితే సిద్ధార్థ్ నటనపై కాకుండా చదువుపై ఫోకస్ చేశారు. డాక్టర్గా సేవలు అందిస్తున్నారు. ఐశ్వర్య, సిద్ధార్థ్ ఎంగేజ్ మెంట్ మే నెలలో వైభవంగా జరిగింది. త్వరలో మూడు ముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటి కానుంది.
టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. త్వరలోనే ఆయన చిన్న కొడుకు సిద్దార్థ్ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. కరీంనగర్‌కు చెందిన ప్రముఖ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజ వినయ్ కుమార్తె డాక్టర్ ఐశ్వర్యను సిద్దార్థ్ వివాహం చేసుకోనున్నారు. సిద్ధార్థ్ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించి ప్రస్తుతం అక్కడే ఉద్యోగరీత్యా సెటిల్ అయ్యాడు. బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్ధార్థ్ విదేశాలలో చదువుకున్నాడు. ప్రస్తుతం అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. అతడి గురించి చాలా మందికి తెలియదు. సిద్ధార్థ్ కు సినిమాల పైన పెద్దగా ఆసక్తి లేదు. అందుకే ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. తాజాగా అతడి పెళ్లి జరుపుతున్నారు. సిద్ధార్థ్-ఐశ్వర్య వివాహం త్వరలోనే జరగబోతోంది. ఈ వివాహాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు బ్రహ్మానందం ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)