By: ABP Desam | Updated at : 10 Jan 2023 07:17 PM (IST)
Edited By: jyothi
"సోమేష్ కుమార్ ను తొలగించి, తెలంగాణకు కేటాయించిన వ్యక్తిని సీఎస్ గా నియమించాలి"
Bandi Sanjay on KCR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ సీఎస్ గా ఉన్న సోమేష్ కుమార్ ను తొలగించి.. రాష్ట్రానికి కేటాయించిన మరో వ్యక్తి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజ తర్వాత ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి ఏపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తెలంగాణలో కీలక పదవులు కట్టబెట్టడం అనైతికం, అప్రజాస్వామికం అని బండి సంజయ్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఏరోజు చట్టాలు, రాజ్యాంగం, కేంద్ర నిబంధనలను గౌరవించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ అవసరాల కోసం అధికారులను పావుగా వాడుకుంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి కేటాయించిన ఎందరో అధికారులు సీనియారిటీ లిస్టులో ఉండగా.. ఏపీకి కేటాయించిన సోమేష్ కుమార్ ను సీఎస్ గా నియమించుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధిపొందిందని ఆరోపించారు.
317 జీవో సహా అనేక ఉద్యోగ, ప్రజా వ్యతిరేక ఉత్తర్వులను సోమేష్ కుమార్ ద్వారా విడుదల చేయించారని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. హెచ్ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్, హోం తదితర శాఖల్లో తమకు అనుకూలమైన అధికారులను నియమించుకొని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడేందుకు సోమేష్ కుమార్ ను పావుగా వాడుకున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్ నియామకం విషయంలో కోర్టులో కేసులు పెండింగ్ లో ఉండగా.. సీఎస్ గా నియమించడం కేసీఆర్ అనైతిక రాజకీయాలకు నిదర్శనం అన్నారు. ఈ విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒక న్యాయం, సీఎస్ సోమేష్ కుమార్ కు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా హైకోర్టు ఆదేశాల మేరకు సోమేష్ కుమార్ ను తొలగించి.. తెలంగాణకు కేటాయించిన వ్యక్తిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని కోరారు.
ఏపీ కేడర్ కు వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు..
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేడర్ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం తెలంగాణ కేడర్ లో ఉండగా ఆంధ్రప్రదేశ్ కేడర్ కి వెళ్లాలని ఆదేశించింది. గతంలో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సోమేశ్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కేడర్ కు కేటాయించింది. కానీ, డిప్యుటేషన్ పై ఆయన తెలంగాణలో పని చేసేలా కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) తర్వాత ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ప్రకారమే ఇప్పుడు సోమేశ్ కుమార్ తెలంగాణలో అత్యున్నత అధికారిగా ఉన్నారు. అయితే, కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కేంద్ర ప్రభుత్వం హైకోర్టు ఆశ్రయించింది. దీనిపై సుదీర్ఘమైన విచారణ చేసిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం తాజాగా క్యాట్ ఉత్తర్వులు రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. ఇంకో ఏడాది సోమేశ్ కుమార్ కు పదవీ కాలం ఉంది. అయితే, ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టు ఆశ్రయిస్తారా? అనేది ఆసక్తిగా మారింది.
Hyderabad G-20 Startup 20 Inception : స్టార్టప్ వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి- కిషన్ రెడ్డి
BJYM Protest : డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, బీజేవైఎం అధ్యక్షుడికి గాయాలు
ఇది అవమానమే .! కేసిఆర్ ప్రభుత్వంపై పద్మశ్రీ అవార్డు గ్రహీత సంచలన వ్యాఖ్యలు!
Hyderabad IIIT: త్రిబుల్ ఐటీ హైదరాబాద్ సిల్వర్ జూబ్లీ టాక్ సిరీస్ ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ఎమ్మెల్సీ కవితతో నటుడు శరత్ కుమార్ భేటీ- రాజకీయాలపై చర్చ!
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CBI Case Avinash Reddy : సీబీఐ ఎదుట హాజరైన అవినాష్ రెడ్డి - ముందుగా వైఎస్ విజయలక్ష్మితోనూ భేటీ !
Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు
Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?