![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
BJP JP Nadda Meeting: హైదరాబాద్ లో బీజేపీ నేతలతో జేపీ నడ్డా కీలక భేటీ - 11 రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు హాజరు
BJP JP Nadda Meeting: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన 11 రాష్ట్రాల అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశం జరుగుతోంది.
![BJP JP Nadda Meeting: హైదరాబాద్ లో బీజేపీ నేతలతో జేపీ నడ్డా కీలక భేటీ - 11 రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు హాజరు BJP National President JP Nadda Meeting With 11 State Presidents BJP Organizational General Secretaries Hyderabad Telugu News BJP JP Nadda Meeting: హైదరాబాద్ లో బీజేపీ నేతలతో జేపీ నడ్డా కీలక భేటీ - 11 రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు హాజరు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/09/dfb7db887fddd643f1d3fae2ea5c90f11688892166237519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
BJP JP Nadda Meeting:హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన 11 రాష్ట్రాల అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశం కొనసాగుతోంది. త్వరలో జరగబోయే శాసన సభ, పార్లమెంట్ ఎన్నికలు, పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అవలంభించాల్సిన అంశాలపై నేతలు చర్చిస్తున్నారు. హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డాకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశానికి బీజేపీ నాయకులు బీఎల్ సంతోష్, బండి సంజయ్, ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురుందేశ్వరి, డీకే అరుణ, ఎంపీ లక్ష్మణ్, ఈటల రాజేందర్ సహా ముఖ్య నేతలు హాజరయ్యారు. బీజేపీలో అసంతృప్త నేతలను బుజ్జగించే పూర్తి బాధ్యతలను ఈటల రాజేందర్ కు అప్పగించారు. సమావేశం కోసం రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
బిజెపి దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, ప్రభారీల సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ బేగం పేట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు @JPNadda గారిని ఘనంగా స్వాగతించిన తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి @kishanreddybjp .#BJP4India pic.twitter.com/PUq44P9jKp
— BJP Telangana (@BJP4Telangana) July 9, 2023
ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆదరణీయులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారికి స్వాగతం పలికాను.
— G Kishan Reddy (@kishanreddybjp) July 9, 2023
11 రాష్ట్రాల అధ్యక్షులు, సంఘటనా ప్రధాన కార్యదర్శులు, ఇంఛార్జీలతో హైదరాబాద్ లో నేడు జరగనున్న సమావేశాన్ని ఉద్దేశించి శ్రీ జేపీ నడ్డా గారు… pic.twitter.com/0Q8K5F5T6v
బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న జేపీ నడ్డా.. పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు. అంతకు ముందు.. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న జేపీ నడ్డాకు... బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. ఆయనతో పాటే బీజేపీ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, ప్రభారీలు వచ్చారు.
Welcomed @BJP4India National President Shri @JPNadda Ji at Begumpet airport in #Hyderabad. pic.twitter.com/JhqzHrH0yO
— Dr K Laxman (@drlaxmanbjp) July 9, 2023
Welcomed Shri @JPNadda ji, @BJP4India National President , at Begumpet Airport in Hyderabad. pic.twitter.com/F1Y5CPGDRI
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 9, 2023
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)