అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Etela Rajender On BRS: కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటనపై ఎమ్మెల్యే ఈటల ఘాటు వ్యాఖ్యలు, పగటి కలలంటూ సెటైర్!

బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో తెలంగాణకు, ఉద్యమ నేత సీఎం కేసీఆర్ కు ఉన్న బంధం తెగిపోయిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల. ఉద్యమ పార్టీని ఖతం పట్టించారని కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇన్ని రోజులు తన తెలంగాణ గడ్డ, తెలంగాణ ప్రజలు అని చెప్పుకునే సీఎం కేసీఆర్ కు రాష్ట్రంతో ఉన్న బంధం తెగిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా చెప్పినట్లే.. ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి (BRS) గా కేసీఆర్ ప్రకటించారు. జాతీయ పార్టీగా మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయగా, పార్టీ జనరల్ బాడీ ఆమోదం తెలిపింది. పార్టీ సర్వసభ్య సమావేశం చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని కేసీఆర్ చదివి వినిపించారు. కేసీఆర్ బీఆర్ఎస్ ప్రకటన అనంతరం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఉద్యమ పార్టీని ఖతం పట్టించిన కేసీఆర్ 
బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో తెలంగాణకు, ఉద్యమ నేత సీఎం కేసీఆర్ కు ఉన్న బంధం తెగిపోయిందన్నారు. ఉద్యమ పార్టీని ఖతం పట్టించి, ఉద్యమకారులను మరిచిపోయేటట్టు చేశారని కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఉద్యమ చరిత్ర లేకుండా చూసేందుకు, తన ముద్ర ఉండే పార్టీ బీఆర్ఎస్ ని కేసీఆర్ స్థాపించారని విమర్శించారు. జాతీయ పార్టీ బీఆర్ఎస్ స్థాపనతోనే తెలంగాణకి కేసీఆర్ కు ఉన్న బంధం పూర్తిగా తెగిపోయిందని, రాష్ట్ర ప్రజానీకానికి టీఆర్ఎస్ పార్టీకి ఉండే బంధం తెగిపోయిందన్నారు. రాష్ట్ర సాధనలో పాలు పంచుకున్న తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ చైతన్యానికి కేసీఆర్ కి ఉన్న బంధం తెగిపోయిందని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే ఈటల.

కూట్లో రాయి తీయలేనివాడు ఎట్లో రాయి తీస్తాడా !
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలు పరిష్కరించలేనివాడు, పలు వర్గాల ప్రజల విశ్వాసం కోల్పోయి ఇబ్బంది పడుతున్నప్పుడు.. ఆ సంప్రదాయాన్ని ఆ దుఃఖాన్ని దేశం మీద రుద్దే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని ఆరోపించారు. తాను చెప్పేదాంట్లో ఒకటి మాత్రం నిజమని.. కూట్లో రాయి తీయలేనివాడు, ఎట్లో రాయి తీయడానికి పోయినట్టు ఉంది అంటూ జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రంగప్రవేశాన్ని ఎద్దేశా చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరువాత కేసీఆర్ నమ్ముకున్నది కేవలం మద్యం, డబ్బును మాత్రమేనన్నారు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో చక్రం తిప్పేందుకు వెళ్తున్నానంటూ కేసీఆర్ పగటి కలలు కంటున్నారని, అది కలగానే మిగిలిపోతుందని బీజేపీ నేత ఈటల అన్నారు.

టీఆర్ఎస్ చరిత్ర ముగిసినట్లేనా ! 
తెలంగాణ రాజ‌కీయ చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయం లిఖించబ‌డింది. భార‌త్ రాష్ట్ర స‌మితిగా సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. జాతీయ పార్టీగా మారుస్తూ ఏక‌గ్రీవ తీర్మానం చేశారు. 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్ర‌స్థానంలో మ‌రో మలుపు చోటు చేసుకుంది. ప‌లు రాష్ట్రాల నేత‌ల స‌మ‌క్షంలో కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చడంతో పాటు టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.  టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ పార్టీ కార్యవర్గం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులందరూ  ఆమోదించారు. దీంతో మధ్యాహ్నం 1.19 గంటలకు బీఆర్ఎస్ పార్టీ పేరును ప్రకటించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Embed widget