News
News
X

Ganesh Nimajjan: గణేష్ నిమజ్జన డేట్‌పై ఉత్సవ సమితి క్లారిటీ - సర్కార్‌కు వార్నింగ్, రేపు బైక్ ర్యాలీ

పోలీసులు 9వ తేదీ నిమజ్జనం లేదని ప్రచారం చేస్తున్నారని ఉత్సవ సమితి కార్యదర్శి అన్నారు. ఇంకా వాటిని వాట్సాప్ లో విపరీత ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

FOLLOW US: 

ఈ నెల 9వ తేదీన గణేష్ నిమజ్జనం నిర్వహించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్ణయించింది. అనంత చతుర్దశి కాబట్టి శుక్రవారమే నిమజ్జనం చేయాలని ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు స్పష్టం చేశారు. కొంతమంది, పోలీసులు 9వ తేదీ నిమజ్జనం లేదని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇంకా కొంతమంది వాటిని వాట్సాప్ లో విపరీత ప్రచారం చేస్తున్నారని అన్నారు. 

‘‘కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగా ప్రభుత్వం కూడా గత ఏడాది మాదిరిగా నిమజ్జనం నిర్వహిస్తామని చెప్పింది. పాండ్స్ ఏర్పాటు చేశామని చెప్పింది. అవి ఎన్ని చేశారో తెలియడం లేదు. భక్తులను పాండ్స్ దగ్గరకు వెళ్ళనివ్వడం లేదు. గణేష్ విగ్రహాలను చెత్తలో పడేస్తున్నారు. ఎటువంటి అపశృతి లేకుండా ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. నిమజ్జనానికి ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేయాలి.

పాండ్స్ లోనే నిమజ్జనం చేయాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. బాలాపూర్ గణేష్ సమితికి కూడా అదే విధంగా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అటువంటి చర్యలు మానుకోవాలి. బతుకమ్మ, క్రిస్ మస్, రంజాన్, మోహర్రం పండుగల మీద ఉన్న ఆసక్తి గణేష్ ఉత్సవాలపై లేదు. సత్యవతి సిన్హా 2001లో ఇచ్చిన జడ్జిమెంట్ లో కూడా వినాయకులను సాగర్ లో నిమజ్జనం చేయొద్దని చెప్పలేదు. 

నిమజ్జనం జరిగిన 24 గంటల్లోనే విగ్రహాల వ్యర్థాలను తొలగిస్తున్నాం. దాంతో కాలుష్యం జరగడం లేదు. నిమజ్జనంతో ఎలాంటి అపశృతి జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. తమిళనాడు జల్లికట్టు అంశంలో కోర్ట్ లో కేసు ఉన్నా.. ఏవిధంగా చర్యలు తీసుకున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా నిమజ్జనాలకు అదే విధమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గణేష్ ఉత్సవాలకు ముందే చర్యలు తీసుకోవాలి

గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్ లోనే చేయాలని రేపు నెక్లెస్ రోడ్ లో బైక్ ర్యాలీ నిర్వహిస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ హిందూ వ్యతిరేక ధోరణి అవలంబిస్తున్నారు. నిమజ్జనానికి సరైన ఏర్పాట్లు లేకుంటే.. ఎక్కడి విగ్రహాలు అక్కడ పెట్టి నిరసన చేస్తాం’’ అని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు హెచ్చరించారు.

Published at : 05 Sep 2022 01:25 PM (IST) Tags: Vinayaka chavithi hussain sagar Hyderabad ganesh nimajjan ganesh nimajjanam 2022 bhagyanagar ganesh utsav samithi

సంబంధిత కథనాలు

Selfie Suicide : 'రాజు నేనేం పాపం చేశాను', ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి సెల్ఫీ సూసైడ్

Selfie Suicide : 'రాజు నేనేం పాపం చేశాను', ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి సెల్ఫీ సూసైడ్

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

నా ఫోన్‌ను మోదీ ట్యాప్‌ చేశారు- నాకంటే ముందే నా ఫైల్స్‌ చదువుతున్నారు - కేటీఆర్ సంచలన ఆరోపణలు

నా ఫోన్‌ను మోదీ ట్యాప్‌ చేశారు- నాకంటే ముందే నా ఫైల్స్‌ చదువుతున్నారు - కేటీఆర్ సంచలన ఆరోపణలు

BRS Party: ఢిల్లీలో ఆ బిల్డింగ్‌ నుంచే BRS కార్యకలాపాలు? త్వరలోనే అక్కడా తెలంగాణ భవన్!

BRS Party: ఢిల్లీలో ఆ బిల్డింగ్‌ నుంచే BRS కార్యకలాపాలు? త్వరలోనే అక్కడా తెలంగాణ భవన్!

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

టాప్ స్టోరీస్

Munugode TRS Candidate: మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్, విజయం తమదేనని ధీమా

Munugode TRS Candidate: మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్, విజయం తమదేనని ధీమా

Nani's Dasara: నాని 'దసరా' సినిమా బిజినెస్ - అప్పుడే రూ.100 కోట్లు టచ్ చేసింది!

Nani's Dasara: నాని 'దసరా' సినిమా బిజినెస్ - అప్పుడే రూ.100 కోట్లు టచ్ చేసింది!

Sonal Chauhan Photos: 'ది ఘోస్ట్‌' బ్యూటీ సోనాల్ క్యూట్ లుక్

Sonal Chauhan Photos: 'ది ఘోస్ట్‌' బ్యూటీ సోనాల్ క్యూట్ లుక్

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం