News
News
X

Bathukamma Sarees: రేపటినుంచే బతుకమ్మ చీరల పంపిణీ: కేటీఆర్

Bathukamma Sarees: ప్రభుత్వం తరఫున ఏటా ఇచ్చే బతుకమ్మ చీరల పంపిణీని రేపటి నుంచి ప్రారంభించనున్నారు. ఈ సంవత్సరం మొత్తం కోటి చీరలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

FOLLOW US: 

Bathukamma Sarees: తెలంగాణ ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం ఏటా ఇచ్చే బతుకమ్మ చీరల పంపీణీని రేపట్నుంచి  (సెప్టెంబర్ 22) ప్రారంభించనున్నట్లు మంత్రి కె. తారక రామారావు తెలిపారు. రాష్టంలోని నేతన్నలకు చేయూతనివ్వడం, ఆడబిడ్డలకు ప్రేమపూర్వక చిరుకానుక ఇవ్వాలన్న ఉధాత్తమైన లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించినట్టు కేటీఅర్ తెలిపారు. 

 రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల అధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే అన్ని జిల్లాల కలెకర్లతో సమన్వయం చేసుకుంటూ, తమ టెక్స్ టైల్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సంక్షోభంలో చిక్కుకున్న నేతన్నలకు ఒక గొప్ప భరోసా వచ్చిందని.. వారి వేతనాలు రెట్టింపు అయ్యాయనన్నారు. తద్వారా వారు తమ కాళ్లపైన తాము నిలబడే స్థితికి చేరుకున్నారని కేటిఅర్ అన్నారు. 

చీరలతో నేతన్నలకు భరోసా

సమైక్య రాష్ట్రంలో ఉపాధి లేక ఆగమైన నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని మంత్రి తెలిపారు. బతుకమ్మ చీరల పంపిణీతో అటు ఆడబిడ్డలకు ఆనందంతోపాటు ఏడాది పొడవునా నేతన్నలకు ఉపాధి భరోసా దొరికిందని వివరించారు. బతుకమ్మ చీరల వంటి వినూత్నమైన కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేస్తుంటే.. టెక్స్ టైల్స్ ఉత్పత్తులపై జీఎస్టీ లాంటి చర్యలతో కేంద్ర ప్రభుత్వం నేతన్నలను నిలువునా ముంచే నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. కేంద్ర సహకారం లేకపోయినా.. నేతన్నల కోసం తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని స్పష్టంచేశారు. 

ఈసారి కోటి చీరలు 

ఈ సంవత్సరం సూమారు కోటి బతుకమ్మ చీరలను పంపీణి చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ ఏడాది గతంలో కన్నా  మరిన్ని ఎక్కువ డిజైన్లు, రంగులు, వైరైటీల్లో ఈ చీరలను తెలంగాణ టెక్స్ టైల్స్ శాఖ తయారు చేసిందన్నారు. గ్రామాల నుంచి వచ్చిన మహిళా ప్రతినిథుల అభిప్రాయాలు, అసక్తులు, నిఫ్ట్ డిజైనర్లల సహకారంతో , అత్యుత్తమ ప్రమాణాలతో, వెరైటీ డిజైన్లతో చీరలు ఉత్పత్తి చేశారని తెలిపారు.  ఈ సంవత్సరం బతుకమ్మ చీరలను నూతన డిజైనులతో ఉత్పత్తి చేశామన్నారు. 

ఈ సంవత్సరం ఖర్చు 339. 73 కోట్లు

6 మీట్లర్ల(5.50 + 1.00) మీటర్ల పొడవుగల 92 లక్షల సాధారణ చీరలతోపాటు.. ఉత్తర తెలంగాణ జిల్లాలలో వయోవృద్ధ మహిళలు ధరించే 9 మీటర్లు పొడవు గల చీరలు 8 లక్షలు తయారుచేయించామని వివరించారు. మొత్తం కోటి బతుకమ్మ చీరలను రాష్ట్రంలో ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు అందిచనున్నట్లు తెలిపారు. నేతన్నలకు గౌరవ ప్రదమైన ఉపాది కల్పిస్తున్న ఈ బతుకమ్మ చీరల ప్రాజెక్టు కోసం ఈ సంవత్సరం రూ. 339.73 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభం అయిన నాటి నుంచి ఇప్పటిదాకా (ఈసంవత్సరం కలుపుకుని) సూమారు 5 కోట్ల 81 లక్షల చీరలను ఆడబిడ్డలకు అయిదు దఫాలుగా అందించామని కేటీఅర్ తెలిపారు.

Published at : 21 Sep 2022 04:33 PM (IST) Tags: Bathukamma Sarees Minister KTR Bathukamma Sarees Distribution Bathukamma sarees latest news TS govt Bathukamma sarees KTR on Bathukamma sarees

సంబంధిత కథనాలు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో గవర్నర్ దత్తాత్రేయ ప్రత్యేక భేటీ

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో గవర్నర్ దత్తాత్రేయ ప్రత్యేక భేటీ

బీఆర్‌ఎస్‌పై బండి, షర్మిల సెటైర్లు- ఆదిపురుష్‌గా అభివర్ణించిన ఆర్జీవీ

బీఆర్‌ఎస్‌పై బండి, షర్మిల సెటైర్లు- ఆదిపురుష్‌గా అభివర్ణించిన ఆర్జీవీ

కేంద్ర అధికార దుర్వినియోగంపై గట్టిగా పోరాడాలి- కేసీఆర్‌కు కుమార స్వామి శుభాకాంక్షలు

కేంద్ర అధికార దుర్వినియోగంపై గట్టిగా పోరాడాలి- కేసీఆర్‌కు కుమార స్వామి శుభాకాంక్షలు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

దేశానికే కేసీఆర్‌ రోల్ మోడల్- సరైన టైంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు: తిరుమావళవన్

దేశానికే కేసీఆర్‌ రోల్ మోడల్- సరైన టైంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు: తిరుమావళవన్

టాప్ స్టోరీస్

తెలంగాణ ప్రజలను గెలిపించినట్టే దేశ ప్రజలను గెలిపిస్తాం: సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రజలను గెలిపించినట్టే దేశ ప్రజలను గెలిపిస్తాం: సీఎం కేసీఆర్

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

Bigg Boss 6 Telugu Episode 32: సూర్య అంటే ఇష్టం, తన క్రష్ అని చెప్పేసిన ఇనయా, మరి సూర్యకు?

Bigg Boss 6 Telugu Episode 32: సూర్య అంటే ఇష్టం, తన క్రష్ అని చెప్పేసిన ఇనయా, మరి సూర్యకు?