అన్వేషించండి

Bandi Sanjay: కవితకు బెయిల్ ఇప్పించేది కాంగ్రెస్సే, ఇదిగో ప్రూఫ్ - బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెకు బెయిల్ ఇవ్వాలని అభిషేక్ సింఘ్వీయే కోర్టులో వాదిస్తున్నారని, కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని అన్నారు.

Kalvakuntla Kavitha News: కేంద్ర హోంశాఖ సహాయ  మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితకు కాంగ్రెస్ పార్టీయే బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ యే కవితకు బెయిల్ ఇప్పించేందుకు కోర్టులో వాదనలు విన్పిస్తున్నారని చెప్పారు. అందుకు అనుగుణంగానే అభిషేక్ సింఘ్వీకి తెలంగాణ నుండి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధిగా నామినేషన్ వేయించారని తెలిపారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. కేసీఆర్ చెబితేనే కాంగ్రెస్ పార్టీలో ఎంపీ సీట్లు, ప్రభత్వంలో మంత్రి పదవులిస్తున్నారని తెలిపారు. ఈ విషయం తెలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ఫాంహౌజ్ కు క్యూ కడుతున్నారని వ్యాఖ్యనించారు. 

మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ సమీపంలోని రావిరాల గ్రామంలో నిర్వహించిన సూర్యగిరి ఎల్లమ్మ బోనాల ఉత్సవాల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

బండారం బయటికి

‘‘పదేపదే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసుకోబోతున్నారంటూ దుష్ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలు బండారం బయటపడింది. కాంగ్రెస్ నేతలే కేసీఆర్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీయే లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇఫ్పించేందుకు ప్రయత్నిస్తోంది.  కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ కవిత బెయిల్ కోసం కోర్టులో వాదిస్తున్నాడు. ఇదిగో ఆధారం.. అభిషేక్ సింఘ్వీ పెద్ద వకీలు. అనుభవజ్జుడు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. ఆయన తెలంగాణ నుండి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధి అవుతున్నాడంటే తెలంగాణ ప్రయోజనాల కోసం కోర్టులో, పార్లమెంట్ లో గట్టిగ వాదిస్తడని అనుకున్నా. కానీ తీరా చూస్తే... లిక్కర్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కల్వకుంట్ల కవిత కు బెయిల్ ఇవ్వాలని  వాదిస్తున్నడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు సమాధానం చెప్పాలే...

కాంగ్రెస్ లోనే బీఆర్ఎస్ విలీనం

ఇన్నాళ్ళు కేసీఆర్ కుటుంబ అవినీతిని బట్టబయలు చేస్తాం... జైలుకు పంపిస్తామని బీరాలు పలికిన కాంగ్రెస్ నేతలు ఆ కుటుంబాన్ని ఎందుకు జైలుకు పంపలేదు? ఎందుకంటే కాంగ్రెస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి కాబట్టి. అందుకే  కాళేశ్వరం, డ్రగ్స్, మియాపూర్ భూములు, ఫోన్ ట్యాపింగ్ కేసులన్నీ అటకెక్కించారు.  రెండు పార్టీలు ఒక్కటే. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు కల్ల. బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పార్టీ. ఆ పార్టీతో పొత్తు ఉండదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అవినీతి, కుటుంబ పార్టీలే. కాబట్టి కాంగ్రెస్ లోనే బీఆర్ఎస్ విలీనం తథ్యం. 

అవినీతి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే పార్టీ బీజేపీ మాత్రమే. అయితే బీజేపీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నయి. మేం 6 గ్యారంటీలు, రుణమాఫీపై నిలదీస్తుంటే... కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజీవ్ గాంధీ విగ్రహం పేరుతో లొల్లి చేస్తూ చర్చను పక్కదారి పట్టిస్తున్నయి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. తగిన గుణ పాఠం చెబుతారు.

బీజేపీయే కవితకు బెయిల్ ఇప్పిస్తోందని చెప్పడం దుర్మార్గం. బెయిల్ కు, బీజేపీకి ఏం సంబంధం? కాంగ్రెస్ మాదిరిగా కోర్టులో కవిత బెయిల్ కోసం వాదిస్తున్నమా? బెయిల్ ఇచ్చేది కోర్టులు. సుప్రీంకోర్టును ధిక్కరించేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. ఇది ఏ మాత్రం సరికాదని హెచ్చరిస్తున్నా.. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై కేంద్రం ఇప్పటికే స్పందించింది. నేను కోరేదోక్కటే హిందూ సమాజం జాగ్రుతం కావాలి. జరుగుతున్న పరిణామాలపై అప్రమత్తంగా ఉండాలి. హిందూ సమాజమంతా సంఘటితం కావాలి’’ అని బండి సంజయ్ మాట్లాడారు.

టాప్ హెడ్ లైన్స్

అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget