NTR Death Anniversary: ఎన్టీఆర్ కు కుటుంబసభ్యులు నివాళులు- ఆయనకు మరణం లేదన్న బాలకృష్ణ
NTR Death Anniversary: దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్దంతి సందర్బంగా...కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు.
Pays Tribute To Ntr : దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party ) వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) వర్దంతి (Death Anniversary) సందర్బంగా...కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. హైదరాబాద్ (Hyderabad)లోని ఎన్టీఆర్ ఘాట్ (Ntr Ghat) వద్ద హిందూపురం ఎమ్మెల్యే నందమూరి కృష్ణ, రామకృష్ణ, హరికృష్ణ కూతురు సుహాసిని, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, తారకరత్న సతీమణి అలేఖ్య... అంజలి ఘటించారు. ఉదయాన్నే ఘాట్ కు చేరుకుని నివాళులు అర్పించారు.
సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హుస్సేన్ సాగర్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ ను సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సందర్శించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్న వీరిద్దరూ సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్ధంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించారు. ఈ క్రమంలో అభిమానులు భారీగా తరలివచ్చారు. జై ఎన్టీఆర్, సీఎం అంటూ నినాదాలు చేశారు.
ఎన్టీఆర్ కు మరణం లేదన్న బాలకృష్ణ
ఎన్టీఆర్ అంటే నవరసాలకు కేరాఫ్ అడ్రస్ అన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఎన్టీఆర్.. పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. ఎన్టీఆర్ కు మరణం లేదన్న ఆయన.. పేదల సంక్షేమానికి అనేక పథకతాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ వల్లే రాజకీయ చైతన్యం వచ్చిందన్న బాలకృష్ణ...ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోయాయని గుర్తు చేశారు. పేదల ఆకలి తీర్చిన ఎన్టీఆర్ సంక్షేమ పథకాలనే... అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు.
ఆత్మ గౌరవంతో తలెత్తుకునేలా చేశారన్న పురంధేశ్వరి
ఎన్టీఆర్...తెలుగు ప్రజలు ఆత్మ గౌరవంతో తలెత్తుకునేలా చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని పటమట సర్కిల్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కళామతల్లి ఆశీర్వాదం పొందిన అన్నగారు...సంక్షేమానికి మారుపేరుగా నిలిచారని కొనియాడారు. ఆకలితో అలమటిస్తున్న పేదలకు 2రూపాయలకే కిలో బియ్యం అందించారని తెలిపారు. తెలుగు ప్రజలు ఎన్టీఆర్ ను గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు.