Arekepudi Gandhi With ABP Desam : కౌశిక్‌రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశా- వివాదం ఇప్పుడే మొదలైంది- ఏబీపీ దేశంతో అరికెపూడి గాంధీ సంచలన కామెంట్స్
Arekapudi Gandhi Vs Kaushik Reddy:హైదరాబాద్‌లో 2 రోజులు సాగిన ఎమ్మెల్యేల వివాదానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇది అంతం కాదు ఆరంభం అంటున్నారు గాంధీ. ఏబీపీ దేశంతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Hyderabad News: హైదరాబాద్ కేంద్రంగా బిఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య దాడులు ,ప్రతిదాడులు, విమర్శలు , ప్రతి విమర్శలకు తాత్కాలికంగా బ్రేక్ వేయగలిగారు పోలీసులు. మొదటి రోజు కౌశిక్ రెడ్డి ఇంటిపై అరికెపూడి గాంధీ దాడి అనుచరులతో దాడి చేయించారంటూ బిఆర్ ఎస్ నేతలు నిరసనలు చేసిన విషయం తెలిసిందే. రెండో రోజు పరిస్దితి అదుపుతప్పకుండా ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేస్తూ ఇంటికే పరిమితం చేశారు పోలీసులు. వీరిద్దరి మధ్య గొడవకు కారణాలేంటి. ఎందుకు అరికెపూడి సహనం కోల్పోయారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేశారనే ఆరోపణలపై ఏబిపి దేశంతో ప్రత్యేకంగా మాట్లాడారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.
ఏబీపీ దేశం: మీరు సీనియర్ నేత ఎందుకు సహనం కోల్పోయారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది..?
అరికెపూడి గాంధీ: నేను ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయలేదు. పదకొండు గంటలకు నీ ఇంటికి వస్తా, జెండా ఎగురవేస్తా అంటూ కౌశిక్ రెడ్డి ఏదైర్యంతో మాట్లడారు. ఏ హోదాలో మాట్లడారు. సరే నువ్వు రాకపోతే, నేను వస్తా, హరతి ఇచ్చి ఆహ్వానిస్తానన్నావుగా.. ఇంటికి వచ్చాక ఏం చేశావు. రాళ్లు విసిరావు. పూల కుండీలు వేశావు మహిళలను అవమానించావు. వారిపై కేసులు పెట్టావు. ప్రాంతీయ విద్వేశాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశావు. నీ రౌడీయిజానికి నువ్వు మనిషివి కాదు అనడానికి నీ మాటలే సాక్ష్యం.
ఏబీపీ దేశం: మీ ఇద్దరి మధ్య వివాదం, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మారాయి. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల వెనుక ఎవరున్నారని మీ అనుమానం.?
అరికెపూడి గాంధీ: కౌశిక్ రెడ్డితో నాకు ఆస్తి తగాదాలు లేవు. పంపకాల గొడవులు లేవు. మరి ఏ హోదాలో కౌశిక్ రెడ్డి నా గురించి మాట్లడారు. కించపరిచేలా అవమానించారు. ఎన్నిసార్లు మాట్లడినా సహనంతో ఉంటే అలుసుగా మారింది. ఈసారి బుద్ది చెప్పాలనే ఉద్దేశ్యంతోనే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లాం. సమాజంలో ఇలా ఇష్టమొచ్చినట్లుగా మాట్లడకుండా కనువిప్పు కలిగించాలనే ఉద్దేశ్యంతోనే కౌశిక్ రెడ్డి ఇంటికి నేను వెళ్లాను. అమెరికాలో ఉన్న కేటీఆర్ ఫోన్ చేసి మరీ కౌశిక్ రెడ్డికి బుద్ది చెప్పారు. అసెంబ్లీలో ఓసారి బుద్ది చెప్పారు. సైబరాబాద్ సిపి కార్యాలయం వద్ద హరీష్ రావు సైతం కౌశిక్ రెడ్డికి బుద్ది చెప్పారు.
ఏబీపీ దేశం: నేను నిజమైన తెలంగాణా బిడ్డను, నిన్ను తరిమికొడతాం అని కౌశిక్ రెడ్డి కామెంట్ చేశారు. గతంలో మీరు పార్టీలో ఉన్నప్పడు బిఆర్‌ఎస్‌లో ఈ విధంగా ప్రాంతీయ అసమానతలు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా?
అరికెపూడి గాంధీ: తెలంగాణా బిడ్డ, ఆంద్రా బిడ్డ అనే ఇలా బేధాభిప్రాయాలు గతంలో చూడలేదు. కౌశిక్ రెడ్డి ముత్తాత ఎక్కడి నుంచి వచ్చాడో తనకు తెలుసా...మీ తాత ఎక్కడి నుంచి వచ్చాడు. నిజాం పాలన లేదా మద్రాసు పాలనలో ఉన్నాడా..అప్పుడు నువ్వు ఎవరి బిడ్డవు అవుతావు. హైదరాబాద్‌లో ఆంధ్ర, తెలంగాణ బిడ్డ అనే బేధాభిప్రాయాలు ఎప్పుడూ చూడలేదు.
ఏబీపీ దేశం: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో మీ వివాదం ముగిసినట్లేనా.. లేక మీరే ముగించేశారా..?
అరికెపూడి గాంధీ: మా ఇద్దరి మధ్య వివాదం ముగియలేదు. ఇప్పడే మొదలైంది. ధైర్యంగా ఎదుర్కొంటాం.
ఏబీపీ దేశం: స్పీకర్ అపాయింట్మెట్ తీసుకుని కలిశారు. ఏం చెప్పారు.. కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేసారా..?
అరికెపూడి గాంధీ: నువ్వు ఆంధ్రావాడివి, తిరిగి అక్కడికే తరిమికొడతాం అంటూ ఎమ్మెల్యేగా ఉన్న నన్ను అవమానించడంతోపాటు ప్రాంతీయ విద్వేశాలు రెచ్చగొట్టేలా కౌశిక్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్ని స్పీకర్‌కు ఫిర్యాదు చేశా. వాళ్ల అనుచరులు తమపై చేసిన దాడులకు సంబంధించిన వీడియోలు మా వద్ద ఉన్నాయి.వాటిని స్పీకర్‌కు సమర్పించా.