BRS MLC Kavitha: పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులను చంద్రబాబు వ్యతిరేకించి కేసులు వేశారు: కవిత
వృథాగా సముద్రంలోకి పోతున్న గోదావరి జలాలు రెండు తెలుగు రాష్ట్రాలు పంచుకోవాలని, అందుకు తుపాకులగూడెం వద్ద బ్యారేజీ లింకేజ్ పాయింట్ ఉండాలని కేసీఆర్ షరతు పెట్టారని కవిత తెలిపారు.

హైదరాబాద్: ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఆంధ్ర సీఎం చంద్రబాబు గురించి గొప్ప మాటలు చెప్పడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులతో చంద్రబాబుకి ఎటువంటి ఇబ్బంది లేదు, బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం లేదని పదేపదే నొక్కి చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ అందులో వాస్తవం లేదన్నారు. రెండు విషయాలు తెలంగాణ ప్రజలకు కచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టులు అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారు. సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
గోదావరి నది నీళ్లు ఆంధ్ర గవర్నమెంటు తీసుకెళ్లడానికి కేసీఆర్ గతంలో ఓకే చెప్పారని ఏపీ మంత్రులు చెబుతున్న దాంట్లో పూర్తి వాస్తవం లేదు. ఆనాడు కేసీఆర్ చెప్పింది ఒకటే మాట. వేస్ట్ గా సముద్రంలో పోతున్నటువంటి నీళ్లు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వాడుకోవాలి. వాటిని మన పొలాలలో మళ్ళించుకోవాలని కేసీఆర్ చెప్పారు. కానీ కేసీఆర్ చెప్పేటప్పుడు మనం పెట్టిన కండిషన్ ఏంటిది. కచ్చితంగా నదుల లింకేజ్ అనేది జరిగినప్పుడు గోదావరి నది నుండి నీళ్లు ఇతర నదులకు లింక్ చేసినప్పుడు కచ్చితంగా తుపాకులగూడెం బ్యారేజ్ వద్దనే లింకేజ్ పాయింట్ ఉండాలి. అది కాకుండా వేరే ఏ పాయింట్ ప్రపోజ్ చేసినా మేము ఒప్పుకోము కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా లింకేజ్ పాయింట్ పోలవరం అని చెప్పారు. ఆ ప్రతిపాదనను కేసీఆర్ తిరస్కరించారు. ఏనాడు కూడా ప్రతిపాదన ఒప్పుకోలేదు.
ఎందుకంటే గోదావరి నీళ్లు ఆ తర్వాత కావేరికి కలిపెటటువంటి పెన్నాకి అక్కడ నుంచి కావేరికి కలిపేటటువంటి ప్రతిపాదన ఉందో అది ఒకవేళ కేసీఆర్ చెప్పినట్టు తుపాకుల గూడెం దగ్గర జరిగితే వరంగల్, సూర్యాపేటకి, నల్గొండకి, ఖమ్మంలో కొంత భాగం, మహబూబ్నగర్ జిల్లాకి నీళ్లు వచ్చేవి. రంగారెడ్డి జిల్లాకి, మూసి ప్రక్షాళన కోసం చూసేటటువంటి ప్రాజెక్ట్ కి అన్నిటికీ కూడా గోదావరి నీళ్లు పుష్కలంగా లభించే ఆస్కారం ఉంటది. అక్కడ కాదని పోలవరం పెట్టుకున్నట్లైతే ఇప్పుడు చెప్పిన ప్రాంతాలన్నిటికీ కూడా తరతరాలకు తీరని అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గోదావరి నీళ్లను కృష్ణకి, పెన్నాకి, కావేరికి అనుసంధానం చేసేటటువంటి ప్రాజెక్టు లింక్ పాయింటు తుపాకులగూడెంలో ఉండాలని చెప్పి తెలంగాణ ప్రజలందరి తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం’ అన్నారు.






















