భార్యను మోడల్‌గా చూడాలనుకున్న భర్త- విక్రమార్కుడు సీన్ తలపించేలా చేసిన బ్యూటీపార్లర్ నిర్వాహకులు
హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో జరిగిన ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. అందం కోసం మహిళ చేసిన ప్రయత్నం ఫెయిల్ అయింది.
విక్రమార్కుడులో గుండు సీన్ గుర్తుందా... అలాంటిదే హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో జరిగింది. భర్త కోరిక మేరకు మోడల్‌గా మారాలనుకున్న భార్యకు బ్యూటీపార్లర్ షాక్ ఇచ్చింది ఒత్తుగా పెరిగిన ఉన్న చుట్టు ఒక్కసారి ఊడిపోయేలా చేసింది.
హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో జరిగిన ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. అందం కోసం మహిళ చేసిన ప్రయత్నం ఫెయిల్ అయింది. తనని మోడల్‌గా చూడాలనుకున్న భర్త కోరికను తీర్చడానికి ప్రయత్నం చేశారా మహిళ. చివరకు ఆ ప్రయత్నం బెడిసి కొట్టిన ఉన్న చుట్టు ఊడిపోయే పరిస్థితి ఏర్పడింది.
అబిడ్స్‌లో ఉన్న ఓ ఫేమస్ బ్యూటీపార్లర్‌కు వెళ్లారో ఓల్డ్ సిటీ మహిళ. తనకు పొడుగ్గా ఉన్న జుట్టును కట్ చేసి అయిల్ పెట్టి కాస్త ట్రెండీగా మార్చమని అక్కడే ఉన్న బ్యూటీషియన్‌కు చెప్పారు.
బ్యూటీషియన్ పెట్టిన హెయిర్ ఆయిల్‌తో జుట్టు అందంగా తయారవ్వడం పక్కన పెడితే జుట్టు మొత్తం ఊడిపోయింది. ఊడిపోతున్న జుట్టును చూసి ఆ మహిళ ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇంటికి పరుగులు తీశారు.
ఒత్తైన పొడవైన జుట్టుతో బ్యూటీపార్లర్‌కు వెళ్లిన భార్య ఇలా ఊడిపోతున్న జుట్టుతో వచ్చే సరికి భర్త కూడా షాక్ తిన్నాడు. ఏం జరిగిందో అని ఆరా తీశాడు. అసలు విషయం తెలుసుకొని బ్యూటీపార్లర్ వద్దకు వెళ్లి వారిని నిలదీశారు. భార్యభర్తల మధ్య గొడవ కూడా జరిగింది.
భర్త తిట్టడంతో భార్య తీవ్ర మనస్తాపానికి గురైంది. ఏం చేయాలో తెలియక ఊడిపోతున్న జుట్టును పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. బ్యూటీపార్లర్ నిర్లక్ష్యం వల్లే తన జుట్టు ఊడిపోతుందని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బ్యూటీపార్లర్ నిర్వాహకులు వాడుతున్న ప్రోడెక్ట్స్ గతంలో ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోయాయి. ఫేక్ ప్రోడెక్ట్స్ వాడటంతోపాటు అనుభవం లేని అవగాహన లేని వారితో పని చేయించడం కూడా అసలుకే ఎసరు తీసుకొస్తోంది.