Hyderabad Traffic Police : మీది మొత్తం వెయ్యి అయింది యూజర్ చార్జెస్ ఎక్స్ ట్రా - ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుందా ?
Hyderabad Traffic Police :కుమారి ఆంటీ డైలాగ్ తో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేసిన ఓ ట్వీట్ వైరల్ అయింది. హెల్మెట్ పెట్టుకోకపోవడమే కాదు ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్న వ్యక్తిపై ఈ ట్వీట్ పెట్టారు.
Hyderabad Traffic Police challan : ‘మీది మొత్తం 1000 అయింది. రెండు లివర్లు ఎక్స్‌ట్రా’ అనే డైలాగ్ తో ఐటీ కారిడార్ లో ఫుడ్ స్టాల్ కమారి ఆంటీ పాపులర్ అయింది. సోషల్ మీడియా సెన్సెషన్ గా నిలిచింది. ఇప్పుడీ డైలాగ్ ను సమయస్ఫూర్తిగా వాడుకున్నారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్ సిటీ పోలీస్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Midhi motham 1000 ayindhi, user charges extra...#FollowTrafficRules #BeSafe#CellPhoneDriving pic.twitter.com/9kpxRKP8Ov
— Hyderabad City Police (@hydcitypolice) February 20, 2024
ఓ ఫ్లైఓవర్ పై ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదు. అంతే కాదు ఫోన్ కూడా మాట్లాడడుతున్నాయి. ఈ వ్యక్తి ఫోటోను ట్వీట్ చేసిన సిటీ పోలీసులు మీది మొత్తం వెయ్యి అయింది.. యూజర్ చార్జెస్ ఎక్స్ ట్రా అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఆ బండి నెంబర్ ను మాత్రం.. కనిపించకుండా చేశారు. వ్యక్తిగతంగా ఆయన బండి నెంబర్ పేరున చలానా క్రియేట్ అయింది. ఆ వ్యక్తికి చేరింది. కానీ దీన్ని క్రియేటివ్ గా పోస్ట్.. చేసి వైరల్ అయ్యేలా చేశారు పోలీసులు.
అయితే ఈ ట్వీట్ చేసిన ట్విట్టర్ హ్యాండిల్ ట్రాఫిక్ పోలీసులది కాదు.. హైదరాబాద్ సిటీ పోలీసులది. వెంటనే చాలా మంది.. ట్రాఫిక్ ఉల్లంఘిస్తన్న వాహనాల ఫోటోలు తీసి ఈ ట్వీట్ కు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. ఆ ట్వీట్లకు హైదరాబాద్ సిటీ పోలీసులు.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు రిఫర్ చేశారు. రాంగ్ రూట్ లో వస్తున్నఓ ట్యాంకర్ ఫోటోను నెటిజన్ ట్వీట్ చేశారు.
11.20 am today. Water tanker coming in wrong route under road no. 5 , metro station Jubilee Hills
— Sriram Somayajula (శ్రీరామ్ సొమయాజుల) (@sriramsomayajul) February 20, 2024
Pls issue a challan for this water tanker also sir pic.twitter.com/Bxr6WvBkmP
కొంత మంది నిరంతరాయంగా ఉంటున్న సమస్యసలనూ ప్రస్తవించారు.
Sir Begumpet lo flyover kindha road pakkane chala cars road pakkane park chesthunar, andhuvalla chala traffic jam avthundhi evening time lo, plz take serious action veelaithe fine gattiga veyandi ala ayina maaruthar emo😑 exact ga reliance bakery dhagara, prakashnagat metro
— VarunReddySama (@Varunreddi141) February 20, 2024
ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేసి ఉంటే.. అలాంటి ఉల్లంఘనలు చాలా ఉన్నాయని ట్వీట్ చేసి ఉండేవారు నగరవాసులు. ఇలా ఎవరు ఫోటోలు పంపినా ట్రాఫిక్ ఉల్లంఘించిన వారికి ఫైన్లు వేసి.. చలాన్లు ఇంటికి పంపుతారు పోలీసులు.