అన్వేషించండి

గ్రూప్‌4 పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్నలు- తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై ఎక్కువ ప్రశ్నలు

పరీక్షకు 15 నిమిషాల ముందే గేటు మూసివేశారు. దీంతో చాలా మంది అభ్యర్థు ఆఖరి నిమిషంలో వచ్చి లోపలికి అనుమంతించకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. మరికొందరు సెంటర్‌ వద్ద బోరున విలపించారు.

తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న గ్రూప్‌ 4 పరీక్ష మొదటి సెషన్ ముగిసింది. 2.30కు రెండో సెషన్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది. 8,180 గ్రూప్‌-4 ఉద్యోగాలతో పడిన నోటిఫికేషన్‌కు 9,51,205 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 9,01,051 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. 

పరీక్షకు 15 నిమిషాల ముందే గేటు మూసివేశారు. దీంతో చాలా మంది అభ్యర్థు ఆఖరి నిమిషంలో వచ్చి లోపలికి అనుమంతించకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. మరికొందరు సెంటర్‌ వద్ద బోరున విలపించారు. ఓ అభ్యర్థి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ సెంటర్‌కు గూగుల్ మ్యాప్‌ ద్వారా వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే ఆ స్కూల్ ఉండే పాత అడ్రెస్‌ చూపించింది. అక్కడకు వెళ్లి విషయం తెలుసుకొని కొత్త స్కూల్ అడ్రెస్‌కు వెళ్లేసరికి టైం అయిపోయిందని అధికారులు చెప్పి అనుమతి ఇవ్వలేదు. 
 
అన్ని పరీక్ష కేంద్రాల్లో పేపర్‌-1కు ఉదయం 9.45 గంటలకే గేట్లు మూసేశారు.

పేపర్‌-2కు , మధ్యాహ్నం 2.15 గంటలకే గేట్లకు తాళాలు వేసేశారు. హైదరాబాద్‌లో ఓ పరీక్ష కేంద్రంలో సెల్‌ఫోన్‌తో ఓ అభ్యర్థి దొరికిపోయాడు.  రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ మండలం మారుతినగర్‌లోని సక్సెస్ జూనియర్ కళాశాలలో ఈ ఘటన జరిగింది. పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత అభ్యర్థి వద్ద సెల్‌ఫోన్ ఉన్నట్టు ఇన్విజిలేటర్ గుర్తించారు. అతని వద్ద ఉన్న సెల్ ఫోన్ తీసుకున్న అధికారులు కేసు నమోదు చేశారు. 

పేపర్‌ 1 జనరల్‌ స్టడీస్‌ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగింది. పేపర్‌ 2 (సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌) మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగుతుంది. గ్రూప్‌-4 పరీక్షపై 33 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లతో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బీ జనార్దన్‌ రెడ్డి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పరీక్ష ఏర్పాట్లు, నిబంధనలు, పరీక్ష కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిబ్బంది విధులు తదితర అంశాలపై చర్చించారు. 2,878 లైజన్‌ ఆఫీసర్లతో కలెక్టర్లు ప్రత్యేకంగా మాట్లాడాలని సూచించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు బూట్లు ధరించి వస్తే అనుమతించలేదు. వాచ్‌, హ్యాండ్‌ బ్యాగ్‌, పర్సులను పరీక్ష హాలులోకి తీసుకెళ్లనీయలేదు. పరీక్ష కేంద్రాల్లోని పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉంచారు. 

మొదటి సెషన్‌లో జరిగిన పరీక్షలో చాలా ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. బలగం సినిమాపై ఓ ప్రశ్న వచ్చినట్టు సమాచారం. జతపరచమని నాలుగు ఆప్షన్లు ఇచ్చారు.

ప్రశ్న ఇదే:- బలగం చిత్రానికి సంబంధించి సరైన జవాబుతో జతపరచండి. అని ప్రశ్న ఇచ్చి... A. దర్శకుడు: వేణు యెల్హండి B. నిర్మాత: దిల్‌ రాజు/ హన్షితా రెడ్డి/ హర్షిత్ రెడ్డి  C.సంగీత దర్శకుడు: భీమ్స్‌ సిసిరోలియో D. కొమరయ్య పాత్రను పోషించినవారు: అరుసం మధుసూధన్ అని ఇచ్చి కంద ఆప్షన్లు ఇచ్చారు. దీనికి సరైన జవాబు ఏ అండ్‌ బీ

  గతంలో జరిగిన కానిస్టేబుల్ పరీక్షలో కూడా బలగంపై ప్రశ్నలు అడిగారు.

 

అదే టైంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టే పథకాలు, ఆర్థిక స్థితిగతులపై ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. భారత్‌ ఆర్థిక పరిస్థితిని ఉటంకిస్తూ  కూడా ప్రశ్నలు అడిగారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget