అన్వేషించండి

గోకుల్ చాట్ పేలుళ్ళకు 17 ఏళ్లు, తీవ్రవాదులకు ఏ శిక్షలు పడ్డాయి?

గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ చేసిన నిందితులకు ఎలాంటి శిక్ష లు పడ్డాయిహైదరాబాద్ పేలుళ్లకు 17 ఏళ్లు హైదారాబాద్ చరిత్ర లో బ్లాక్ స్పాట్లుంబినీ పార్క్ ,గోకుల్ చాట్ ల వద్ద బాంబులు పేల్చిన తీవ్రవాదులు42 మంది ఘోర మరణం

Hyderabad Bomb Blasts Incidents: హైదరాబాద్ నగరం మొత్తం ఉలిక్కిపడిన రోజు 25 ఆగష్టు 2007. సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఈరోజే లుంబినీ పార్క్, గోకుల్ చాట్ బాంబు పేలుళ్ళు జరిగాయి. సాయంత్రం పూట సరదాగా సమయం గడపడానికి బయటకు వచ్చిన అమాయకులు బాంబ్ బ్లాస్ట్ లలో ప్రాణాలు కోల్పోయారు.

వందే మాతరం వింటుండగా పేలిన బాంబు 
లుంబినీ పార్కు లో ఎప్పటిలానే లేజర్ షో ప్రారంభమైంది. సాయంత్రం ఏడున్నర సమయంలో ముందుగా వందేమాతరం గీతం వింటున్నారు అక్కడకు చేరుకున్న సందర్శకులు. దాదాపు 500 మంది వరకూ ఆ పార్కుల్లో గుమికూడారు. ఆ సమయంలో  సీట్ల మద్యలో పేలిన బాంబు 9 మంది ప్రాణాలు బలిగొంది. వారిలో ఇద్దరు స్పాట్ డెడ్ కాగా తరువాత హాస్పిటల్ లో ఏడుగురు చనిపోయారు. 40 మందికి పైగా గాయాల పాలయ్యారు. చనిపోయిన వారిలో మహారాష్ట్ర నుండి స్టడీ టూరు కోసం వచ్చిన స్టూడెంట్స్ ఏడుగురు ఉండడం అందరినీ కలచి వేసింది. 

33 మందిని చంపేసిన గోకుల్ చాట్ పేలుడు

మరో పదినిమిషాల గ్యాప్ లో కోఠి ప్రాంతంలోని పాపులర్ గోకుల్ చాట్ వద్ద మరో బాంబు పేలింది. ఎక్కువగా నార్త్ ఇండియన్ స్నాక్స్ దొరికే గోకుల్ చాట్ కు సిటీలో మంచి పేరుంది. ఎక్కువగా నార్త్ ఇండియన్స్ అక్కడకు చేరుకుంటూ అంటారు. అందుకే దానిని టార్గెట్ చేసుకున్న తీవ్రవాదులు అక్కడ బాంబ్ పేల్చారు. ఈ ఘటన లో మొత్తం 33 మంది 10మంది స్పాట్ లో మరో 23 మంది హాస్పిటల్ లో చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు.

పేల్చింది ఆ టెర్రరిస్టులే
ఈ బాంబు పేలుళ్లకు నిషేధిత తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ కు చెందిన తీవ్రవాదులే అని తేల్చారు. టైమర్ ఉపయోగించి ఈ పేలుళ్ళను జరిపారని విచారణలో తేలింది. బాంబుల్లో జిలేటిను, అమ్మోనియం నైట్రేట్ లను వాడినట్టు తేల్చారు. పోలీసులు ఈ కేసులో మొత్తం 8 మంది పై కేసులు పెట్టారు. వారిలో  మొహమ్మద్ అక్బర్ ఇస్మాయేల్ చౌదరి, షఫీక్ సయ్యద్ లకు మరణ శిక్ష విధించిన కోర్టు సరైన సాక్ష్యాలు లేవని మరో ఇద్దరిని విడుదల చేసింది. తరువాత పట్టుబడిన మరో నలుగురికి సుదీర్ఘ విచారణ తరువాత గత ఏడాది ఒక్కొక్కరికీ పదేళ్ళ పాటు కఠిన కారాగార శిక్షను విధించింది NIA కోర్టు. ఒబేదుర్ రెహ్మాన్, ధనీష్ అన్సారీ, ఇమ్రాన్ ఖాన్, ఆఫ్తాబ్ ఆలం అనే ఈ నలుగురుకీ దిల్ సుఖ్ నగర్ బాంబు బ్లాస్టులతో కూడా సంబంధం ఉన్నట్టు తేల్చారు.

నేటికీ ఈ బాంబు బ్లాస్ట్ ల ఘటన గుర్తుకు వస్తే ఉలిక్కిపడే హైదారాబాద్
హైదరాబాద్ లో ఆ తరువాత కూడా కొన్ని ఉగ్రవాద ఘటన లు జరిగినా గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ గుర్తుకు వస్తే ఇప్పటికే హైదరాబాద్ వాసులు ఉలిక్కి పడుతుంటారు. లుంబినీ పార్కు, గోకుల్ చాట్ రెండు పేలుళ్ళు కలిపి మొత్తం 42 మందిని బలి తీసుకున్నాయి. ఎంతో మంది తమ అవయవాలు కోల్పోయారు. నేటికీ జీవనోపాధి కోల్పోయి దయనీయ స్థితి లో బ్రతుకీడుస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. అందుకే ఇలాంటి విషాదాలకు దారుణాలకు కారణం అవుతున్న ఈ సీమాంతర తీవ్రవాదాన్ని పూర్తిగా అంతమొందించే దిశగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Budget 2024-25: ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
Bandi Sanjay: లారీ కింద ప్రమాదవశాత్తు ఇరుక్కున్న యువతి - మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
లారీ కింద ప్రమాదవశాత్తు ఇరుక్కున్న యువతి - మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
Andhra Pradesh Budget 2024-25: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
Mahindra Scorpio Sales: మహీంద్రా స్కార్పియో కోసం క్రేజీ అయిపోతున్న జనాలు - షాకిస్తున్న సేల్స్ లెక్కలు!
మహీంద్రా స్కార్పియో కోసం క్రేజీ అయిపోతున్న జనాలు - షాకిస్తున్న సేల్స్ లెక్కలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆసీస్ తో టెస్టుకు రోహిత్ దూరం! కెప్టెన్ గా బుమ్రా?ట్రోలర్స్‌కి ఇచ్చి పడేసిన రౌడీ, ఒక్క వీడియోతో గప్‌చుప్బెల్టు తీస్తానన్నారు? రోజా సంచలన ట్వీట్గేమ్ చేంజర్ టీజర్ టాక్ ఎలా ఉందంటే?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Budget 2024-25: ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
Bandi Sanjay: లారీ కింద ప్రమాదవశాత్తు ఇరుక్కున్న యువతి - మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
లారీ కింద ప్రమాదవశాత్తు ఇరుక్కున్న యువతి - మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
Andhra Pradesh Budget 2024-25: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
Mahindra Scorpio Sales: మహీంద్రా స్కార్పియో కోసం క్రేజీ అయిపోతున్న జనాలు - షాకిస్తున్న సేల్స్ లెక్కలు!
మహీంద్రా స్కార్పియో కోసం క్రేజీ అయిపోతున్న జనాలు - షాకిస్తున్న సేల్స్ లెక్కలు!
Anna Canteen: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం - పల్లెల్లో కూడా అన్న క్యాంటీన్లు 
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం - పల్లెల్లో కూడా అన్న క్యాంటీన్లు 
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్ నోట్ రాసి మరీ..
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్ నోట్ రాసి మరీ..
SEO Poisoning: గూగుల్ సెర్చ్‌లో కూడా స్కామ్ - మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సైబర్ కేటుగాళ్లు!
గూగుల్ సెర్చ్‌లో కూడా స్కామ్ - మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సైబర్ కేటుగాళ్లు!
Minister Atchennaidu: 'రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక వంటిది' - రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
'రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక వంటిది' - రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
Embed widget