YS Sharmila : అరుదైన ఫొటోతో కొడుకుకు బర్త్ డే విషెస్ చెప్పిన వైఎస్ షర్మిల
YS Sharmila : సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే వైఎస్ షర్మిల ఓ అరుదైన ఫొటో షేర్ చేశారు. ఆ ఫొటో వైరల్ అవుతోంది.
YS Sharmila : ఎప్పుడూ సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంటారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. అయితే తాజాగా ఆమె ట్విట్టర్ లో ఓ ఫొటో షేర్ చేశారు. ఆ ఫొటో వైరల్ అవుతోంది. తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన వైయస్ షర్మిల అధికార పార్టీ బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. 3500 కిలో మీటర్లకు పైగా తెలంగాణలో పాదయాత్ర చేసిన ఆమె ఇటీవల పలు ఘటనలతో మెయిన్ స్ట్రీమ్ పొలిటీషియన్ గా మారారు. షర్మిల పదునైన విమర్శలతో బీఆర్ఎస్ నేతలను ఇరకాటంలో పెడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు కొందరు ఆమె పాదయాత్రను అడ్డుకున్నారు. ప్రచార రథానికి నిప్పుపెట్టారు. అనంతరం పోలీసులు శాంతి భద్రతలు కారణంగా ఆమెను హైదరాబాద్ తరలించారు. ఇందుకు నిరసనగా ఆమె కారులో ప్రగతి భవన్ ను ముట్టడించడానికి బయలుదేరగా... పోలీసులు కారుతో సహా ఆమెను స్టేషన్ కు తరలించారు. ఆమె అరెస్టు చేసి రిమాండ్ కూడా కోరారు. కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన ఆమె పాదయాత్ర అనుమతికోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఇలా నిత్యం వార్తల్లో ఆమె తాజాగా ఓ ఫొటో షేర్ చేశారు.
Happy Birthday Raja,
— YS Sharmila (@realyssharmila) December 18, 2022
Happiness always!
I love you forever!! pic.twitter.com/idI0TGM9cN
హ్యాపీ బర్త్ డే రాజా
ఒకపక్క రాజకీయాలు చేస్తూనే మరోపక్క కుటుంబాన్ని చూసుకుంటున్న షర్మిల... తన కుమారుడు రాజారెడ్డి పుట్టినరోజున ఆయనకు విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. షర్మిల కొడుకుతో దిగిన అరుదైన ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోను ట్వీట్ చేస్తూ కొడుకుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్ డే రాజా.. హ్యాపీనెస్ ఆల్వేస్...ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాననే క్యాప్షన్ పెట్టి కొడుకుపై షర్మిల ప్రేమను చాటుకున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏదో వెకేషన్ లో దిగిన ఫొటోను ఆమె షేర్ చేశారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి అమెరికాలో చదువుతున్నారు. అంతేకాదు రాజారెడ్డి బాక్సింగ్ వంటి క్రీడల్లో ఛాంపియన్ అని అప్పట్లో వార్తలు వచ్చాయి. షేర్ చేసిన ఫొటోలో షర్మిల కాస్త మోడ్రన్ లుక్ లో కనిపించడంతో ఫొటో వైరల్ అయింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్ గా వైఎస్ షర్మిల విమర్శలు చేస్తుంటారు. తాజాగా మిషన్ భగీరథపై ట్వీట్ చేశారు.
పండుగ లేదు.. పబ్బం లేదు.. ప్రతి రోజు పనిచేస్తూ.. కాంట్రాక్టర్ల వేధింపులకు గురవుతూ.. గ్రామీణ జనానికి నీళ్లు అందిస్తున్న 15 వేల మంది మిషన్ భగీరథ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా.. కనీస వేతనాలు లేకుండా.. చట్టబద్ధ హక్కులను కాలరాస్తూ.. కడుపు కొడుతున్నారు..
— YS Sharmila (@realyssharmila) December 19, 2022
1/3