Hyderabad Crime News: ప్రియుడితో ఏకాంతంగా భార్య.. ఇంతలో భర్త ఎంట్రీ, చివరికి ఏమైందంటే..
పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ వివాహిత.. అకస్మాత్తుగా ఇంటికి వచ్చిన భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది. తన నిర్వాకం భర్తకు తెలిసిపోవడంతో దారుణానికి పాల్పడింది.
పరాయి వ్యక్తులతో వివాహేతర సంబంధాలు, ఇతరులతో సహజీవనాలు ఎంతటి విషాదానికి దారి తీస్తున్నాయో తరచూ వెలుగులోకి వస్తున్న సంఘటనలతో అర్థమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లో అలాంటి మరో ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ఓ భార్య తన భర్తను వదిలించుకోవాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో ఏకంగా భర్తను హత్య చేయించి పోలీసులకు దొరికిపోయింది. పూర్తి వివరాలివీ..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాన్గార్ బస్తీకి చెందిన హోటల్ కార్మికుడు రోషన్(23)కు అదే బస్తీకి చెందిన లతకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. లతకు అదే బస్తీకి చెందిన యువరాజు(28) అనే యువకుడితో కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. భర్త రోషన్ ఇంట్లో లేని సమయంలో ఆమె తన ప్రియుడు యువరాజుతో సన్నిహితంగా ఉండేది.
Also Read: Sagar MLA: సింహాలతో కలిసి టీఆర్ఎస్ ఎమ్మెల్యే నడిచిన వీడియోలు వైరల్... వాటికి రామ్‌గోపాల్ వర్మ ప్రచారం...
అలా కొన్ని రోజులు గడిచాక వీరి వివాహేతర సంబంధానికి ఆమె భర్త రోషన్ అడ్డువస్తున్నాడని భార్య భావించింది. దీంతో భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం యువరాజు, లత ఇంట్లో ఏకాంతంగా ఉన్న సమయంలో ఉన్నట్టుండి ఆమె భర్త రోషన్ వచ్చాడు. రెడ్‌హ్యాండెడ్‌గా ఇద్దరూ పట్టుబడడంతో ఏం చేయాలో తోచక ప్రియుడు యువరాజుతో కలిసి భర్తను కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ విషయం స్థానికులు ద్వారా పోలీసులకు తెలియడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అప్పటికే ఆమె భర్త రక్తపుమడుగులో పడి చనిపోయి ఉండడంతో పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించేందుకు శవాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి భార్య లత సహా ఆమె ప్రియుడు యువరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. క్లూస్ టీమ్ సిబ్బంది వచ్చి రక్త నమూనాలను కూడా సేకరించారు. ఇదిలా ఉండగా ప్రియుడు యువరాజ్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.