Bandi Sanjay Paadayatra : బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి, పోలీసుల నోటీసులు సస్పెండ్
Bandi Sanjay Paadayatra : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. పోలీసులు ఇచ్చిన నోటీసులను కోర్టు సస్పెండ్ చేసింది.
Bandi Sanjay Paadayatra : బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. వరంగల్ పోలీసులు ఇచ్చిన నోటీసులను హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో బండి సంజయ్ పాదయాత్రకు లైన్ క్లియర్ అయింది. ఆగిన చోట నుంచి బండి సంజయ్ యాత్ర కొనసాగునుందని ఆ పార్టీ వర్గాలు తెలిపారు. ఈ నెల 27న వరంగల్ బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది.
27న భారీ సభ
ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా జనగామ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర నిలిపివేయాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే వర్దన్నపేట ఏసీపీ ఇచ్చిన నోటీసులను హైకోర్టు గురువారం సస్పెండ్ చేసింది. పోలీసులు ఇచ్చిన నోటీసులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద ఈ నెల 27న ప్రజా సంగ్రామ యాత్రను ముగించనున్నట్లు ఇప్పటికే బండి సంజయ్ ప్రకటించారు. పాదయాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తారని సమాచారం. పాదయాత్రకు అనుమతి రావడంతో రూట్ మ్యాప్ పై టీమ్ తో బండి సంజయ్ మాట్లాడారు.
పాంనూర్ నుంచే పాదయాత్ర
జనగామ జిల్లా జాఫర్‌గడ్ మండలం పాంనూర్ నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభించేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. బండి సంజయ్ ఈ రాత్రికి పాంనూర్ చేరుకోనున్నారు. రెండు రోజులుగా నిలిచిపోయిన యాత్రను శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారు బండి సంజయ్. ఇప్పటికే పలు జిల్లాలో పాదయాత్ర నిర్వహించారు. జనగామ జిల్లాలో ప్రస్తుతం పాదయాత్ర కొనసాగుతోంది. బండి సంజయ్ గ్రామాలు, పట్టణాల్లో రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. అయితే ఇటీవల బండి సంజయ్ పాదయాత్రను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ వర్గాలు బాహాబాహీకి దిగాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడికి యత్నించిన బీజేపీ నేతలు అరెస్టు చేశారు. అవి అక్రమ అరెస్టులను బండి సంజయ్ ఆరోపించారు. పాదయాత్రలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి కరీంనగర్ లోని ఇంటికి తరలించారు. అనంతరం పోలీసులు పాదయాత్రను నిలిపివేయాలని నోటీసులు ఇచ్చారు. పాదయాత్ర కొనసాగించే పక్షంలో చట్ట చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @bandisanjay_bjp ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా
— BJP Telangana (@BJP4Telangana) August 25, 2022
భారీ బహిరంగ సభ
ముఖ్య అతిథి : శ్రీ @JPNadda బిజెపి జాతీయ అధ్యక్షులు
🗓ఆగస్ట్ 27న
⏱మ. 3 గం.లకు
📌ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్, హన్మకొండ pic.twitter.com/zGnIrNOMTj
Also Read : Who Is Raja Singh : ధూల్ పేట హిందూత్వ బ్రాండ్ - రాజాసింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఎంత వివాదాస్పదమంటే ?
Also Read : MP Dharmapuri Arvind : అన్ని పార్టీలను వీక్ చేయడమే మా లక్ష్యం - బీజేపీ ఎంపీ అర్వింద్