News
News
X

CM KCR : మోదీ వల్ల తెలంగాణకు రూ.3 లక్షల కోట్లు నష్టం, ఈ లెక్కల్లో ఒక్క అబద్ధం ఉన్నా రాజీనామాకు సిద్ధం - సీఎం కేసీఆర్

CM KCR : కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ రూ.3 లక్షల కోట్లు నష్టంపోయిందని సీఎం కేసీఆర్ ఆరోపించారు.

FOLLOW US: 
Share:

CM KCR : తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ వివక్ష చూపిస్తుందని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఆదివారం అసెంబ్లీలో ద్రవ్య, వినిమయ బిల్లుపై చర్చలో కేసీఆర్ మాట్లాడారు. ఈ చర్చలో కేంద్రంపై మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన నిధులు కేటాయించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు ఏపీ ఖాతాలో వేశారని, వాటిని రాష్ట్రానికి ఇప్పించమంటే ఏడేళ్లుగా తిప్పుతున్నారన్నారు. మేం ఏంచేయం, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లు కేంద్రం ప్రవర్తిస్తుందన్నారు. భారతీయులకు అమెరికాలో గ్రీన్ కార్డు వస్తే పెద్ద పండగ చేసుకునే పరిస్థితులు వచ్చాయన్నారు. గత 8 ఏళ్లలో 20 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారని తెలిపారు. ఇలాంటి దౌర్భాగ్యం మనకెందుకని కేసీఆర్ ప్రశ్నించారు.  మోదీ అధికారంలోకి వచ్చాక జీడీపీ పడిపోయిందన్నారు. మన్మోహన్ వర్సెస్ మోదీ ప్రభుత్వాలను పోల్చిచెప్పిన కేసీఆర్... తాను చెప్పిన లెక్కల్లో ఒక్క అబద్ధం ఉన్నా రాజీనామాకు సిద్ధమన్నారు. 

కేసీఆర్ నోట ఈటల పేరు 

 "ఇదే సభలో కిరణ్ కుమార్ రెడ్డి అనే ముఖ్యమంత్రి మాట్లాడారు. నేను నిలబడ్డ ప్లేస్ లోనే మాట్లాడారు. అప్పట్లో తెలంగాణకు నిధులు ఇవ్వాలని రాజేందర్, హరీశ్ రావు పోట్లాడారు. మీరు ఏంచేసుకుంటారో చేసుకోండి అని కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడేమైంది కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడున్నారు. ఏంచేసుకుంటే చేసుకోండి అంటే అక్కడికి వస్తుంది పరిస్థితి. అంత మితిమీరి ప్రవర్తించకూడదు. అధికారం ఉంది కదా అని మితిమీరి వ్యవహరించకూడదు. ప్రధాని ఉపన్యాసాలు చూస్తుంటే మూడేసి గంటలు ఓహో అన్నట్లు ఉన్నాయి. కానీ వెనకతిరిగి చూస్తే కనీసం మంచినీళ్లు కూడా లేవు. ఎక్కడా దేశ రాజధాని దిల్లీలో మంచినీళ్లకు దిక్కులేదు. ప్రధాని ఉపన్యాసాలు మాత్రం దేశం ఎక్కడితో పోతుందన్నట్లు ఉంటాయి. కానీ దేశంలో పరిస్థితులు మాత్రం మారలేదు. దేశంలో ఎంతో సంపద ఉంది, ఖనిజాలు ఉన్నాయి. వాటిని సక్రమంగా వినియోగించుకుని అభివృద్ధి చేయాలి." - సీఎం కేసీఆర్ 

మన్మోహన్ వర్సెస్ మోదీ 

"అమెరికాలో తమ పిల్లగానికి గ్రీన్ కార్డు దొరికితే వాళ్ల తల్లిదండ్రులు ఇక్కడ దావత్ చేసుకుంటున్నారు. అంటే ఎక్కడున్నాం మనం. ఇప్పటికి 20 లక్షల మంది బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుంచీ ఇండియన్ పౌరసత్వం వదులేసుకున్నాం. సిటిజన్ షిప్ వదిలేసుకునే దౌర్భాగ్యం ఎందుకు?. 2014లో కాంగ్రెస్ వీక్ అయిపోయింది కాబట్టి మోదీ గెలిచారు. మన్మోహన్ సింగ్ మోదీ కన్నా ఎక్కువ చేశారు, కానీ ఆయనకు ప్రచారం చేసుకోవడం రాదు. బీజేపీ వాళ్లు మన్మోహన్ సింగ్ ఏం చేయలేదని ప్రచారం చేసి మేం ఏదో చేసేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. మోదీ అధికారంలోకి వచ్చాక ద్రవ్యోల్భణం పెరిగిపోయింది, ప్రజలు పౌరసత్వం వదులుకుని వెళ్లిపోతున్నారు, పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారు. ఇది నేను చెప్పింది కాదు ది లాస్ట్ డికేడ్ అనే పుస్తకం రాసిన ఓ ఆర్థికవేత్త చెప్పారు. ఆయన పదేళ్ల మన్మోహన్ సింగ్, మోదీ ప్రభుత్వాలను కంపేర్ చేసి పుస్తకం రాశారు. బీజేపీ గెలిచింది భారత దేశ ప్రజలు ఓడిపోయారు. భారతదేశ ఓటమిలో భాగంగా తెలంగాణ కూడా కొంత భాగం ఓడిపోయింది. మోదీ ప్లేస్ లో మన్మోహన్ సింగ్ ఉన్నా, తెలంగాణ సాధించిన అభివృద్ధి దేశం సాధించినా... ఇప్పుడు తెలంగాణ జీఎస్డీపీ 16 లక్షల కోట్లు ఉండాలి కానీ ఇప్పుడు 13 లక్షల కోట్లు మాత్రమే ఉంది. మోదీ ప్రభుత్వం వల్ల తెలంగాణ రూ.3 లక్షల కోట్లు కోల్పోయింది. మోదీ ప్రభుత్వంలో ప్రతీ రంగంలో గ్రోత్ క్షీణించింది." - సీఎం కేసీఆర్ 

దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది

"మన్మోహన్ సింగ్ బాగా పనిచేసినా బీజేపీ బద్నాం చేసింది. మోదీ కంటే మన్మోహన్‌సింగ్ ఎక్కువ పనిచేశారు. కాంగ్రెస్ బాగా పనిచేయలేదని 2014లో మోదీకి ఓటేశారు. పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది. మన్మోహన్‌ కన్నా మోదీ పాలనలో దేశం ఎక్కువ నష్టపోయింది. ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లతో రాజకీయమేంది?  నువ్వెన్ని ప్రభుత్వాలు కూలగొట్టావంటే నువ్వెన్ని అంటూ మోదీ, రాహుల్‌ గొడవపడుతున్నారు. దేశం పరిస్థితి క్రిటికల్‌గా ఉంటే మోదీ మాట్లాడరు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా రాలేదు. ఇదేనా ఫెడరల్ వ్యవస్థ?. మనకు రావాల్సిన రూ.470 కోట్లు ఏపీకి ఇచ్చారు. మావి మాకు ఇవ్వాలని ఏడేళ్ల నుంచి అడుగుతున్నాం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న మోదీ దిల్లీకి కూడా నీళ్లు ఇవ్వడం లేదు. పరిశ్రమలు మూతబడుతున్నాయ్.. బీజేపీ అధికారంలోకి వచ్చాక 20 లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదిలేశారు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది?" -సీఎం కేసీఆర్

Published at : 12 Feb 2023 04:08 PM (IST) Tags: BJP Hyderabad PM Modi TS Assembly session budget session CM KCR

సంబంధిత కథనాలు

TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో 15 మంది అరెస్ట్, ప్రవీణ్ ఇంట్లో నగదు స్వాధీనం

TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో 15 మంది అరెస్ట్, ప్రవీణ్ ఇంట్లో నగదు స్వాధీనం

Covid19 Cases: కొవిడ్ కేసుల పెరుగుద‌ల‌తో ఏపీ అలర్ట్ - తెలంగాణను భయపెడుతున్న H3N2 కేసులు

Covid19 Cases: కొవిడ్ కేసుల పెరుగుద‌ల‌తో ఏపీ అలర్ట్ - తెలంగాణను భయపెడుతున్న H3N2 కేసులు

Super Speciaity Hospital: దేశంలో తొలిసారిగా 24 అంతస్తుల ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మన దగ్గరే!

Super Speciaity Hospital: దేశంలో తొలిసారిగా 24 అంతస్తుల ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మన దగ్గరే!

Dharmapuri Sanjay On DS : డీఎస్ కు ప్రాణ హాని ఉంది, ఎంపీ అర్వింద్ పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Dharmapuri Sanjay On DS :  డీఎస్ కు ప్రాణ హాని ఉంది, ఎంపీ అర్వింద్ పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Nizamabad కాంగ్రెస్‌ పార్టీలో లుకలుకలు - టీపీసీసీ చీఫ్ రేవంత్ ఏం చేయనున్నారో!

Nizamabad కాంగ్రెస్‌ పార్టీలో లుకలుకలు - టీపీసీసీ చీఫ్ రేవంత్ ఏం చేయనున్నారో!

టాప్ స్టోరీస్

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

KKR New Captain: కేకేఆర్‌కు కెప్టెన్సీ కష్టాలు! గంభీర్‌ తర్వాత మూడో కెప్టెన్‌!

KKR New Captain: కేకేఆర్‌కు కెప్టెన్సీ కష్టాలు! గంభీర్‌ తర్వాత మూడో కెప్టెన్‌!