అన్వేషించండి

Mlc Kavitha : దిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి- సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ

Mlc Kavitha :దిల్లీ మద్యం కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతుంది. సీబీఐ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ కేసు ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ కాపీలను అందించాలని కోరారు.

Mlc Kavitha : దిల్లీ లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని సీబీఐ ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ కేసు ఫిర్యాదు కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని సీబీఐని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత సీబీఐ అధికారి అలోక్ కుమార్ కు లేఖ రాశారు. సాధ్యమైనంత త్వరగా కాపీ అందించాలని కోరారు. దిల్లీ మద్యం షాపుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని కేంద్ర హోంశాఖ సీబీఐకి ఫిర్యాదు చేసింది. 

సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసులు 

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వివరణ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ కేసులో వివరణ ఇచ్చేందుకు తన వద్దకు రావాలని ఆమె కోరారు. శుక్రవారం ఎమ్మెల్సీ కవితకు సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసులు ఇచ్చింది సీబీఐ. దానిపై కవిత స్పందిస్తూ ఇవాళ సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహికి లేఖ రాశారు.  సీబీఐకి కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా సంబంధిత కాపీలను అందించాలన్నారు. ఈ కాపీలు అందిన తర్వాత వివరణ ఇచ్చేందుకు మీటింగ్ ఫిక్స్ చేయవచ్చని సూచించారు. 

Mlc Kavitha : దిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి- సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ

సీబీఐకి ఎంట్రీ ఉంటుందా? 

 టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు శుక్రవారం సీబీఐ నోటీసులు ఇచ్చింది. దిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే ఈడీ రిమాండ్ రిపోర్టులో కవిత పేరు చేర్చారు.   లిక్కర్ స్కామ్ లో కవిత వివరణ తీసుకునేందుకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 6న విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసుల్లో తెలిపింది. దిల్లీ, హైదరాబాద్ లో ఎక్కడైనా హాజరుకావొచ్చని సీబీఐ చెప్పింది. వెంటనే కవిత తాను హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే వివరాలు తెలుసుకోవడానికి అనుమతి ఇచ్చానని ప్రకటించారు. అయితే ఇప్పుడు చాలా మందికి వస్తున్న డౌట్ ఏమిటంటే.. హైదరాబాద్‌లో సీబీఐ ఎంట్రీకి ఎప్పుడో రెడ్ సిగ్నల్ వేశారు. జనరల్ కన్సెంట్ రద్దు చేశారు. మరి ఇప్పుడు సీబీఐ తెలంగాణలోకి ఎలా ఎంట్రీ ఇస్తుంది ? తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి ఇవ్వాల్సిన  ‘సాధారణ సమ్మతి’ని ఉపసంహరించుకుంది. ఈ ఏడాది ఆగస్టు 30నే ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.  ఆ జీవో ప్రకారం ఇకపై రాష్ట్రంలో సీబీఐ ఏ కేసు విషయంలో రాష్ట్రంలో దర్యాప్తు జరపాలన్నా ముందుగా ఆ వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి, అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం ఇచ్చే అనుమతి మేరకే సీబీఐ కేసు దర్యాప్తులో ముందుకెళ్లాల్సి వస్తుంది. దేశరాజధాని ఢిల్లీ మినహా ఏ రాష్ట్రంలో సీబీఐ తన అధికారాల్ని వినియోగించుకోవాలన్నా ఆ రాష్ట్రం సాధారణ సమ్మతి తెలపాల్సి ఉంటుంది.  రాష్ట్రాల సాధారణ సమ్మతి లేకుంటే మాత్రం.. ఏ రాష్ట్రంలోనూ సీబీఐ నేరుగా వెళ్లి దర్యాప్తు చేసేందుకు వీలులేదు. అయితే కవితను విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. 

ఈడీ రిమాండ్ రిపోర్టులో కవిత పేరు  

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత పేరు దిల్లీ లిక్కర్ స్కాంలో ఇటీవల వెలుగులోకి వచ్చింది. దిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు అత్యంత సన్నిహితుడైన అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్టును కోర్టులో సమర్పించింది. అందులో కవిత పేరును ప్రస్తావించింది. సౌత్ గ్రూప్ నుంచి రూ. 100 కోట్లను అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు చేర్చారని ఈడీ తేల్చింది. ఈ విషయాన్ని  అరోరా అంగీకరించారని కోర్టుకు తెలిపింది. ఈ డీల్‌ను సౌత్ గ్రూప్ నుంచి శరత్ రెడ్డి, కవిత చూసుకోగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సమన్వయపరిచారని ఈడీ అంటోంది. ఈ మొత్తం స్కామ్ గురించి బయటకు రాకుండా ఎప్పటికప్పుడు వారంతా ఫోన్లు మార్చారని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. కవిత కూడా ఫోన్లు మార్చారని వాటిని దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్టులో తెలిపింది.  అమిత్ అరోరా దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అమిత్ సన్నిహితుడు.  ఇక దిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. గురుగాంకు చెందిన అమిత్ అరోరా ,దినేష్ అరోరా, అర్జున్ పాండేలతో కలిసి పాలసీని రూపొందించడంలో కీలకంగా పనిచేసినట్లు ఈడీ చెబుతోంది. వీరిలో దినేష్ అరోరా ఇప్పటికే అప్రూవర్‌గా మారారు.  అమిత్ అరోరా బడ్జీ అనే  ప్రైవేట్ కంపెనీ యజమానిగా ఉన్నాడు.  సీబీఐ, ఈడీ ఎఫ్ఐఆర్ లో అమిత్ అరోరా 9వ నిందితునిగా ఉన్నాడు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Delhi Minister Kailash Gehlot Resigns : ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Delhi Minister Kailash Gehlot Resigns : ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
IPL 2025 Mega Auction: 2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఐపీఎల్‌ మెగా ఆక్షన్‌కు వచ్చే ప్లేయర్ల లిస్ట్ ఇదే
2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఐపీఎల్‌ మెగా ఆక్షన్‌కు వచ్చే ప్లేయర్ల లిస్ట్ ఇదే
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Pushpa 2 Trailer Launch Live Updates: అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
Embed widget