By: ABP Desam | Updated at : 22 Jan 2023 07:57 AM (IST)
Edited By: Satyaprasad Bandaru
రేవంత్ రెడ్డి
Revanth Reddy : హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంపై చర్చించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం నాంపల్లి గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ 3500 కి.మీ 150 రోజులుగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు జోడో యాత్ర సాగిస్తున్నారన్నారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టేందుకు 150 కోట్ల దేశం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు రాహుల్ గాంధీ జోడో యాత్ర మొదలు పెట్టారన్నారు. భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రతీ గుండెకు చేరవేయడానికే హాత్ సే హాత్ జోడో యాత్ర చేపడుతున్నామన్నారు. నాగర్ కర్నూల్ లో ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లిన నాగంపై బీఆరెస్ నేతల దాడిపై కూడా సమావేశంలో చర్చించామన్నారు. దాడులకు పాల్పడిన వారిపై కాకుండా బాధితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని మండిపడ్డారు. మహిళను అవమానించారని నాగం జనార్దన్ రెడ్డిపై కూడా కేసు పెట్టారని ఆరోపించారు. నాగం వల్ల ఎలాంటి అవమానం జరగలేదని డీఐజీ దగ్గర మహిళా సర్పంచ్ స్టేట్ మెంట్ ఇచ్చారని రేవంత్ రెడ్డి తెలిపారు. అయినా ప్రభుత్వం తన తప్పు దిద్దుకోలేదన్నారు. అందుకే ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా నాగర్ కర్నూల్ లో ఆదివారం దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు పార్టీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే తో పాటు ముఖ్య నాయకులంతా హాజరవుతారని వెల్లడించారు. భద్రతా కారణాల చూపి జనవరి 26న కశ్మీర్ లో రాహుల్ గాంధీ జాతీయ జెండా ఎగరేయకుండా బీజేపీ కుట్ర చేసిందని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ లో జెండా ఎగరేసి తీరాల్సిందేనని రాహుల్ నిర్ణయం తీసుకున్నారని, ఈ నెల 30న కశ్మీర్ లో రాహుల్ జాతీయ జెండా ఎగరవేస్తారన్నారు. తెలంగాణ ముఖ్య నాయకులంతా భారత్ జోడో యాత్ర ముగింపు సభకు బయలుదేరి వెళతామన్నారు. అందుకే హాత్ సే హాత్ జోడో యాత్రను కొద్దిరోజులు వాయిదా వేసుకున్నామని తెలిపారు.
పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడొద్దు
ఫిబ్రవరి 6 నుంచి 60 రోజులపాటు ఏకధాటిగా హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫిబ్రవరి 6న హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి సోనియాగాంధీ లేదా ప్రియాంకా గాంధీని ముఖ్య అతిధిగా ఆహ్వానించాలని తీర్మానించామన్నారు. ఫిబ్రవరి 6 లోగా కొత్త డీసీసీలు బాధ్యతలు తీసుకుంటారన్నారు. జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా, పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బాధ్యతగా పనిచేయనివారిని తప్పించి కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎవరైనా బహిరంగంగా మాట్లాడొచ్చు కానీ పార్టీకి నష్టం కలిగించేలా ఉండకూడదని ఠాక్రే సూచించారని తెలిపారు. పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఫిబ్రవరి 6 నుంచి హాత్ సే జోడో యాత్ర
తెలంగాణలో ఫిబ్రవరి 6 నుంచి హాత్ సే జోడో యాత్ర ప్రారంభమవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఫిబ్రవరి 6 నుంచి మొదలయ్యే పాదయాత్ర 60 రోజులపాటు సాగుతుందన్నారు. భద్రాచలం లేదా మహబూబ్ నగర్ లేదా ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రతీ గుండెకు చేరవేయడానికే హాత్ సే హాత్ జోడో యాత్ర చేపడుతున్నామని వెల్లడించారు. వాస్తవానికి జనవరి 26 కశ్మీర్ లో రాహుల్ గాంధీ యాత్ర ముగిసే రోజు తెలంగాణలో యాత్ర మొదలు పెట్టాలనుకున్నామని, కానీ భద్రతా కారణాల చూపి జనవరి 26న కశ్మీర్ లో రాహుల్ గాంధీ జాతీయ జెండా ఎగరేయకుండా బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్, ఫిబ్రవరి 3 నుంచి శాసనసభ సమావేశాలు, ఫిబ్రవరి 5న రాష్ట్ర బడ్జెట్ ఉండే అవకాశం ఉండడంతో... హాత్ సే హాత్ జోడో యాత్రను ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ యాత్రలో హాత్ సే హాత్ సే జోడో యాత్ర స్టిక్కర్, రాహుల్ గాంధీ గారి లేఖ, మోదీ, కేసీఆర్ వైఫల్యాలపై చార్జీషీటు వంటి కార్యక్రమాలనకు ఏఐసీసీ కార్యక్రమాలు అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి, సంపత్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతాయని తెలిపారు. బాధ్యతగా పని చేయని వారిని తప్పించి కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ఈ యాత్రలో పాల్గొనని వారిపై కూడా చర్యలుంటాయని హెచ్చరించారు. పార్టీ శ్రేయస్సు కోసం ఎవరైనా బహిరంగంగా మాట్లాడొచ్చు కానీ పార్టీకి నష్టం కలిగించేలా ఉండకూడదని ఠాక్రే సూచించారని తెలిపారు. ఫిబ్రవరి 6 లోగా కొత్త డీసీసీ లు బాధ్యతలు తీసుకుంటారని రేవంత్ రెడ్డి తెలిపారు.
నేను ఎవరికీ అనుకూలం కాదు
"నేను ఎవరికీ అనుకూలం కాదు వ్యతిరేకం కాదు. అలాంటి ఆలోచన పక్కన పెట్టండి. అధిష్టానం చెప్పింది చేయడమే నా విధి. ఎముకలు కోరికే చలిలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు. యాత్ర లక్ష్యాలను ఇంటింటికీ తీసుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉంది. హాథ్ సే హాథ్ జోడో యాత్ర తో రాహుల్ సందేశాన్ని గడప గడపకు తీసుకు వెళ్లండి. నేతలంతా ఐక్యంగా హాథ్ సే హాథ్ జోదో యాత్ర చేయండి. రేవంత్ రెడ్డి 50 నియోజక వర్గాలకు తగ్గకుండా యాత్ర చేస్తారు. మిగిలిన సీనియర్లు కూడా 20, 30 నియోజక వర్గాల్లో యాత్ర చేయండి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హాథ్ సే హాథ్ ను ప్రతి ఒక్కరూ సక్సస్ చేయాలి. అంతా ఐక్యంగా పని చేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలువడం, అధికారంలోకి రావడం ఖాయం. సమస్యలు ఉంటే నాతో చెప్పండి. నాకు ఫోన్ చేయండి. ఎప్పుడూ అందుబాటులోనే ఉంటా. పార్టీకి నష్టం చేసేలా ఎవరూ మీడియా ముందు మాట్లాడొద్దు."- మాణిక్ రావు థాక్రే, టీ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్
TSLPRB: ఆ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్, హైకోర్టు ఆదేశాల మేరకు బోర్డు కీలక నిర్ణయం! ఏంటంటే?
Breaking News Live Telugu Updates: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Revanth Reddy Comments: ఉద్యమ సమయంలో జానారెడ్డి కాళ్ల మీద పడింది మరిచావా కేసీఆర్?: టీపీసీసీ చీఫ్
Global EduFest 2023: ఫిబ్రవరి 10న 'గ్లోబల్ ఎడ్యుఫెస్ట్ 2023' నిర్వహిస్తున్న ఐఎంఎఫ్ఎస్
Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి