అన్వేషించండి

Revanth Reddy : దిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఇల్లు ఎందుకు సోదా చేయలేదు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : ప్రజల్ని మోసం చేయడానికే టీఆర్ఎస్, బీజేపీ కలిసి డ్రామా ఆడుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పక్కనున్న ఏపీ సీఎం జగన్ ను ఎందుకు కలవలేదని ప్రశ్నించారు.

 Revanth Reddy : పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సేవలను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ  గుర్తుంచుకున్నారని, అందుకే ఆయన కుమార్తె స్రవంతిని మునుగోడు అభ్యర్థిగా ఎంపిక చేశారని టీపీసీసీఅధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.  అన్ని పార్టీల కంటే ముందు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిందన్నారు. అభ్యర్థులను ప్రకటించుకోలేని స్థితిలో టీఆర్ఎస్,  బీజేపీలు ఉన్నాయన్నారు. భయంతోనే ఆ పార్టీలు అభ్యర్థులను ప్రకటించడానికి వెనకాడుతున్నాయని విమర్శించారు. నియోజకవర్గంలో మండలాల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగించామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నారాయణ పూర్ మండల బాధ్యతలు తాను తీసుకుంటానన్నారు. ముఖ్య నాయకులందరినీ  నియోజకవర్గంలో ప్రచారానికి ఉపయోగించుకోవాలని నిర్ణయించామన్నారు. 

 నిరుద్యోగులక చావుకు టీఆర్ఎస్ కారణం 

"రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టేందుకు ప్రణాళికా బద్దంగా ముందుకెళతాం. సెప్టెంబర్ 18 నుంచి ప్రణాళిక బద్దంగా ప్రచారం నిర్వహిస్తాం.  బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలి. గుజరాత్ కు బులెట్ ట్రైన్ ఇచ్చుకున్నారు కానీ హైదరాబాద్ కు ఇవ్వలేదు. బీజేపీకి ఓటు అడిగే హక్కులేదు. టీఆర్ఎస్ పార్టీని ఉరివేసిన తప్పులేదు. గిరిజనుల భూములను ప్రభుత్వం గుంజుకుంటుంది. నిరుద్యోగుల చావుకు టీఆర్ఎస్ కారణం. రాష్ట్రం శవాల కుప్పలుగా మారడానికి కేసీఆర్ఎస్ కారణం"- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు 

టీఆర్ఎస్, బీజేపీ డ్రామా 

మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్ ను గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఒక్క దెబ్బకు ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పాలన్నారు. కమ్యూనిస్టులు ఆత్మ ప్రభోదానుసారం కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు.  టికెట్ ఆశించిన కృష్ణారెడ్డి, పల్లె రవి,  కైలాష్ లకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు.  కేసీఆర్ కుటుంబం నిర్వహిస్తున్న శాఖలు దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయని రేవంత్ విమర్శించారు. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. బీజేపీతో కలిసి ఉన్న పార్టీలను ఇప్పటి వరకు కేసీఆర్ కలవడం, బీజేపీని బలహీనపరచడం కాదని యూపీఎ భాగస్వాములను చీల్చి పరోక్షంగా బీజేపీకి బలం చేకూరుస్తున్నారని విమర్శించారు.  కేసీఆర్ చంద్రమండలంలో కూడా పార్టీ పెట్టుకోవచ్చన్నారు.  కేసీఆర్ పక్కనున్న సీఎం జగన్ ను కూడా కలవలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ రద్దయిన వెయ్యి రూపాయల నోటు లాంటివారని ఎద్దేవా చేశారు. ప్రజల్ని మోసం చేయడానికే టీఆర్ఎస్, బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామా అని రేవంత్ ఆరోపించారు. 

లిక్కర్ స్కాంపై బుద్దిలేని ప్రచారం 

లిక్కర్ స్కాం పై బీజేపీ బుద్దిలేని ప్రచారం చేస్తోంది. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు పదేపదే ఈ అంశంపై మాట్లాడుతున్నారు. సూదిని సృజన్ ఎవరితో కలిసి వ్యాపారం చేస్తున్నారో విచారణ చేయండి. ఆయనకు ఎవరితో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో తీయండి. ఎప్పుడైనా,ఎక్కడైనా, ఏ విచారణకైనా నేను సిద్ధమే. దిల్లీ లిక్కర్ స్కాం లో కవిత ఇల్లు ఇప్పటి వరకు సోదా చేయలేదు.-రేవంత్

Also Read : Munugodu Bypoll: మునుగోడులో కాంగ్రెస్‌ వ్యూహం ఫలించేనా ! కోమటిరెడ్డి బ్రదర్స్ వార్ తప్పదా !

Also Read : Munugode TRS Candidate : మునుగోడుపై తేల్చుకోలేకపోతున్న కేసీఆర్ - అభ్యర్థిత్వం ఎవరికో ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్
అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు
ITR: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
Paravada Gas Leak: పరవాడ ఫార్మాసిటీలో విషవాయువులు లీక్, నలుగురు సిబ్బందికి తీవ్ర అస్వస్థత
పరవాడ ఫార్మాసిటీలో విషవాయువులు లీక్, నలుగురు సిబ్బందికి తీవ్ర అస్వస్థత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్
అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు
ITR: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
Paravada Gas Leak: పరవాడ ఫార్మాసిటీలో విషవాయువులు లీక్, నలుగురు సిబ్బందికి తీవ్ర అస్వస్థత
పరవాడ ఫార్మాసిటీలో విషవాయువులు లీక్, నలుగురు సిబ్బందికి తీవ్ర అస్వస్థత
Chenab Rail Bridge: కాశ్మీర్ లోయలో రైల్వే ఇంజనీరింగ్ అద్భుతం, ప్రపంచంలోనే ఎత్తైన
కాశ్మీర్ లోయలో రైల్వే ఇంజనీరింగ్ అద్భుతం, ప్రపంచంలోనే ఎత్తైన "చినాబ్ రైల్ బ్రిడ్జ్ " విశేషాలివే
Congress vs Tollywood: సినీ ఇండస్టీని కాంగ్రెస్  ప్రభుత్వం టార్గెట్ చేసిందా ? సినీ పెద్దలపై ఎందుకంత పగ?
సినీ ఇండస్టీని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందా ? సినీ పెద్దలపై ఎందుకంత పగ?
AP Belt Shops: గ్రామాల్లో బెల్ట్‌ బాజా, గోదావరి జిల్లాల్లో ఎటు చూసినా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
గ్రామాల్లో బెల్ట్‌ బాజా, గోదావరి జిల్లాల్లో ఎటు చూసినా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
Embed widget