అన్వేషించండి

Revanth Reddy : ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ ధర్నా డ్రామాలు - ఈ పది ప్రశ్నలకు సమాధానం చెప్పు కేసీఆర్ : రేవంత్ రెడ్డి

Revanth Reddy On KCR : ధాన్యం కొనుగోలుపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోలు టీఆర్ఎస్ ధర్నా డ్రామాలు ఆడుతుందని విమర్శించారు.

Revanth Reddy On CM KCR : తెలంగాణ ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ దిల్లీలో రైతు దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో టీఆర్ఎస్ శ్రేణులు భారీగా పాల్గొన్నాయి. కేంద్రం 24 గంటల్లో ధాన్యం కొనుగోలుపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామన్నారు. అయితే టీఆర్ఎస్ దిల్లీ దీక్షపై సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పది ప్రశ్నలు సంధించారు. 

1. ఇకపై తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని 2021 అక్టోబర్ 4న సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసింది వాస్తవం కాదా? కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆ లేఖను అడ్డు పెట్టుకునే ధాన్యం సేకరణ పై మెలిక పెడుతున్న విషయం నిజం కాదా? తెలంగాణ రైతుల ప్రయోజనాలకు ఉరితాళ్లు బిగిస్తూ కేంద్రానికి లేఖ రాసే అధికారం మీకు ఎవరిచ్చారు. మీరే లేఖ ఇచ్చి ఇప్పుడు మీరే ధర్నాలు, నిరసనలు అని డ్రామాలు ఆడితే రైతులు మీ రెండు పార్టీల మోసాన్ని గ్రహించలేరనుకుంటున్నారా? 

2. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మీ చిత్తశుద్ధిపై రైతులకు మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 7,500 కోట్ల నష్టం వచ్చిందని, క్రయవిక్రయాలు ప్రభుత్వం బాధ్యత ఎంత మాత్రం కాదని, ఇకపై కొనుగోలు కేంద్రాలు ఉండబోవని 2021 ఫిబ్రవరిలో మీరు ప్రకటన చేసింది వాస్తవం కాదా? ధాన్యం కొనుగోళ్ల బాధ్యత నుంచి తప్పుకునే కుతంత్రానికి మీరు ఆ నాడే బీజం వేశారనడానికి ఇది నిదర్శనం కాదా?

3. యాసంగి సీజన్ సన్నాహాలపై ఫిబ్రవరి 25, మార్చి 8న కేంద్ర ఆహారశాఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ సారి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనబోదు, కొనుగోలు కేంద్రాలు ఉండవు అని మీ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్పిన మాట వాస్తవం కాదా? FCI యాసంగి ప్రణాళికలో తెలంగాణకు చోటు దక్కకపోవడానికి ఇది కారణం కాదా?

4. యాసంగి ధాన్యం సేకరణ సన్నాహకాలు సహజంగా మార్చి మొదటి వారంలోనే ప్రారంభించాలి కదా! నిజంగా ధాన్యం కొనుగోలుపై మీకు చిత్తశుద్ధి ఉంటే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గోనె సంచులకు టెండర్లు, రైస్ మిల్లర్లకు కోటా కేటాయింపు, ట్రాన్స్ పోర్టేషన్ టెండర్లు తదితర ప్రక్రియను ఇంత వరకు ఎందుకు పూర్తి చేయలేదు?

5. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బ్లేమ్ గేమ్ తో ఇప్పటికే రైతులు దళారీల చేతుల్లో నష్టపోతున్న విషయం నిజం కాదా? కనీస మద్దతు ధర రూ.1960 ఉండగా మీరు చేతులెత్తేయడంతో రైతులు నిస్సహాయ స్థితిలో రైస్ మిల్లర్లకు రూ.1200 -1400 లకే ధాన్యం అమ్ముకుంటున్న మాట వాస్తవం కాదా? దీని వల్ల తెలంగాణ రైతాంగానికి సుమారు రూ.3000 కోట్ల మేర నష్టం వస్తుందన్న విషయం మీకు తెలియదా?

6. రైస్ మిల్లర్లతో టీఆర్ఎస్ నాయకులు కుమ్మక్కై రైతుల కష్టాన్ని దోచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిల్లర్ల మాఫియాతో కేసీఆర్ కుటుంబ సభ్యులే ఒప్పందాలు చేసుకుని రైతులను నిండా ముంచుతున్నారన్న ఆరోపణలకు మీ సమాధానం ఏమిటి?

7. డీ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్ మెంట్ సిస్టమ్ లో తెలంగాణ కూడా భాగస్వామిగా ఉంది. అంటే ఈ విధానంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం కొని ఎఫ్సీఐకి సరఫరా చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. మీ బాధ్యతను నెరవేర్చకుండా దిల్లీలో అతి కొద్ది గంటల నిరసన దీక్షల పేరుతో, అది పార్లమెంట్ సమావేశాలు ముగిసి ఎక్కడి వారు అక్కడకు వెళ్లిపోయాక డ్రామాలు చేయడం మీకు రాజకీయ ప్రయోజనాన్ని ఇస్తుంది తప్ప రైతు ధాన్యం కొనుగోలుకు పరిష్కారం ఎలా దొరుకుతుంది?

8. మీ ఈగోలతో రైతులనే కాదు రాష్ట్రంలో సివిల్ సప్లై కార్పొరేషన్ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నది వాస్తవం కాదా? సివిల్ సప్లై కార్పొరేషన్ సేకరించిన ధాన్యానికి ఎఫ్సీఐ 2.5 శాతం కమీషన్ చెల్లిస్తోంది. గత ఏడాది యాసంగి సీజన్ లో సివిల్ సప్లై కార్పొరేషన్ రూ.17,914 కోట్ల విలువైన 92 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా దానికి కమీషన్ గా రూ.447 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వహణ, ఉద్యోగుల వేతనాలు ఖర్చులన్నీ ఈ ఆదాయం నుంచే చెల్లిస్తున్నారు. కార్పొరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయాపైసా ఇవ్వడం లేదు. ఇప్పుడు ధాన్యం సేకరణ లేకపోతే కార్పొరేషన్ మనుగడే ప్రశ్నార్థకం కాదా?

9. క్వింటాల్ ధాన్యానికి సాధారణంగా ఎఫ్సీఐకి 67 కేజీల బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో 25 శాతం నూకలను ఎప్సీఐ ఆమోదిస్తోంది. అంటే, రైస్ మిల్లర్లు 51 కిలోల హెడ్ రైస్, 16 కిలోల నూకలతో కలిపి 67 కిలోలు సీఎంఆర్ కింద ఎఫ్సీఐకి డెలివరీ ఇస్తున్నారు. యాసంగిలో బాయిల్డ్ చేయకుండా నేరుగా ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 16 కిలోలకు బదులు 34 కిలోల నూక వస్తుంది. అంటే, ఎఫ్సీఐ ఆమోదించిన దానికంటే 18 కిలోలు అదనంగా వస్తుందన్న మాట. బియ్యంతో పోల్చితే నూకలకు సగం ధర మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎఫ్సీఐకి 67 కిలోలకు బదులు 58 కిలోలు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మిగతా తొమ్మది కిలోల నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. దీని విలువ తిప్పి కొట్టినా రూ.1500 కోట్లకు మించి కాదు. మీకు మీరు సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు కదా! ఈ మాత్రం లాజిక్ మీకు ఎందుకు అర్థం కావడం లేదు? రైతుల కోసం రూ.1500 కోట్లు ఖర్చు చేయడం మీకు ఇష్టం లేదా? పైగా వాళ్లను మిల్లర్ల చేతుల్లో పెట్టి రూ.3000 కోట్లు నష్టపోయేలా చేయడం మీ పాలనా దక్షతకు నిదర్శనంగా భావించాలా?

10. యాసంగి సీజన్ లో కూడా ముందస్తుగా చేతికి వచ్చే ధాన్యం రా రైస్ కిందకే వస్తుంది. మొదట్లో ఉష్ణోగ్రతలు అంతగా పెరగవు కనుక ఇది బాయిల్డ్ రైస్ కాదు. ఇలా ముందస్తుగా చేతికి వచ్చే ధాన్యం సుమారు 10 లక్షల టన్నుల వరకు ఉంటుందని అంచనా. ఇలా రా రైస్ గా వచ్చే ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి మీరు ఏర్పాట్లు చేయలేదంటే రైతులను నిండా ముంచాలన్న దురుద్ధేశం తప్ప ఇంకేం అనుకోవాలి?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Actor Govinda: అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
Embed widget