అన్వేషించండి

Hyderabad News: రజనీకాంత్ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం... నాలాలో ప్రమాదవశాత్తు పడి చనిపోయిన ఐటీ ఉద్యోగి.... గుత్తేదారుపై కేసు నమోదు

డ్రైనేజీ నాలాలో ప్రమాదవశాత్తు పడి చనిపోయిన ఐటీ ఉద్యోగి రజనీకాంత్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం నష్టం పరిహారం ప్రకటించింది. నిర్లక్ష్యంగా పనులు చేస్తున్న గుత్తేదారుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మణికొండలో ప్రమాదవశాత్తు నాలాలో పడి మృతి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రజనీకాంత్‌ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు మణికొండ మున్సిపాలిటీ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ వితోబాను సస్పెండ్‌ చేశారు. మరమ్మతులు జరుగుతున్న సమయంలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు, చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహించిన గుత్తేదారు రాజ్‌కుమార్‌పై నార్సింగ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.  ఈనెల 25న రాత్రి 9గంటల సమయంలో ప్రమాదవశాత్తు మరమ్మతుల కోసం తీసిన గుంతలో పడి రజనీకాంత్‌ గల్లంతయ్యారు. సోమవారం అతని మృతదేహం నెక్నాంపూర్‌ చెరువులో దొరికింది. 

అసలు ఏం జరిగింది...

హైదరాబాద్‌ మణికొండలో శనివారం రాత్రి డ్రైనేజీ గుంతలో పడి గల్లంతైన రజినీకాంత్‌ అనే యువకుడు మృతదేహం సోమవారం లభ్యమైంది. డ్రైనేజీ కలిసే నెక్నాంపూర్‌ చెరువులో మృతదేహం లభ్యమైంది. మూడు కిలోమీటర్ల దూరంలో రజనీకాంత్‌ మృతదేహం కొట్టుకొచ్చిన్నట్లు అధికారులు తెలిపారు. గోపిశెట్టి రజినీకాంత్‌ షాద్ నగర్​లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్​గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి 9 గంటలకు పెరుగు ప్యాకెట్‌ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన రజినీకాంత్ నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడిపోయారు. మూడు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్​బృందాలు, పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది  రజనీకాంత్ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. డ్రైనేజీ వెళ్లే మార్గంలో గాలించారు. 

Also Read:  మణికొండలో గల్లంతైన వ్యక్తి ఎవరో తెలిసింది.. 12 గంటల నుంచి నాలాలు, చెరువుల్లో ఆయన కోసం గాలింపు

గాలింపు చర్యలు

గులాబ్ తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గిన తర్వాత గాలింపు కొనసాగించారు. నెక్నాంపూర్‌ చెరువులో జేసీబీ సాయంతో గుర్రపుడెక్క తొలగించగా రజినీకాంత్‌ మృతదేహాన్ని బయటపడింది. మణికొండలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. సెక్రటేరియట్‌ కాలనీ గోల్డెన్‌ టెంపుల్‌ వద్ద నిర్మాణంలో ఉన్న మ్యాన్‌హోల్లోకి వరదనీరు చేరింది. రాత్రి 9.15గంటల సమయంలో కాలినడకన వెళ్తున్న రజనీకాంత్ ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యాడు. 

Also Read: గులాబ్ తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు... మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు

వైరల్ అయిన వీడియో

ఈ ప్రమాద దృశ్యాలు ఓ వ్యక్తి వర్షం వీడియో తీస్తుండగా అందులో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు, మణికొండ మున్సిపల్‌ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహకారంతో డ్రైనేజీ పొడవునా గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండానే పైపులైన్‌ పనులు చేపడుతున్నా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

 Also Read: మణికొండలో డ్రైనేజీలో పడి గల్లంతైన యువకుడు... 48 గంటల తర్వాత మృతదేహం లభ్యం...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget