అన్వేషించండి

పీక్ అవర్ ఛార్జీలు పెంచే ప్రసక్తేలేదు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్

పేదోడిపై భారాన్ని ఒప్పుకునే సవాలే లేదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. మోటార్లకు మీటర్ పెట్టనందుకే కేంద్ర ఇబ్బంది పెడుతుందన్నారు.

ట్రు-అప్ ఛార్జీలపై విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పీక్ అవర్ ఛార్జీలు పెంచే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. పేదోడిపై భారాన్ని ఒప్పుకునే సవాలే లేదని ప్రకటించారు. రూ. 12వేల కోట్ల భారాన్ని మోసేందుకు కేసీఆర్ సిద్ధంగా వున్నారని మంత్రి తెలిపారు. విద్యుత్ పీక్ డిమాండ్ సమయంలో 20% చార్జీలు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి.  కేంద్రం తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి ఆర్థిక ద్రోహానికి పాల్పడటమే అన్నారు. అలా చేస్తే సామాన్యుడిని విద్యుత్ వినియోగం నుంచి దూరం చెయ్యడమేనని మండిపడ్డారు. పేదోడిపై పడే ఏ భారాన్ని ఒప్పుకునే ప్రసక్తేలేదని  తేల్చిచెప్పారు. ట్రూ అప్ చార్జీల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే ఇందుకు నిదర్శనమన్నారు. ట్రూ అప్ చార్జీలు పెంచాలి అంటూ ఈఆర్సీ సిఫారసు చేసినా పట్టించుకోకుండా  రూ.12,000 కోట్ల అదనపు భారాన్ని భరించి, సామాన్యుడి మీద భారం పడకుండా చూసిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు.

పీక్ డిమాండ్ అంటే ఏంటి?

సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు! తిరిగి ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు కరెంటును వాడుకునే టైంనే పీక్ అవర్ డిమాండ్ అంటారు. ఈ సమయంలో సాధారణంగా కరెంటు వాడకం ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా ఈ టైంలోనే వినియోగదారులపై భారం మోపుతామంటూ కేంద్రప్రభుత్వం తాఖీదులు జారీచేస్తే, భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా లేదని మంత్రి స్పష్టం చేశారు. పీక్ డిమాండ్ లో 20% పెంచడమంటే అటు గృహ వినియోగదారులతో పాటు పారిశ్రామికరంగంపై మోయలేని భారం మోపినట్లు అవుతుందన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ మాయమాటలు చెప్పి, ఇప్పుడు విద్యుత్ వినియోగం నుండి సామాన్యుడిని దూరం చేసే కుట్రలకు తెర లేపారన్నారు. 2014కు ముందున్న ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయా వ్యాపారం చేస్తున్నాయా అంటూ అప్పటి ప్రభుత్వాలను తూలనాడి అధికారంలోకి వచ్చిన మోదీ.. ఇప్పుడు తాను అదే చేస్తున్నారన నిరూపించారన్నారు.

విద్యుత్ జీవితంలో బాగమైందని, విద్యుత్ వినియోగించకుండా ఉండలేని పరిస్థితులు ఉత్పన్బమైనాయని మంత్రి తెలిపారు. అటువంటి పరిస్థితులలో పేద ప్రజలకు ఇచ్చే సబ్సీడీలు ఎత్తివేసే చర్యలకు బిజెపి ప్రభుత్వం రూట్ మ్యాప్ రెడీ చేసిందని జగదీశ్‌ రెడ్డి విమర్శించారు. బాయకాడ మోటర్లకు మీటర్ పెట్టాలన్న కేంద్రప్రభుత్వ సిఫార్సులను పక్కన పడేసినందుకు మోదీ సర్కారు తెలంగాణపై కక్ష తీర్చుకుంటోందని మంత్రి విమర్శించారు. అందుకే FRBM పరిమితి కింద రావాల్సిన అప్పులను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అది పేదల పక్షంగానే ఉంటుందన్నారు. పీక్ డిమాండ్ సమయంలో 20% చార్జీలు పెంచాలన్న కేంద్రప్రభుత్వ సిఫారసుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తారని ఆయన పేర్కొన్నారు. జేబులకు చిల్లులు పెట్టడం...ప్రజలను చీకట్లోకి నెట్టడమే కేంద్రంలో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వ ఆలోచన అని ఆయన విమర్శించారు. అటువంటి దుర్మార్గాలకు చెల్లుచీటి పాడి మోదీ పాలనకు చరమగీతం పాడే రోజులు ఎంతోదూరంలో లేవని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు.

టాప్ హెడ్ లైన్స్

Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget