Actor Himaja: 'నేను అరెస్ట్ కాలేదు' - ఆ వార్తలపై స్పందించిన నటి హిమజ
Hyderabad News: రేవ్ పార్టీలో తాను అరెస్టైనట్లు వస్తోన్న వార్తలపై బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ నటి హిమజ స్పందించారు. అది నిజం కాదని దీపావళి సందర్భంగా ఇంట్లోనే హౌస్ పార్టీ చేసుకున్నామని వివరణ ఇచ్చారు.
Actor Himija Arrest: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధి జేబీ వెంచర్ లోని విల్లాలో మద్యం పార్టీపై శనివారం రాత్రి పోలీసులు దాడి చేసి నటి హిమజ సహా పలువురు సెలబ్రిటీలను అరెస్ట్ చేశారనే వార్త వైరల్ అవుతోంది. నటి హిమజ ఆధ్వర్యంలో ఈ రేవ్ పార్టీ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో భాగంగా ఎక్సైజ్ చట్టం కింద నటి హిమజతో పాటు మరికొందరిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారని, వారిని అదుపులోకి తీసుకున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై నటి హిమజ స్పందించారు. పోలీసులు వచ్చి చెక్ చేశారని, అంతే తప్ప తాను అరెస్ట్ కాలేదని, తప్పుడు వార్తలు ప్రచారం చెయ్యొద్దని ఇన్ స్టా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు.
హిమజ ఏం చెప్పారంటే?
'శనివారం నా కొత్త ఇంట్లో తొలిసారి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాం. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితో కలిసి పార్టీ చేసుకున్నా. ఎవరో, ఏదో అనుకుని రేవ్ పార్టీ అంటూ పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి మా ఇంటిని సోదా చేశారు. అందుకు మేము కూడా సహకరించాం. వాళ్ల విధిని వారు నిర్వర్తించారు. అయితే, దీన్ని రేవ్ పార్టీ అంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను అరెస్ట్ కాలేదు. అందరితో సంతోషంగా దీపావళిని చేసుకుంటుంటే అరెస్టై పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు వార్తలు ప్రచారం చేస్తున్నారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. దయచేసి దాన్ని ఎవరూ నమ్మొద్దు. ఈ రోజు ఇంట్లోనే పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నా. నన్ను అభిమానించే వారు ఆందోళన చెందొద్దు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.' అంటూ హిమజ ఇన్ స్టా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు.
View this post on Instagram
ఇదీ జరిగింది
పలు సీరియల్స్, సినిమాలు, షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి హిమజ. ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ, కొన్ని టీవీ షోల్లోనూ అలరిస్తున్నారు. ఇటీవలే ఆమె కొత్త ఇల్లు కట్టుకోగా, శనివారం రాత్రి ఇంట్లో పలువురు టీవీ, సినీ ప్రముఖులకు పార్టీ ఇచ్చారు. అయితే, దీనిపై ఎవరో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు హిమజ ఇంటికి వెళ్లి చెక్ చేశారు. దీంతో ఇది రేవ్ పార్టీ అని, ఆమెతో సహా 11 మంది సెలబ్రిటీలను అరెస్ట్ చేశారనే వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసినట్లు ప్రచారం జరగ్గా, హిమజ స్వయంగా ఈ వార్తలకు చెక్ పెడుతూ ఓ వీడియో విడుదల చేశారు.
Also Read: Minister KTR Comments: మరో రెండు వారాల్లో కొత్త కుట్రలు, రెడీగా ఉండండి - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు