Draupadi Murmu : జులై 12న హైదరాబాద్ కు ద్రౌపది ముర్ము, భారీ ర్యాలీ ప్లాన్ చేస్తున్న బీజేపీ!
Draupadi Murmu : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము జులై 12న హైదరాబాద్ రానున్నారు. తెలంగాణ మేధావులతో ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె పాల్గొంటారు.
![Draupadi Murmu : జులై 12న హైదరాబాద్ కు ద్రౌపది ముర్ము, భారీ ర్యాలీ ప్లాన్ చేస్తున్న బీజేపీ! Hyderabad NDA Presidential candidate Draupadi murmu telangana tour on july 12 Draupadi Murmu : జులై 12న హైదరాబాద్ కు ద్రౌపది ముర్ము, భారీ ర్యాలీ ప్లాన్ చేస్తున్న బీజేపీ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/09/b55740b31051ce2ba1919f38bbc790401657385446_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Draupadi Murmu : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన ఖరారు అయింది. జులై 12న ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆమె బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ద్రౌపది ముర్ముకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ద్రౌపది ముర్ము హైదరాబాద్ వస్తున్నారు. జులై 12న తెలంగాణ మేధావులతో ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె పాల్గొంటారు. ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటనలో భారీ ర్యాలీ చేపట్టేందుకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ ఎమ్మెల్యేలను కలిసేందుకు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఇవాళ కోల్‌కతా వెళ్లాల్సి ఉంది కానీ జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అకాలమరణం కారణంగా సంతాపం తెలుపుతూ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
ప్రతిపక్షాల్లో చీలిక
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రతిపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ప్రకటించారు. ఆయన పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ప్రతిపక్షాల మద్దతు కోరుతున్నారు. అయితే ఎన్డీయే తమ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును నిలబెట్టి ప్రతిపక్షాలపై ఆధిక్యం సాధించింది. ఇప్పుడు ప్రతిపక్ష ఐక్యతలో చీలికలు మొదలయ్యాయి. ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ చీఫ్ శివపాల్ యాదవ్ అనూహ్యంగా ఎన్డీయే అధ్యక్ష అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.
శివపాల్ మద్దతు ముర్ముకే
ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు తన మేనల్లుడు అఖిలేష్ యాదవ్‌తో జతకట్టిన శివపాల్ యాదవ్ శనివారం మాట్లాడుతూ, ఎస్పీ బలహీనపడుతోందని “రాజకీయ అపరిపక్వత” కారణంగా చాలా మంది నాయకులు వైదొలగుతున్నారని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం లక్నోకు వచ్చిన ముర్ము గౌరవార్థం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విందు ఏర్పాటుచేశారు. ఈ విందులో శివపాల్ యాదవ్ పాల్గొన్నారు. ఈ విందులో పాల్గొన్న ఒక రోజు తర్వాత ఆయన ముర్ముకు మద్దతు ప్రకటించారని ఏఎన్ఐ నివేదిక తెలిపింది. ముర్ముకు తన మద్దతును ప్రకటిస్తూ శివపాల్, ANIతో “నేను అడిగేవారికి ఓటు వేయబోతున్నానని నేను ఇప్పటికే చెప్పాను. సమాజ్‌వాదీ పార్టీ నన్ను పిలవలేదు, నా ఓటు అడగలేదు. సీఎం యోగి ఆదిత్యనాథ్ నిన్న నన్ను ఆహ్వానించారు, అక్కడ నేను NDA రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముని కలుసుకున్నాను. ఆమెకు ఓటు వేయాలని నిర్ణయించుకున్నాను.
యశ్వంత్ సిన్హాతో సమావేశానికి ఆహ్వానించలేదు-శివపాల్
“అఖిలేష్ యాదవ్‌లో రాజకీయ పరిపక్వత లేకపోవడం వల్ల, సమాజ్‌వాదీ పార్టీ బలహీనపడుతోంది. చాలా మంది నాయకులు పార్టీని వీడుతున్నారు. పార్టీ సమావేశాలకు నన్ను ఆహ్వానించరు. ప్రతిపక్ష రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో సమావేశానికి కూడా నన్ను ఆహ్వానించలేదు' అని శివపాల్ అన్నారు. శుక్రవారం జరిగిన విందులో శివపాల్ యాదవ్‌తో పాటు సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బిఎస్‌పి) చీఫ్ ఓం ప్రకాష్ రాజ్‌భర్, జనసత్తా దళ్ లోక్‌తాంత్రిక్ వ్యవస్థాపకుడు రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ 'రాజా భయ్యా' ఉత్తరప్రదేశ్‌లోని ఏకైక బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎమ్మెల్యే ఉమా శంకర్ సింగ్ కూడా కనిపించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)